ఉత్తమ మైలేజ్ అందించే టాప్ 5 కార్లు: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కొత్త కొత్త ఎస్‌యువిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇందులో చాలా వరకు కార్ల ధరలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ కారణంగా ప్రీవియస్ మోడల్స్ మరియు హ్యాచ్‌బ్యాక్‌ల యొక్క అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యువిలు విశాలంగా ఉండటం వల్ల రోజు వారీ ప్రయాణానికి మరియు రద్దీగా ఉండే రోడ్లలో ప్రయాణించడానికి అంత అనుకూలంగా ఉండే అవకాశం లేదు.
Recommended Video
నగర వాతావరణం సాధారణంగా రద్దీగానే ఉంటుంది. అలాంటి సమయంలో హ్యాచ్‌బ్యాక్‌లను డ్రైవ్ చేయడం చాలా సులభం. అంతే కాకుండా వీటి నిర్వహణ కూడా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో వీటి ధరలు కూడా సామాన్యులకు చేరువలోనే ఉంటాయి. అలాంటి టాప్ 5 కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

1) మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto):
మారుతి సుజుకి యొక్క చిన్న హ్యాచ్‌బ్యాక్, అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యంత సరసమైన ధర వద్ద లభించే కంపెనీ యొక్క పాపులర్ కారు ఆల్టో 800. ఇది అతి తక్కువ కాలంలోనే ఎక్కువ అమ్మకాలు పొంది అమ్మకాల్లో తనకంటూ ఒక కొత్త రికార్డ్ సృష్టించింది.

మారుతి సుజుకి ఇటీవల తన అప్డేటెడ్ ఆల్టో కె10 ని కేవలం రూ. 3.99 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఇది ఆధునిక డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ తో పాటు కొత్త కలర్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంది. ఇది లీటరుకి 24.9 కిమీ మైలేజ్ అందిస్తుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమైన హ్యాచ్‌బ్యాక్.

2) మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso):
మారుతి సుజుకి యొక్క మరో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్ 'ఎస్-ప్రెస్సో'. ఇది కూడా ఎక్కువమంది కొనుగోలుదారుల మనసును దోచుకోవడంలో విజయం సాధించింది. ఇది అద్భుతమైన బాక్సీ డిజైన్ కలిగి చూడటానికి ఒక SUV లాగా కనిపిస్తుంది. దీని ధర రూ. 4.25 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కొత్త కె-సిరీస్ 1.0-లీటర్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది. కావున మంచి మైలేజ్ ఆడిస్తుంది. ఇది కూడా రోజువారీ ప్రయాణానికి అనుకూలమైన హ్యాచ్‌బ్యాక్.

3) టాటా టియాగో (Tata Taigo):
దేశీయ వాహన తయారీ దిగ్గజం అయిన 'టాటా మోటార్స్' యొక్క చిన్న వాహనాలకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇందులో చెప్పుకోదగ్గ మోడల్ టాటా టియాగో. అయితే ఇది మునుపటి రెండు మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ ధర కలిగి ఉంటుంది. కానీ మంచి పనితీరుని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో టాటా టియాగో ప్రారంభ ధర రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు, CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడుతుంది.

4) రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
రెనాల్ట్ కంపెనీ యొక్క క్విడ్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పనితీరులో, ఫీచర్స్ లో ఏ మాత్రం ఇతర పోటీదారులు తక్కువ కాకుండా ఉంటుంది. కావున కొనుగోలుదారులకు మారుతి ఆల్టో తరువాత వెంటనే గుర్తొచ్చే చిన్న కారు రెనాల్ట్ క్విడ్. క్విడ్ ప్రారంభ ధర రూ. 4 లక్షలకంటే ఎక్కువగా ఉంటుంది

కొత్త రెనాల్ట్ క్విడ్ అద్భుతమైన పనితీరుని అందించడనికి రెండు పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ కాగా, రెండవది 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.
ఇందులోని మునుపటిది 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 54 బిహెచ్‌పి పవర్ మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట శక్తిని చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 68 బిహెచ్‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

5) మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio):
మారుతి సుజుకి యొక్క సెలెరియో కూడా ఉత్తమ అమ్మకాలు పొందుతున్న టాప్ 5 హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ఇది మన జాబితాలో అత్యధిక మైలేజ్ అందించే కారు కూడా, ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు CNG వేరియంట్‌లలో మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తుంది.

మారుతి సెలెరియో డిజైన్ పరంగా మరియు ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. కావున ఇది 25.2 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కావున ఇది రోజు వారీ ప్రయాణానికి మరియు ఎక్కువ మైలేజ్ కావాలని కొనరుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఎక్కువ మైలేజ్ అందించే కార్ల కోసం ఎదురు చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కావున అటువంటి వారికి పైన తెలిపిన ఈ టాప్ 5 కార్లు ఉత్తమైన ఎంపిక అవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు కొత్త కార్లు & బైకులు గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








