భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైన ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు త్వరలో లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను విడుదలచేయనున్నాయి. ఈ కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

01. కియా ఈవి6 (Kia EV6):

సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' (Kia Motors) ఇప్పటికే 'EV6' మోనికర్ కోసం ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది. అంతే కాకూండా 'కియా ఈవి6' అనేది దేశీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ కారు కానుంది. కియా మోటార్స్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ప్రకారం.. కంపెనీ ఈవి6, ఈవి6 ఎయిర్, ఈవి6 వాటర్, ఈవి6 ఎర్త్ మరియు ఈవి6 లైట్ ట్రేడ్‌మార్క్‌ల కోసం దాఖలు చేసింది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

కియా కంపెనీ దేశీయ మార్కెట్లో ఈవి6 ని టాప్-ఎండ్ GT-లైన్‌లో దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక్క ఛార్జ్ తో దాదాపుగా 440 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కావున దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు విడుదల కోసం ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

02. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5):

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) భారతీయ మార్కెట్లో కోసం విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' (Hyundai Ioniq 5). హ్యుందాయ్ ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5 ను ఈ ఏడాది భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

హ్యుందాయ్ కంపెనీ తన బియాండ్ మొబిలిటీ స్ట్రాటజీ కింద 2022 ద్వితీయార్థంలో దేశీయ మార్కెట్లో ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ కార్ '2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా కైవసం చేసుకుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది భారతీయ మార్కెట్ కి రెండవ మోడల్ కానుంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' 'ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్క ఛార్జ్ తో 481 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

03. టాటా ఆల్ట్రోజ్ ఈవి (Tata Altroz EV):

భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వెహికల్ విభాగంలో టాటా నెక్సాన్ ఈవి మరియు టాటా టిగోర్ ఈవి అనేవి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. కావున కంపెనీ త్వరలో అప్డేటెడ్ ఫీచర్లతో 'టాటా ఆల్ట్రోజ్ ఈవి' ని విడుదల చేయాడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

టాటా మోటర్స్ విడుదల చేయనున్న కొత్త 'టాటా ఆల్ట్రోజ్ ఈవి' (Tata Altroz EV) ఆధునిక పరికరాలతో రానుంది. ఐతే కాకుండా ఇది దాని మునుపటి మోడల్ కేట్ కూడా మెరుగైన పనితీరుని అందించే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నాము.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

04. టాటా టియాగో ఈవి (Tata Tiago EV):

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో తన టాటా టియాగో ఈవి (Tata Tiago EV) ని భారతదేశంలో ప్రారంభం కానున్న పండుగ సీజన్ లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అదే సమయంలో ఎక్కువమంది ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కంపెనీ దీనిని తక్కువ ధరకే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు మంచి పనితీరుని అందించే విధంగా ఉటుందని ఆశిస్తున్నాము.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

05. టాటా నెక్సాన్ ఈవి (లాంగ్ రేంజ్):

భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న వాహనాల్లో చెప్పుకోదగ్గది టాటా మోటార్స్ యొక్క టాటా నెక్సాన్. అత్యంత ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందటమే కాకుండా అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉండటం వల్ల ఎక్కువమంది ఈ ఎలెక్ట్రిక్ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు: వివరాలు

ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ కారుని మరింత అప్డేటెడ్ ఫీచర్స్ తో తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. కావున ఇది 40 కోలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క ఛార్జ్ తో దాదాపు 400 కిమీ కంటే కూడా ఎక్కువ పరిధిని అందించే అవకాశం కూడా ఉందని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, April 29, 2022, 8:30 [IST]
English summary
Top 5 upcoming electric cars in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+