టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభించే టాప్ 5 ఎస్‌యూవీలు.. ఇవి డీజిల్ కార్లకు చక్కటి ప్రత్యామ్నాయాలు..
భారతదేశంలో డీజిల్ ఇంజన్‌తో నడిచే కార్ల వాడకం తగ్గిన తర్వాత, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌లకు డిమాండ్ జోరందుకుంది. ఇవి సాంప్రదాయ న్యాచులర్ పెట్రోల్ ఇంజన్ల కన్నా ఎంతో శక్తివంతమైనవి మరియు మైలేజ్ పరంగా కూడా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి, డీజిల్ ఇంజన్లకు ఇవి చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మనదేసంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది, ఇలాంటి ఎస్‌యూవీలకు పవర్ మరియు మైలేజీతో కూడిన ఇంజన్లు చాలా అవసరం. అందుకే, దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా టర్బో పెట్రోల్ ఇంజన్లను కూడా అందిస్తున్నాయి. మరి మన మార్కెట్లో టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభించే ఆ టాప్ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

1. టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటి మరియు ఈ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్‌తో పాటుగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులోని డీజిల్ ఇంజన్ కూడా 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్‌గానే ఉంటుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

నెక్సాన్ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో హెడ్‌లైట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, ప్రీమియం 8 స్పీకర్ ఆడియో, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ (TC), డ్రైవ్ మోడ్‌లు వంటి మరెన్నో ఫీచర్లతో లభిస్తుంది.

2. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న బెస్ట్ కార్లలో వెన్యూ కూడా ఒకటి. ఖరీదైన క్రెటాను కొనుగోలు చేయలేని వారికి వెన్యూ చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఫుల్లీ టెక్ లోడెడ్ ఫీచర్లతో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. వెన్యూలోని 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118.35 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 3 రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 7-స్పీడ్ డిసిటి, 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, కూల్డ్ గ్లౌవ్‌బాక్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, స్టీరింగ్ వీల్-మౌంటెడ్ కంట్రోల్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

3. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈ జాబితాలోనే అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ఇది రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటిలో ఒకటి 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు క్లాస్-లీడింగ్ 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ టర్బో పెట్రోల్ వేరియంట్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోనే లభిస్తుంది. మహీంద్రా ఇంకా ఇందులో ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేయలేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, పవర్ స్టీరింగ్, మూడు డ్రైవింగ్ మోడ్‌లు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM), ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ చేయగల సైడ్ మిర్రర్స్, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు-డిస్క్ బ్రేక్‌లు, ESP, ABS, EBD వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

4. కియా సోనెట్ (Kia Sonet)
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక స్టాండర్డ్ ఫీచర్లతో లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ మాదిరిగానే కియా సోనెట్ కూడా అవే పవర్‌ట్రైన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. కియా సోనెట్‌లోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 118 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది హ్యుందాయ్ వెన్యూ మాదిరిగా కాకుండా కేవలం రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతోనే లభిస్తుంది. ఇందులో 6-స్పీడ్ క్లచ్‌లెస్ iMT మరియు క్విక్ షిఫ్టింగ్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో మరియు వాయిస్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్, రియర్ ఏసి వెంట్‌లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్రైవ్ మోడ్‌లు వంటి మరెన్నో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

5. నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ నుండి లభిస్తున్న మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారతదేశంలో కొనుగోలుకి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సబ్-4 మీటర్ ఎస్‌యూవీలలో ఒకటి. కంపెనీ ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. వాటిలో ఒకటి నిస్సాన్ మాగ్నైట్‌లోని 1.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్‌లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








