సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఎక్కువగా కొనుగోలుదారులు తక్కువ ధరకు లభ్యమయ్యే అత్యంత సరసమైన 4 లేదా 5 సీట్ల కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం వీడి డిమాండ్ ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం మనం ఈ ఆర్టికల్ లో సరసమైన ధర వద్ద లభించే కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. రండి.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా నెక్సాన్ (Tata Nexon):

భారతీయ వాహన తయారీ దిగ్గజం అయిన టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మరియు నమ్మికైన మోడల్ టాటా నెక్సాన్ (Tata Nexon). దీని ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. ఈ కారు సేఫ్టీ విషయంలో ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్న టాటా మోటార్స్ యొక్క మొదటి కారు.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.06 (అడల్ట్ సేఫ్టీ) స్కోర్ చేసి 5 స్టార్ రేటింగ్ పొందింది. పిల్లల భద్రతా విషయంలో 49 కి 25.0 పాయింట్స్ స్కోర్ చేసి 3 స్టార్ రేటింగ్ పొందింది. అంతే కాకుండా ఇది ప్రయాణికులకు సురక్షితమైన కారుగా ఇప్పటికే చాలా సార్లు రుజువయ్యింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz):

టాటా మోటార్స్ యొక్క మరొక మోడల్ ఈ టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz). దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు. ఆల్ట్రోజ్ కూడా సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అడల్ట్ సేఫ్టీలో 17 కి 16.3 పాయింట్స్ మరియు పిల్లల సేఫ్టీలో 49 కి గాను 29 పాయింట్స్ స్కోర్ చేసి 3 స్టార్ రేటింగ్ పొందగలిగింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా ఆల్ట్రోజ్ బాడీ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ అందిస్తుంది. కావున దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ కారణంగా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుంది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

రెనాల్ట్ కిగర్ (Renault Kiger):

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాహన తయారీ సంస్థల్లో ఒకటి ఈ రెనాల్ట్. ఇందులో కూడా కిగర్ మోడల్ చాలా ఆదరణ పొందుతోంది. దీని ధర మార్కెట్లో రూ. 5.79 లక్షలు. రెనాల్ట్ కిగర్ (Renault Kiger) క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

అడల్ట్ సేఫ్టీలో 17 మార్కులకు 12.34 సాధించి 4 శ్త్ర్ రేటింగ్ పొందింది. అదే సమయంలో పిల్లల సేఫ్టీ విషయంలో 49 మార్కులకు 21.07 స్కోర్ చేసింది. సేఫ్టీ రేటింగ్‌ పరంగా కంపెనీకి రెనాల్ట్ కిగర్ మూడవ మోడల్. దీని ధర కూడా తక్కువ మంది మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):

రెనాల్ట్ కంపేనీ యొక్క మరో ఉత్తమైన మోడల్ ఈ రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber). దీని ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.67 లక్షలు. సేఫ్టీ విషయంలో రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) 4 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 మార్కులకు 11.62 మరియు పిల్లల సేఫ్టీలో 49 మార్కులకు 27 స్కోర్ చేసి 3 స్టార్ రేటింగ్ పొందింది. మొత్తానికి ఇది సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite):

నిస్సాన్ కంపేయీ యొక్క మ్యాగ్నైట్ ఇప్పటికి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మోడల్. ఎందుకంటే ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకూండా సేఫ్టీలో కూడా మంచి స్కోర్ చేయడం వల్ల దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ప్రారంభ ధర రూ. 5.76 లక్షలు. ఇది రెనాల్ట్ కిగర్ యొక్క అదే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. సేఫ్టీలో ఇది 4 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో కూడా అడల్ట్ సేఫ్టీలో 17 మార్కులకు 11.85 పాయింట్లను మరియు పిల్లల సేఫ్టీలో 49 మార్కులకు 24.88 సాధించి 2 స్టార్ రేటింగ్ పొదగలిగింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా పంచ్ (Tata Punch):

ఇటీవల కాలంలో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త మైక్రో SUV టాటా పంచ్. డీఐ ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు. ఈ SUV మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందగలిగింది. అంతే కాకుండా ఇది సేఫ్టీ విషయంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా పంచ్ బ్రాండ్ యొక్క 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన మరో కారు. ఇంత తక్కువ ధర వద్ద ఇంత అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఈ SUV మంచి అమ్మకాలను పొందుతోంది. ఇది అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 మార్కులకు 16.45 మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 మార్కులకు 40.89 సాధించి 4 స్టార్ రేటింగ్ పొందిన అత్యంత సురక్షితమైన కారు.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా టియాగో మరియు టాటా టిగోర్ (Tata Tiago & Tigor):

టాటా మోటార్స్ యొక్క టాటా టియాగో మరియు టాటా టిగోర్ రెండూ కూడా అత్యంత సురక్షితమైన కార్లుగా పరిగణించబడతాయి. వీటి దహార్లు వరుసగా రూ. 5.19 లక్షలు (టాటా టియాగో) మరియు రూ. 5.79 లక్షలు (టాటా టిగోర్).

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

ప్రస్తుతం టాటా టియాగో మరియు టిగోర్ 4-స్టార్ రేటింగ్‌తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన కారు. టాటా మోటార్స్ యొక్క టిగోర్ 4-స్టార్ రేటింగ్‌ను పొందింది, అదే విధంగా టాటా టియాగో కూడా 4-స్టార్ రేటింగ్‌ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే సారూప్యతల పరంగా ఇవి దాదాపు చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటాయి.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

టాటా టియాగో మరియు టాటా టిగోర్ (Tata Tiago & Tigor) అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 మార్కులకు 12.52 పాయింట్స్ మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గానూ 34.15 పాయింట్స్ సాధించి ఏకంగా 3 స్టార్ రేటింగ్ పొందగలిగాయి. కావున ఇవి దేశీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సురక్షితమైన కార్ల జాబితాలో చేరింది.

సేఫ్టీలో ఎక్కువ రేటింగ్ & సరసమైన ధర వద్ద లభించే కార్లు: ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో ఎక్కువ భాగం స్వదేశీ కార్లు అత్యంత సురక్షితమైన కార్లుగా పరిగణించబడుతున్నాయి. ఇందులో టాటా మోటార్స్, మహీంద్రా వంటి వున్నాయి. ప్రస్తుతం కొనుగోలుదారులు ఆధునిక ఫీచర్స్ కలిగిన కార్లను మాత్రమే కాకుండా ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇవే సురక్షితం కాబట్టి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 22, 2022, 10:13 [IST]
English summary
Top affordable safest cars in india punch triber magnite details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+