భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

దేశీయ విఫణిలో రోజురోజుకి ఇంధన (పెట్రోల్ మరియు డీజిల్) ధరలు పెరుగుతున్న కారణంగా ఇప్పుడు ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు CNG వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు CNG వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 10 బెస్ట్ CNG కార్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

మారుతి సెలెరియో CNG (Maruti Celerio CNG):

ప్రముఖ వాహన తయారు సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) తన కొత్త తరం మారుతి సెలెరియోను గత ఏడాది చివరలో విడుదల చేసింది. అయితే ఈ మోడల్ ఇప్పుడు CNG వేరియంట్లో కూడా అందుబటులోకి వచ్చింది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 56 bhp పవర్ మరియు 82 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. కొత్త మారుతి సుజుకి సెలెరియో CNG అనేది 35 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R):

మనం చెప్పుకుంటున్న ఈ జాబితాలో రెండవ బెస్ట్ CNG కారు మారుతి సుజుకి యొక్క వ్యాగన్ ఆర్. ఈ CNG మోడల్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 57 bhp పవర్ మరియు 78 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ మారుతి సుజుకి యొక్క వ్యాగన్ ఆర్ CNG ఇంధనంపై 32 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

మారుతి ఆల్టో 800 (Maruti Alto 800):

మారుతి సుజుకి యొక్క ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మారుతి ఆల్టో 800 కూడా CNG ఆప్సన్ లో అందుబటులో ఉంది. ఈ కారు 800 సిసి పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ CNG ఇంజన్ 40 bhp పవర్ మరియు 60 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 1 కేజీ సిఎన్‌జిపై 31.59 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S-Presso):

మారుతి సుజుకి యొక్క మారుతి S-ప్రెస్సో కూడా CNG వేరియంట్లో భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విక్రయించబడుతోంది. ఇది 57 bhp పవర్ మరియు 78 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CNG ఇంధనంపై 31.2 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro):

హ్యుందాయ్ కంపెనీ యొక్క హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro) కూడా ఇప్పుడు భారతీయ మార్కెట్లో CNG వేరియంట్లో అందుబాటులో ఉంది. ఇది 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విక్రయించబడుతోంది. ఈ ఇంజన్ 60 bhp పవర్ మరియు 85 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ శాంత్రో CNG వేరియంట్ 30.4 కి.మీ పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios):

హ్యుందాయ్ కంపెనీ యొక్క మరొక CNG మోడల్ ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios). ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్ తో అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ CNG ఇంధనంపై 69 bhp పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ CNG వేరియంట్ 28.5 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura):

హ్యుందాయ్ కంపెనీ యొక్క హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) ఈ జాబితాలో 7 వ మోడల్. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ CNG ఇంధనంపై 69 bhp పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. CNG ఇంధనంతో కూడిన ఈ ఇంజన్ 28 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

టాటా టియాగో (Tata Tiago):

టాటా మోటార్స్ యొక్క టాటా టియాగో (Tata Tiago) CNG ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో భారతీయ మార్కెట్లో అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ 73 bhp పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. టాటా టియాగో CNG మోడల్ 26.49 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

టాటా టిగోర్ (Tata Tigor):

టాటా మోటార్స్ యొక్క మరొక CNG మోడల్ టాటా టిగోర్ (Tata Tigor). ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజన్ CNG ఇంధనంపై 73 bhp పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. CNG ఇంధనంతో కూడిన ఈ ఇంజన్ 26.49 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 10 బెస్ట్ CNG కార్లు: వివరాలు

మారుతి ఎర్టిగా (Maruti Ertiga):

మారుతి సుజుకి యొక్క మారుతి ఎర్టిగా (Maruti Ertiga) మనం చెప్పుకుంటున్న టాప్ 10 CNG మోడల్స్ జాబితాలో చివరి మోడల్. మారుతి ఎర్టిగా (Maruti Ertiga) 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ CNG ఇంధనంపై 91 bhp శక్తిని మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG ఇంధనంతో కూడిన ఈ ఇంజన్ 26.08 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 CNG మోడల్స్ గురించి తెలుసుకున్నాం.. కదా.. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏదో ఎంపిక చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, January 24, 2022, 12:17 [IST]
English summary
Top cng cars in india with best mileage celerio wagon r alto santro details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+