భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

ఈ వారంలో గడచిన ఐదు రోజులలో నాలుగు సార్లు పెట్రోల్ పెరిగాయి. ప్రతిసారి లీటరుకు 80 పైసల చొప్పున పెట్రోల్ ధరలను పెంచుతూ, ఈ ఐదు రోజులలో లీటరుకు రూ.3.20 పైసల చొప్పున ధరలను పెంచారు. గత నాలుగైదు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని కారణంగా చమురు కంపెనీ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు ఆ నష్టాలను కవర్ చేసుకోవాలంటే, చమురు కంపెనీలు సుమారు రూ.15 నుండి రూ.20 వరకూ ధరలను పెంచాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ కార్లను బయటకు తీయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోంచించాల్సి వస్తోంది. మరి ఇందుకు ప్రత్యామ్నాయం ఏంటి అంటే, మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ సిఎన్‌జి అని చెప్పొచ్చు. సిఎన్‌జి వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, తమ పాపులర్ డిజైర్ సెడాన్‌లో కొత్తగా సిఎన్‌జి వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సెడాన్ బ్రాండ్ యొక్క అమ్మకాలను పెంచడమే కాకుండా ఎక్కువ పాకెట్-ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో, కొనుగోలుదారులు ఇప్పుడు సరసమైన వ్యక్తిగత ప్రయాణ పరిష్కారం అయిన సిఎన్‌జి వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు మారుతి సుజుకి కూడా తమ సిఎన్‌జి కార్ల ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తోంది. కంపెనీ లైనప్‌లో ఇప్పటికే 7 సిఎన్‌జి మోడళ్లు ఉన్నాయి. వీటిలో మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి తాజాగా మార్కెట్లోకి వచ్చిన ప్రోడక్ట్. మరి ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ ఎస్‌-సిఎన్‌జి కారుకి సంబంధించిన హైలైట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

డిజైర్ సిఎన్‌జి : ఇంజన్, గేర్‌బాక్స్ మరియు మైలేజ్

మారుతి సుజుకి డిజైర్ ఎస్-సిఎన్‌జి మోడల్‌లో 1.2 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, డ్యూయల్‌ జెట్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. పూర్తి పెట్రోల్ పవర్‌తో ఈ ఇంజన్ గరిష్టంగా 88.50 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, సిఎన్‌జి వెర్షన్‌లో దీని పవర్, టార్క్ గణాంకాలు కాస్తంత తక్కువగా ఉంటాయి. సిఎన్‌జి ఇంధనంతో నడిచే ఇదే 1.2 లీటర్ ఇంజన్ గరిష్టంగా 76.6 బిహెచ్‌పి శక్తిని మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

కాగా, మారుతి సుజుకి డిజైర్ యొక్క స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. అయితే, మారుతి సుజుకి యొక్క సిఎన్‌జి వెర్షన్ డిజైర్ కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి కేజి సిఎన్‌జికి 31.12 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

డిజైర్ సిఎన్‌జి : ఫీచర్లు

స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి డిజైర్ మాదిరిగానే, సిఎన్‌జి వెర్షన్ డిజైర్ కూడా అనేక ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియోతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మరియు టెలిఫోన్ కంట్రోల్స్, లెదర్-వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు మడచగల సైడ్ మిర్రర్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

డిజైర్ సిఎన్‌జి : సేఫ్టీ ఫీచర్లు

మారుతి సుజుకి డిజైర్ క్రాష్ టెస్టులలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లను పొందకపోయినప్పటికీ, ఇందులో అవసరమైన అన్ని సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ప్రధానంగా, డిజైర్ సిఎన్‌జి మోడల్ లో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్సింగ్ పార్కింగ్ కెమెరా, హిల్-హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

కాగా, మారుతి సుజుకి అందిస్తున్న ఫ్యాక్టరీ సిఎన్‌జి కిట్ కారణంగా, డిజైర్ ఎస్-సిఎన్‌జి సెడాన్ లో పెరిగిన అదనపు బరువును తట్టుకోవడానికి కంపెనీ ఈ కారు యొక్క సస్పెన్షన్‌ సెటప్ ను కూడా రీ-ట్యూన్ చేసింది. ఈ మార్పులకు అదనంగా, మారుతి సుజుకి డ్యూయల్ ఇంటర్-డిపెండెంట్ ఈసియూ యూనిట్లు, కొత్త ఇంధన గేజ్ మరియు ఇంధనం నింపుతున్నప్పుడు ఇంజన్ కట్ ఆఫ్ అయ్యే సేఫ్టీ స్విచ్ వంటి ఫీచర్లను కూడా జోడించింది.

భగ్గు మంటున్న పెట్రోల్ ధరలు.. 31 కిమీ మైలేజీనిచ్చే డిజైర్ (Dzire CNG) సిఎన్‌జితో మైలేజ్ సమస్యకు చెక్!

డిజైర్ సిఎన్‌జి : ధరలు మరియు పోటీ

మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ ఎస్‌సిఎన్‌జి (Maruti Suzuki Dzire S-CNG) వేరియంట్ ధరలు రూ. 8.14 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది ఈ విభాగంలో ఇతర సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్లు అయిన హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి (Hyundai Aura CNG) మరియు టాటా టిగోర్ సిఎన్‌జి (Tata Tigor CNG) వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Article Published On: Saturday, March 26, 2022, 13:22 [IST]
English summary
Top 4 things to know about the new 2022 maruti suzuki dzire s cng
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+