ఈ సంవత్సరం (2022) దేశీయ మార్కెట్లో విడుదలైన పాపులర్ కార్లు - వివరాలు
కరోనా మహమ్మారి కొంత తగ్గుముఖం పట్టిన తరువాత సెమీకండక్టర్ చిప్ కొరత కూడా కొంతవరకు తగ్గింది. ఈ కారణంగా 2022 లో భారతీయ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో కొత్త వాహనాలు విడుదలయ్యాయి. అయితే ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేసిన 5 వాహనాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మహీంద్రా స్కార్పియో ఎన్:
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా యొక్క స్కార్పియో ఎన్ 2022 లో ఆశాజనకమైన మోడల్. గత 20 సంవత్సరాలుగా వాహన మార్కెట్లో తిరుగులేని స్కార్పియో ఈ సంవత్సరం స్కార్పియో ఎన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ.11.99 లక్షల నుండి రూ.21.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సేఫ్టీలో సురక్షితమైన వాహనంగా నిలిచింది. స్కార్పియో ఎన్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గాను 29.25 పాయింట్లు సాధించి, అడల్ట్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్, చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 28.93 పాయింట్లు సాధించింది, చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ సాధించింది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా:
మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా ఈ సంవత్సరం విడుదలయింది. ఈ మిడ్-సైజ్ SUV మార్కెట్లో విడుదల కాక ముందు నుంచే మంచి ఆదరణ పొందగలిగింది. 2022 జులై ఇప్పటికి గ్రాండ్ విటారా కోసం దాదాపు 87,953 బుకింగ్స్ వచ్చాయి. ఈ గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఇది మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందింది.
2022 గ్రాండ్ విటారా 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్:
మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క 'ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్' (XUV300 TurboSport) కూడా 2022 లో విడుదలైన పాపులర్ మోడల్. దీని ప్రారంభ ధర రూ. 10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ ఇప్పుడు కొత్త లోగో కలిగి ఉండటమే కాకుండా, నాలుగు కొత్త కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
కొత్త మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్ 1.2 లీ త్రీ సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 130 పిఎస్ పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఈ అప్డేటెడ్ ఇంజిన్ మంచి పనితీరుని అందిస్తుంది, కావున మైలేజ్ కూడా కొంత ఎక్కువగానే అందించే అవకాశం ఉంటుంది.
కియా ఈవి6:
కియా మోటార్స్ యొక్క అత్యంత పాపులర్ ఎలక్ట్రిక్ కారు 'ఈవి6'. కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారు ధర రూ. 59.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదలైంది. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని దేశీయ విఫణిలో విడుదలచేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే మొత్తమ్ అమ్ముడైపోయాయి. కొత్త కియా ఈవి6 ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది.
కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారు 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చింది. ఒక సింగిల్ ఛార్జ్ తో 528 కిమీ పరిధిని అందిస్తుందని తెలియడం వల్ల ఎక్కువమంది ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
టాటా టియాగో EV:
టాటా మోటార్స్ యొక్క టియాగో EV కూడా ఈ సంవత్సరంలో విడుదలైన టాప్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) లో Ziptron హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి IP67 రేటింగ్ కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త టియాగో ఈవి సిటీ మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్‌లు మరియు 4 రీజెన్ మోడ్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








