మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

భారతదేశంలో ప్రత్యేకించి మొదటి సారిగా కారును కొనుగోలు చేసే వారు ప్రధానంగా హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకుంటుంటారు. ఇందుకు ప్రధాన కారణం, వాటి కాంపాక్ట్ డిజైన్. ఈ కార్లు చిన్నగా ఉండి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా నడపటానికి వీలుగా ఉంటాయి. అంతేకాకుండా, వీటి ధరలు కూడా సుమారు రూ.4 లక్షల నుండి రూ.10 లక్షల లోపే ఉంటాయి. ఇవి బడ్జెట్ కార్లే అయినప్పటికీ, వీటిలో దాదాపుగా ప్రీమియం కార్లలో లభించే అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీలు మరియు హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. గడచిన డిసెంబర్ నెలలోనూ ఈ ట్రెండ్ ఇలానే కొనసాగింది. ప్రస్తుతం, భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి అందిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ అగ్రస్థానంలో ఉంది. దాని కాంపాక్ట్ డిజైన్, ఎస్‌యూవీ స్టైల్ లుక్, విశాలమైన క్యాబిన్ స్పేస్, శక్తివంతమైన ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్ వంటి అంశాల కారణంగా వ్యాగన్ఆర్ కారును కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

వ్యాగన్ఆర్ కారుతో పాటుగా మరికొన్ని హ్యాచ్‌బ్యాక్ కార్లు కూడా అధికంగానే అమ్ముడవుతున్నాయి. గత సంవత్సరం చివరి నెలలో అత్యధికంగా విక్రయించబడిన మొదటి 10 హ్యాచ్‌బ్యాక్ కార్లలో మొత్తం 6 కార్లు మారుతి సుజుకి సంస్థకు చెదినవే ఉన్నాయి. మిగిలిన నాలుగు మోడళ్లలో 3 టాటా కార్లు మరియు 1 హుందాయ్ కారు ఉంది. ఈ టాప్-10 జాబితాలో మొదటి 4 స్థానాల్లో మారుతి సుజుకికి చెందిన హ్యాచ్‌బ్యాక్ కార్లే ఉ్ననాయి. మరి గడచిన డిసెంబర్ 2021 నెలలో అత్యధికంగా విక్రయించబడిన ఆ టాప్-10 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

ఈ జాబితాలో మారుతి సుజుకి అందిస్తున్న వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) మొదటి స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 19,729 వ్యాగన్ఆర్ కార్లు విక్రయించబడ్డాయి. ఇది 2020 డిసెంబర్‌లో విక్రయించిన 17,684 యూనిట్లతో వాటితో పోలిస్తే 11.56 శాతం అధికం. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కేవలం పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.ఇందులో కూడా 1.0 లీటర్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ అనే మూడు ట్రిమ్ లలో వివిధ వేరియంట్లలో లభిస్తుంది. ఇది సగటున లీటరుకు 20 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (Maruti Suzuki Swift). గత నెలలో మొత్తం 15,661 యూనిట్ల స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన మొత్తం 18,131 స్విఫ్ట్ కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 13.62 శాతం తగ్గాయి. మొత్తం హ్యాచ్‌బ్యాక్ కార్లలో వ్యాగన్ఆర్ మాత్రమే 20.84 శాతం ఆక్రమించగా, స్విఫ్ట్ 16.54 వాటా శాతంగా ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

మూడవ స్థానంలో మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (Maruti Suzuki Baleno) నిలిచింది. గత నెలలో భారత మార్కెట్లో మొత్తం 14,458 బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన 18,030 యూనిట్ల బాలెనో కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 19.81 శాతం తగ్గాయి. గత మూడు నెలల్లో భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మూడు మోడళ్లు కూడా ఇవే.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

డిసెంబర్ 2020 నెలలో 18,140 యూనిట్ల ఆల్టో (Maruti Suzuki Alto) కార్లను విక్రయించిన మారుతి సుజుకి, గత నెలలో కేవలం 11,170 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీంతో భారతదేశపు అత్యంత పాపులర్ కారు ఇప్పుడు నాల్గవ స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలించింది టాటా మోటార్స్ విక్రయిస్తున్న లేటెస్ట్ మోడల్ టాటా పంచ్ (Tata Punch) లాంచ్ పంచ్ ఉంది. గత నెలలో ఈ మైక్రో ఎస్‌యూవీ అమ్మకాలు 8,008 యూనిట్లుగా ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS) ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. గత నెలలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అమ్మకాలు 6,151 యూనిట్లుగా ఉన్నాయి. అయితే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (డిసెంబర్ 2020 నెలలో) కంపెనీ 10,000 యూనిట్లకు పైగా గ్రాండ్ ఐ10 నియోస్ కార్లను విక్రయించింది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారుకి పెరుగుతున్న క్రేజ్.. టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్..!

ఇక ఈ జాబితాలో చివరి నాలుగు స్థానాల వివరాలను గమనిస్తే, 5,656 యూనిట్లతో కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) 7వ స్థానంలో ఉండగా, 5,150 యూనిట్లతో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) 8వ స్థానంలో ఉంది. అలాగే, 5,150 యూనిట్లతో టాటా మోటార్స్ యొక్క అల్ట్రోజ్ (Tata Altroz) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 9వ స్థానంలో ఉండగా, 5,009 యూనిట్లతో టాటా టియాగో (Tata Tiago) 10 స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top 10 hatchbacks sold in december 2021 maruti suzuki wagonr leads the list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X