Top Car News of The Week: స్కోడా స్లావియా 1.5లీ, ఆల్ట్రోజ్ డిసిఏ, హ్యుందాయ్ i20 అప్‌డేట్.. మరిన్ని వివరాలు
దేశీయ మార్కెట్లో గత వారంలో కొన్ని కంపెనీలు తమ కార్లను విడుదల చేయగా, మరికొన్ని కంపెనీలు విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. గత వారంలో స్కోడా స్లావియా యొక్క 1.5 లీటర్ వెర్షన్ విడుదలైంది. కాగా ata Altroz DCA యొక్క టీజర్ మరియు కొత్త టయోటా గ్లాంజా యొక్క టీజర్ వంటివి విడుదలయ్యాయి. అంతే కాకూండా 2022 MG ZS EV యొక్క లాంచ్ తేదీ వెల్లడైంది మరియు 2022 హ్యుందాయ్ i20 అప్డేట్ చేయబడింది. వీటి గురించిన మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

స్కోడా స్లావియా 1.5లీ లాంచ్ (Skoda Slavia 1.5-L Launch):
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) ఇటీవల అత్యంత శక్తివంతమైన 1.5 TSI వెర్షన్‌ను విడుదల చేసింది. స్లావియా 1.5 TSI మాన్యువల్ వేరియంట్ ధర రూ. 16.19 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

స్లావియా యొక్క శక్తివంతమైన 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ డిసిఏ వివరాలు (Tata Altroz DCA Details):
భారతీయ మార్కెట్లో Tata Altroz DCA కోసం బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి. కావున ఈ మోడల్ త్వరలో మార్కెట్లోకి తీసుకురాబడుతుంది. టాటా మోటార్స్ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను బ్లూ కలర్ ఎంపికలో తీసుకురానుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఈ వీడియోలో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Tata Altroz DCA అనగా ఇది డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకురాబడిందని అర్థం. కంపెనీ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలుదారులు రూ. 21,000 అడ్వాన్స్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు 2022 మార్చి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

టయోటా గ్లాంజా టీజర్ (Toyota Glanza Teaser):
టయోటా కంపెనీ యొక్క టయోటా గ్లాంజా త్వరలో భారత మార్కెట్లో విడుదలకానుంది. అయితే కంపెనీ ఈ కొత్త టయోటా గ్లాంజా యొక్క ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఇది మారుతి బాలెనొ కంటే కొత్ భిన్నంగా ఉటుంది. కానీ చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి.

టయోటా గ్లాంజా కొత్త మోడల్ మారుతి బాలెనో ఆధారంగా రూపొందించబడింది. కంపెనీ దీనిని 15 మార్చి 2022న భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే చాలా మంది డీలర్ల ద్వారా అనధికారికంగా బుకింగ్ ప్రారంభించబడింది. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది.

2022 MG ZS EV లాంచ్ డేట్:
భారతీయ మార్కెట్లో ఎంజి మోటార్ కంపెనీ తన 2022 MG ZS EV ని 2022 మార్చి 7న భారత మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంది. ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి అధుతన ఫీచర్స్ పొందుతుంది. 2022 MG ZS EV ఎలక్ట్రిక్ SUV యొక్క పరిధిని పెంచడానికి పెద్ద బ్యాటరీ ప్యాక్ రానుంది.

కొత్త 2022 MG ZS EV యొక్క ముందుభాగంలో LED హెడ్‌లైట్, LED DRL, కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త బాడీ కలర్స్, ఛార్జింగ్ పోర్ట్ ఉంచబడిన సాధారణ గ్రిల్ ఉన్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు రియర్ బంపర్ ఇవ్వబడ్డాయి. ఇందులో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చాలా అప్డేటెడ్ గా ఉంటుంది.

2022 హ్యుందాయ్ i20 అప్‌డేట్ (2022 Hyundai i20 Update):
2022 హ్యుందాయ్ ఐ20 ఇప్పుడు అనేక అప్డేట్స్ పొందుతుంది. అయితే కంపెనీ ఈ ప్రీమియం నుండి కొన్ని వేరియంట్‌లు మరియు ఫీచర్లను తొలగించింది, కొన్నింటిని కూడా జోడించింది. కంపెనీ Asta ట్రిమ్ నుండి 1.2-లీటర్ పెట్రోల్ IVT మరియు 1.0-లీటర్ DCT ఆటోమేటిక్‌లను వదిలివేసింది, ఇది ఇప్పటివరకు మాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న Asta (O)తో భర్తీ చేసింది. 2022 హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వస్తుంది.

ఈ విభాగంలోని ఇతర మోడల్‌లు నిరంతరం అనేక అప్‌డేట్‌లతో వస్తూనే ఉన్నాయి. ఈ విభాగంలో 2022 హ్యుందాయ్ i20 భారతీయ మార్కెట్లో మారుతీ బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వాటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ మధ్యకాలంలోనే కొత్త తరం బాలెనో తీసుకురాబడింది.


Click it and Unblock the Notifications








