భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 - 7 సీటర్ మోడల్స్: వివరాలు

భారతదేశంలో ఇప్పుడు SUV లకు మరియు MPV లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో కూడా ఎక్కువమంది కొనుగోలుదారులు 7 సీటర్ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో ఇటీవల విడుదలైన కియా కారెన్స్ నుంచి టయోటా ఇన్నోవా క్రిష్టా వరకు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో భారతదేశంలోని టాప్ 10 7 సీటర్ కార్లను గురించి తెలుసుకుందాం.. రండి.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'మారుతి సుజుకి' యొక్క 'మారుతి ఎర్టిగా' (Maruti Ertiga) అత్యధిక అమ్మకాలను చేపడుతున్న MPV. ఇది దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 7 సీటర్ కారు. ఇది 7 సీటర్ కారు కావున కుటంభ ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ధర దేశీయ మార్కెట్లో రూ. 8.12 లక్షలు. కంపెనీ ఈ MPV ని CNG మోడల్ లో కూడా అందుబాటులో ఉంచింది. కావున ఇది అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగా ఈ MPV చాలా సంవత్సరాలుగా తిరుగులేని కారుగా ప్రజాదరణ పొందుతోంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta):

టయోటా కంపెనీ యొక్క 'టయోటా ఇన్నోవా క్రిస్టా' ఈ విభాగంలో అత్యంత విలాసవంతమైన మోడల్‌. ఇది పనితీరు పరంగా చాలా అద్భుతమైన మోడల్. టయోటా ఇన్నోవా క్రిస్టా దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో 7 సీటర్ కారు. దీని ధర రూ. 17.30 లక్షలు. టయోటా తన ఇన్నోవా క్రిస్టా MPV ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. కంపెనీ మధ్య వరుసలో కెప్టెన్ సీటుతో పాటు బెంచ్ సీటు ఆప్సన్ కూడా అందిస్తుంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio):

దేశీయ వాహన తయారీ దిగ్గజం అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) యొక్క మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) భారతీయుల నమ్మికయిన వాహనం. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడౌతున్న 7 సీటర్ కూడా. మహీంద్రా స్కార్పియో మంచి సామర్థ్యాన్ని అందిస్తుంది. కావున ఇప్పటికి కూడా ఎక్కువ సంఖ్యలో అమ్మకాలను పొందుతోంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) యొక్క ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 13.18 లక్షలు, అదే సమయంలో డీఐ టాప్ వేరియంట్ ధర రూ. 18.14 లక్షలు. మహీంద్రా కంపెనీ ఈ SUV త్వరలో కొత్త మోడల్ లో తీసుకురానుంది. ఇది కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశించవచ్చు.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

టాటా సఫారి (Tata Safari):

టాటా మోటార్స్ యొక్క 'టాటా సఫారి' (Tata Safari) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మరో SUV. ఇది కూడా 7 సీటర్ విభాగంలోని మరో అద్భుతమైన మోడల్. టాటా సఫారి అనేది దాని 5 సీటర్ వేరియంట్ అయిన టాటా హారియర్ నుంచి ప్రేరణ పొందింది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

టాటా సఫారి ధర రూ. 14.99 లక్షలు. టాటా సఫారి అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ SUV మంచి స్థలం కూడా కలిగి ఉంటుంది, ఇందులో కెప్టెన్ సీటుతో పాటు 6 సీటర్ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంది. మొత్తానికి ఈ SUV మంచి ఆదరణ పొందుతున్న మరో SUV.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

కియా కారెన్స్ (Kia Carens):

ఇటీవల విడుదలైన కియా కారెన్స్ మరో అద్భుతమైన 7 సీటర్ మోడల్. దీని ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు. ఇది మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

వోల్వో ఎక్స్‌‌సి90 (Volvo XC90):

అత్యంత విలాసవంతమైన కార్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన వోల్వో యొక్క XC90 అనేది కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ SUV. ఇది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సురక్షితమైన కారు. వోల్వో ఎక్స్‌‌సి90 ధర రూ. 89.90 లక్షలు, కాగా టాప్ మోడల్‌ ధర రూ. 1.31 కోట్లు.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

వోల్వో ఎక్స్‌‌సి90 అనేది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 7 సీటర్ మోడల్ కూడా. ఇది 1969 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 300 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner):

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం SUV లలో 'టయోటా ఫార్చ్యూనర్' (Toyota Fortuner) కూడా ఒకటి. ఈ SUV ధర రూ. 31.39 లక్షలు. ఇది చాలా కాలంగా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇటీవల దాని కొత్త మోడల్ కూడా పరిచయం చేయబడింది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

టయోటా ఫార్చ్యూనర్‌ 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):

మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యువి700 గత సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మోడల్. ఇది అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇప్పటికి ఈ SUV ఒక లక్ష బుకింగ్స్ పొందింది. ఇది కూడా మూడు-వరుసల వేరియంట్‌తో వస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 12.95 లక్షలు, టాప్ వేరియంట్‌ ధర రూ. 23.79 లక్షలు.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

కియా కార్నివాల్ (Kia Carnival):

సౌత్ కొరియా కార్ బ్రాండ్ అయిన 'కియా కార్నివాల్' (Kia Carnival) దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో 7 సీటర్ MPV. ఈ MPV ధర రూ. 25.49 లక్షల నుంచి రూ. 34.49 లక్షలు. ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఇంజన్ 197 బిహెచ్‌పి పవర్ మరియు 440 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారతదేశంలో లభ్యమవుతున్న టాప్ 10 '7 సీటర్ మోడల్స్'.. వివరాలు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Jaguar Land Rover Defender):

'జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Jaguar Land Rover Defender) ఇది అత్యంత ప్రజాదరణ SUV. ఈ SUV ప్రారంభ ధర రూ. 80.72 లక్షల నుంచి రూ. 1.22 కోట్లు వరకు ఉంటుంది. ఇది 5-లీటర్ V8 ఇంజన్ పొందుతుంది, ఈ ఇంజన్ 525 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2022, 15:14 [IST]
English summary
Top 7 seater cars in india ertiga innova crysta carens defender details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+