క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 హైలైట్స్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా (Creta) లో కంపెనీ ఈ నెల ఆరంభంలో ఓ కొత్త నైట్ ఎడిషన్ (Knight Edition) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ మోడల్ కంపెనీ ఫ్యాక్టరీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు రావడం ప్రారంభించింది మరియు త్వరలోనే దీని డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్లను కలిగి ఉంటుంది.

పేరుకు తగినట్లుగానే హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పూర్తి డార్క్ బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంటుంది. అంటే, దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో రెండింటిలోనూ ఈ థీమ్ కనిపిస్తుంది. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు పోటీగా టాటా మోటార్స్ విక్రయిస్తున్న టాటా హారియర్ డార్క్ ఎడిషన్ మోడల్‌తో ఇది పోటీ పడుతుంది. మరియు ఈ హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆ టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 హైలైట్స్

1. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్: ఎక్స్టీరియర్ అప్‌డేట్స్

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ఎక్స్టీరియర్ అప్‌డేట్‌లలో భాగంగా, ఫ్రంట్ గ్రిల్‌లో రెడ్ కలర్ యాక్సెంట్స్, బ్లాక్-అవుట్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్, రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన గన్ మెటల్ షేడ్ అల్లాయ్ వీల్స్, కొత్త గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన సైడ్ మిర్రర్స్ ఉంటాయి. అలాగే, ఇందులోని రూఫ్ రైల్స్, సైడ్ సిల్స్ మరియు సి పిల్లర్ గార్నిష్ అన్నీ కూడా బ్లాక్ కల్ర థీమ్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. వెనుక బాగంలో టైల్‌గేట్ పై నైట్ ఎడిషన్ లోగో కూడా కనిపిస్తుంది.

క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 హైలైట్స్

2. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్: ఇంటీరియర్ అప్‌డేట్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, క్రెటా నైట్ ఎడిషన్‌లోని సీట్ అప్‌హోలెస్ట్రీ మరియు డ్యాష్‌బోర్డ్ రెండూ కూడా ఆల్-బ్లాక్ థీమ్ ను కలిగి ఉంటుంది. ఇందులోని ఏసి వెంట్స్ రెడ్ కలర్‌లో ఫిని చేయబడి ఉంటాయి. అలాగే, స్పోర్టీ లుక్ కోసం సీట్లపై రెడ్ కలర్ కాంట్రాస్ట్ స్టిచింగ్ ఉంటుంది. అంతేకాకుండా, సెంటర్ కన్సోల్ పై గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌ కూడా ఉంటుంది. హ్యుందాయ్ ఈ వేరియంట్‌ లను మరింత స్పోర్టియర్‌గా మార్చడానికి క్రెటా యొక్క టర్బో-పెట్రోల్ వేరియంట్‌ లలో కంపెనీ ఇప్పటికే బ్లాక్ అండ్ రెడ్ ఇంటీరియర్ థీమ్‌ ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే.

క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 హైలైట్స్

3. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్: కొత్త వేరియంట్స్

ఈ కొత్త నైట్ ఎడిషన్ విడుదలతో, హ్యుందాయ్ తమ క్రెటా లైనప్ లో ఓ కొత్త మిడ్-స్పెక్ ఎస్+ ట్రిమ్‌ ను జోడించింది. ఈ కొత్త ట్రిమ్ ప్రారంభంతో, క్రెటా నైట్ ఎడిషన్ ఇప్పుడు రెండు ట్రిమ్‌ లలో అందుబాటులో ఉంటుంది. అవి: S+ మరియు టాప్-స్పెక్ SX (O) వేరియంట్స్. అయితే, ఈ ట్రిమ్‌ లలో అందించే ఫీచర్లలో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఈ కొత్త S+ ట్రిమ్ దాని ప్రస్తుత SX ఎగ్జిక్యూటివ్ ట్రిమ్‌ పై ఆధారపడి ఉంటుంది మరియు చాలా ఫీచర్లు ఈ ట్రిమ్ నుండి తీసుకోబడ్డాయి. ఇకపోతే, టాప్-స్పెక్ SX(O) ట్రిమ్ అలాగే ఉంటుంది మరియు దీని ఫీచర్లలో ఎటువంటి మార్పు లేదు.

క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 హైలైట్స్

4. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్: ఇంజన్ ఆప్షన్లు

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. స్టాండర్డ్ క్రెటాలోని ఇంజన్లనే ఈ స్పెషల్ ఎడిషన్ క్రెటాలోనూ ఉపయోగించారు. కాబట్టి, వీటి పవర్, టార్క్ గణాంకాల్లో ఎలాంటి మార్పు ఉండదు. హ్యుందాయ్ క్రెటా S+ ట్రిమ్‌ లో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్‌ ఆప్షన్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ ను పొందవచ్చు. కాగా, క్రెటా నైట్ ఎడిషన్ SX (O) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో కూడా లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ మోడల్ సివిటి ఆటోమేటిక్ మరియు డీజిల్ మోడల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లను పొందుతుంది. క్రెటా నైట్ ఎడిషన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ తో అందుబాటులో ఉండదని గమనించండి.

క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 హైలైట్స్

5. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్: ధరలు

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్‌ ను S+ పెట్రోల్, SX(O) పెట్రోల్, S+ డీజిల్ మరియు SX(O) డీజిల్ వేరియంట్‌ లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

క్రెటా నైట్ ఎడిషన్ ఎస్+ పెట్రోల్ - రూ. 13.35 లక్షలు

క్రెటా నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్+ డీజిల్ - రూ. 14.31 లక్షలు

క్రెటా నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ (ఓ) పెట్రోల్ - రూ. 17.06 లక్షలు

క్రెటా నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ (ఓ) డీజిల్ - రూ. 18.02 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

More from DriveSpark

Article Published On: Sunday, April 24, 2022, 8:30 [IST]
English summary
Top 5 things to know about new hyundai creta knight edition
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+