దేశీయ మార్కెట్లో టాప్-5 CNG కార్లు: మారుతి XL6 సిఎన్‌జి నుంచి టియాగో ఎన్ఆర్‌జి సిఎన్‌జి వరకు..

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో CNG కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈ మార్గంలోని ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్న టాప్ 5 CNG కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్ 6 సిఎన్‌జి:

మారుతి సుజుకి యొక్క ఎక్స్ఎల్ 6 సిఎన్‌జి భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న అత్యంత ఫ్రీమియం సిఎన్‌జి కార్లలో ఒకటి. ఇది ప్రస్తుతం ఎంట్రీ-లెవల్ 'జీటా' వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ .12.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ CNG మోడల్ 60 లీటర్ల CNG ట్యాంక్ పొందుతుంది. అంతే కాకుండా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమ మైలేజ్ (26.32 కిమీ/కేజీ) అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో టాప్-5 CNG కార్లు

మారుతి సుజుకి ఎక్స్ఎల్ 6 సిఎన్‌జి 16 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కి సపోర్ట్ చేసే 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ పుష్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇంటీరియర్ ఫీచర్లతో పాటు నాలుగు ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి బాలెనో సిఎన్‌జి:

మారుతి సుజుకి బాలెనో సిఎన్‌జి విషయానికి వస్తే దీని ప్రారంభ ధర రూ.8.28 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ.9.21 లక్షల వరకు ఉంటుంది. మారుతి బాలెనొ CNG డెల్టా మరియు జీటా ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. బాలెనో CNG 1.2-లీటర్, ఫోర్-సిలిండర్, కె12ఎన్ ఇంజన్‌ను పొందుతుంది. CNG వెర్షన్ లో బాలెనొ 77.5 హెచ్‌పి పవర్ మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి బాలెనో CNG డిజైన్ దాదాపు దాని మునుపటి వేరియంట్ ని పోలి ఉంటుంది. బాలెనొ CNG జీటా ట్రిమ్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 ఇంచెస్ అల్లాయ్‌ వీల్స్, స్మార్ట్‌ప్లే ప్రో+ సిస్టమ్‌తో కూడిన 7.0 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, కనెక్టెడ్ కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

టయోటా గ్లాంజా సిఎన్‌జి:

కొత్త టొయోట గ్లాంజా CNG వెర్షన్ G మరియు S అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 8.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా), రూ. 9.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). గ్లాంజా CNG వెర్షన్ మారుతి సుజుకి బాలెనో S-CNG మోడల్‌కు శక్తినిచ్చే అదే 1.2-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఒక కేజీ CNG తో గరిష్టంగా 30.61 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

కొత్త గ్లాంజా సిఎన్‌జి LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉన్నాయి. అయితే టెయిల్‌గేట్‌పై CNG బ్యాడ్జింగ్‌ కనిపిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో స్టార్ట్/స్టాప్ బటన్, పవర్ విండోస్, వాయిస్ అసిస్టెన్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి:

సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' భారతీయ మార్కెట్లో తన 'గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి' మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. అవి మాగ్నా, స్పోర్ట్జ్ మరియు అస్టా వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ.7.16 లక్షలు, రూ. 7.70 లక్షలు మరియు రూ. 8.45 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). ఈ మూడు వేరియంట్స్ వాటి పెట్రోల్ మోడల్స్ కంటే కూడా ఉత్తమ మైలేజ్ అందించేలా రూపొందించబడ్డాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్స్ సిస్టం, 5.3 ఇంచెస్ సెమీ డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, అర్కామీస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

టాటా టియాగో ఎన్ఆర్‌జి సిఎన్‌జి:

టాటా టియాగో ఎన్ఆర్‌జి యొక్క ఐసిఎన్‌జి XT మరియు XZ అనే రెండు వేరియంట్స్ లో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 7.40 లక్షలు మరియు రూ.7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి 1.2 లీటర్ త్రీ సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్‌ పొందుతాయి. ఇది 72 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి 26.4 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జిలో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం కంట్రోలర్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులోని CNG ట్యాంక్ వల్ల బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 20, 2022, 6:30 [IST]
English summary
Top 5 cng cars with best features in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+