భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటుగా కార్లలో సేఫ్టీ ఫీచర్లు కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. నేటి ఆధునిక కార్లలో ఎక్కువగా వినిపించే టెక్నాలజీ పేరు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS). దీనినే అడాస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ADAS టెక్నాలజీ రాడార్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. డ్రైవర్ సహాయం లేకుండా కొన్ని పనులను స్వయంచాలకంగా (ఆటోమేటిక్ గా) నిర్వహించడానికి ఈ సాంకేతికత సహాయపడుతుంది. దీనినే అటానమస్ టెక్నాలజీ అని కూడా పిలుస్తుంటారు.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

ఒకప్పుడు ఈ తరహా ఆటోమేటిక్ టెక్నాలజీ కేవలం హై-ఎండ్ ప్రీమియం కార్లలో మాత్రమే లభించేది. అయితే, విపరీతంగా వృద్ధి చెందిన సాంకేతిక మరియు అధిక డిమాండ్ కారణంగా, ఇప్పుడు ఇది ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో డ్రైవర్ ప్రమేయం లేకుండా కారులో ఉండే కంప్యూటర్ మరియు కారులో అమర్చబడిన వివిధ రకాల సెన్సార్లు కలిసి పనిచేసి, ఈ టెక్నాలజీ ఆటోమేటిక్ గా జోక్యం చేసుకొని అత్యవసర బ్రేకింగ్ చేయడం లేదా కారును ఓ లైనులో మాత్రమే నడిచేలా చేయడం మొదలైన పనులు చేస్తుంటుంది.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

అడాస్ ఫీచర్లలో అత్యంత పాపులర్ అయిన ఫీచర్లలో ఒకటి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్. ఒకప్పుడు కార్లలో స్టాండర్డ్ క్రూయిజ్ కంట్రోల్ ను ఆన్ చేసినట్లయితే, ముందున్న వాహనం యొక్క వేగాన్ని బట్టి మన కారు యొక్క వేగాన్ని తగ్గించేందుకు డ్రైవర్ జోక్యం అవసరమయ్యేది. అయితే, ఈ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌లో ఒక్కసారి క్రూయిజ్ కంట్రోల్ ని సెట్ చేసిన తర్వాత డ్రైవర్ ప్రమేయం లేకుండానే ముందు వెళ్తున్న కారు యొక్క వేగాన్ని సెన్సార్లు గుర్తించి కారు వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం ఆటోమేటిక్‌గా చేస్తుంది. అలాగే, ముందున్న వాహనం అత్యవసరంగా బ్రేక్ వేస్తే, మన కారు కూడా ఎమర్జెన్సీ బ్రేక్‌ను ఆటోమేటిక్‌గా అప్లయ్ చేస్తుంది.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

ఇదొక్క ఫీచర్ మాత్రమే కాదు, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే కొల్లైజన్ అవైడెన్స్, డ్రైవర్ లైన్ మారకుండా ఒకే లైనులో ప్రయాణించేలా ఉపయోగపడే లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ నిద్రపోతున్నాడని గుర్తించి అలెర్ట్ చేసే డ్రైవర్ డ్రౌజీనెస్ సిస్టమ్ ఇలా చెప్పుకుంటూపోతే అడాస్ ఫీచర్ల జాబితా చాంతాడంత లిస్టే అవుతుంది. ఇలాంటి అధునాతన ఫీచర్లతో కూడిన కార్లు ఇటీవలి కాలంలో భారతదేశంలో బాగా పాపులర్ అయ్యాయి. మరి మనదేశంలో అడాస్ ఫీచర్లతో లభిస్తున్న టాప్ 5 కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

ఎమ్‌జి ఆస్టర్ (MG Astor):

బ్రిటీష్ కార్ కంపెనీ ఎమ్‌జి మోటార్స్ తమ ఆస్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలో అడాస్ టెక్నాలజీని అందిస్తోంది. అయితే, ఇది ఈ మోడల్ లోని టాప్-ఎండ్ వేరియంట్ షార్ప్ (ఆప్షనల్) (శావీ)లో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో ఈ వేరియంట్ ధర సుమారు రూ. 16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కారులో డ్రైవర్ లైన్ నుండి బయటకు వచ్చిన ప్రతిసారీ కారు వార్నింగ్ ఇస్తుంది. డ్రైవర్ కారును స్టీరింగ్ చేయకుండా నిర్ధిష్ట లేన్‌లో మాత్రమే కారును నడపడానికి ఇది సహాయపడుతుంది.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

అలాగే, ముందుగా వెళ్తున్న ఏదైనా వాహనం చాలా దగ్గరగా ఉంటే వార్నింగ్ ఇస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో స్వయంచాలకంగా బ్రేక్‌లను వర్తింపజేస్తుంది. పాదచారులు ఎదురుగా వచ్చినా ఆటోమేటిక్‌గా బ్రేక్‌లను వర్తింపజేస్తుంది. ఇవే కాకుండా, ఇందులో హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాష్ ట్రాఫిక్ అలర్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ వంటి పలు అడాస్ ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700):

మహీంద్రా నుండి అడాస్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన మొట్టమొదటి వాహనం ఎక్స్‌యూవీ700. టాప్-ఎండ్ వేరియంట్ మహీంద్రా ఎక్స్‌AX7లో మాత్రమే ఈ ఫీచర్ లభిస్తుంది. మార్కెట్లో ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 19.20 లక్షలుగా ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్ మరియు ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City Hybrid)

సిటీ హైబ్రిడ్ కారు కూడా హోండా నుండి భారతదేశంలో లభిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి అడాస్ ఫీచర్ కారు. హోండా కొన్ని నెలల క్రితమే తమ సిటీ సెడాన్ ను సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో హైబ్రిడ్ పవర్‌ట్రైన్ మరియు అడాస్ ఫీచర్లతో విడుదల చేసింది. హోండా సిటీ ఇ-హెచ్ఈవీ జెడ్ఎక్స్ వేరియంట్లో ఈ అడాస్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ హై బీమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇందులో బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లేవు.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

ఎమ్‌జి గ్లోస్టర్ (MG Gloster):

వాస్తవానికి, ఎమ్‌జి మోటార్స్ నుండి వచ్చిన మొట్టమొదటి అడాస్ ఫీచర్ అధారిత ఎమ్‌జి గ్లోస్టర్. ఇది ఎమ్‌జి మోటార్స్ నుండి లభిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ. కంపెనీ, ఈ కారులోని హై-ఎండ్ వేరియంట్లో అధునాతన అడాస్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. మార్కెట్లో ఈ వేరియంట్ ధర రూ. 39.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. ఈ కారులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైన మరొక ఫీచర్ ఆటోమేటిక్ పార్కింగ్. ఈ ఫీచర్ సాయంతో కారు ఆటోమేటిక్ గా దానంతట అదే పార్క్ చేసుకుంటుంది.

భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే టాప్ 5 కార్లు!

హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson):

ఇక జాబితాలో ఐదవది మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన కొరియన్ కార్ హ్యుందాయ్ టూసాన్. హ్యుందాయ్ కు కూడా ఇది భారతదేశంలో మొట్టమొదటి అడాస్ ఆధారిత కారు. కంపెనీ ఈ కారు ధరను వెల్లడించలేదు, అగస్ట్ 2022 నెలలో ఇది అమ్మకానికి అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ కారులో కొల్లైజన్ అవైడెన్స్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ అవైడెన్స్, లేన్ కీపింగ్, సేఫ్ లేన్ డిపార్చర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి అనేక ఫీచర్లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2022, 11:05 [IST]
English summary
Top 5 cars in india with adas safety feature details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+