దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం (2022) విడుదలైన టాప్ 5 ప్రీమియం కార్లు - పూర్తి వివరాలు
2022 వ సంవత్సరంలో భారతీయ మార్కెట్లో చాలా వాహనాలు విడుదలయ్యాయి, ఇందులో SUV లు సెడాన్ లు మరియు లగ్జరీ కార్లు మొదలైనవి ఉన్నాయి. దేశీయ విఫణిలో ఈ సంవత్సరం (2022) విడుదలైన టాప్ 5 ప్రీమియం కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580:
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో తన 'ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' (EQS 580 4Matic) అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ ఈ సంవత్సరం అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండేలా రూపొందించబడింది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారు 107.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తం మీద ఇది 523 హెచ్‌పి పవర్ మరియు 855 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది.
వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్:
స్వీడన్‌కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo), భారతదేశంలో ఈ 2022 లో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్' విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ SUV బ్రాండ్ యొక్క భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా (CBU) భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది.
వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంటుంది. ఇందులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇది ఒక పూర్తి ఛార్జ్ తో గరిష్టంగా 418 కిమీ మైలేజ్ అందిస్తుంది.
జీప్ గ్రాండ్ చెరోకీ:
2022 వ సంవత్సరంలో విడుదలైన ప్రీమియం కార్లలో 'జీప్' (Jeep) కంపెనీ యొక్క 'గ్రాండ్ చెరోకీ' ఒకటి. ఈ SUV ప్రారంభ ధర రూ. 77.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులో కేవలం 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 272 హెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్:
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు' భారతీయ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్' (XM) ఎస్‌యువిని విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు ధర రూ. 2.60 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది S68 ట్విన్ టర్బోచార్జ్డ్ 4.4-లీటర్ V8 ఇంజన్ మరియు ఒక ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. S68 ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 644 బిహెచ్‌పి & 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది.
ఆడి క్యూ5 స్పెషన్ ఎడిషన్:
ఆడి ఇండియా భారతీయ మార్కెట్లో తన కొత్త క్యూ5 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ స్పెషన్ ఎడిషన్ ధర రూ. 67.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త స్పెషన్ క్యూ5 ఎడిషన్ టెక్నాలజీ ట్రిమ్ పై ఆధారపడి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం విడుదలైన క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 249 హెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. కాగా దీని టాప్ స్పీడ్ గంటకు 237 కిలోమీటర్లు.


Click it and Unblock the Notifications








