భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్ల గురించి చాలా మందిలో కొన్ని అపోహలు ఉంటాయి. ఆటోమేటిక్ కార్లు తక్కువ మైలేజీనిస్తాయని, వాటి మెయింటినెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుందని, తరచూ రిపేర్లు వస్తుంటాయని ఇలా వాటి గురించి అనేక రకాల సందేహాలు ఉంటాయి. నిజానికి, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కార్లలో ఉపయోగిస్తున్న ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు చాలా అధునాతనంగా మారాయని చెప్పవచ్చు. ఒకప్పటితో పోల్చుకుంటే, ప్రస్తుత ఆటోమేటిక్ గేర్‌బాక్సులు టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ అయ్యాయి.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

మనదేశంలో ఇటీవలి కాలంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్లకు డిమాండ్ జోరందుకుంది. ఈ ఆటోమేటిక్ కార్లు రద్దీగా ఉండే రోడ్లపై నిత్యం క్లచ్ నొక్కుతూ, గేర్లు మార్చాల్సిన అవసరాన్ని తప్పిస్తున్నాయి. దీంతో తయారుదారులు కూడా కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో కార్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం, భారతదేశంలో ఐదు రకాల పాపులర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటి వివరాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

1. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ లో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి) అనేది అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో తయారైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్. పేరుకు తగినట్లుగానే ఇందులో రెండు క్లచ్‌లు ఉంటాయి, ఇవి ఇది చాలా మృదువైన గేర్ షిఫ్ట్‌ అనుభూతిని అందిస్తాయి. అంతేకాకుండా, DCT కలిగిన కార్లు వేగవంతమైన మరియు మరింత ఖచ్చితమైన గేర్ షిఫ్ట్‌లను అందిస్తాయి. అయితే, వీటి వలన ఇంధన సామర్థ్యం, అదేనండీ మైలేజ్ తక్కువగా ఉంటుంది. కాకపోతే, డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన నడపటానికి చాలా సరదాగా ఉంటాయి.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

ఈ ఫన్ టూ డ్రైవ్ కార్ల డ్రైవింగ్ ఫన్ ను మరింత పెంచేందుకు వీటిలో స్టీరింగ్ క్రింద్ భాగంలో పాడిల్ షిఫ్టర్లు కూడా ఉంటాయి. ఈ పాడిల్ షిఫ్టర్ల సాయంతో డ్రైవర్ గేర్లను మ్యాన్యువల్ గా తన చేతి వేళ్లతో కంట్రోల్ చేయవచ్చు. ఇదంతా చూడటానికి మరియు అనుభవించడానికి ఓ రేస్ కారును నడుపుతున్న అనుభూతిని అందిస్తుంది. భారత మార్కెట్లో స్కోడా సూపర్బ్, జీప్ కంపాస్ మరియు కియా సెల్టోస్ వంటి కార్లలో ఈ తరహా టెక్నాలజీతో కూడిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

2. ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT)

ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, పేరుకు తగినట్లుగానే ఇది తెలివైన మ్యాన్యువల్ గేర్‌బాక్స్. ఇవి డిసిటి మాదిరిగా ఫుల్లీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు కావు. ఇందులోని గేర్‌బాక్స్ చూడటానికి మ్యాన్యువల్ కార్లలో కనిపించే గేర్‌బాక్స్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఇందులో క్లచ్ ఉండదు, మరి క్లచ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారనేదే కదా మీ సందేహం. ఇందులో క్లచని హైడ్రాలిక్స్ సాయంతో ఆటోమేటిక్ కారు దానికదే ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది. డ్రైవర్ గేర్ మార్చాలనుకున్న ప్రతిసారి క్లచ్‌తో పని లేకుండా గేర్ రాడ్ ను ముందుకు వెనుకకు లేదా పక్కకు కదిలించడమే.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ లో కారులో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ మరియు యాక్యుయేటర్‌లు కారులోని డ్రైవర్‌ మాన్యువల్‌గా గేర్‌లను మార్చినప్పుడల్లా కారు క్రింది భాగంలో ఉండే కనిపించని క్లచ్‌ని యాక్టివేట్ ఆపరేట్ చేస్తాయి. ఇలాంటి కార్లు పూర్తిగా ఆటోమేటిక్ కార్ల కంటే తక్కువ భాగాలను కలిగి ఉంటాయి కాబట్టి, వాటి ధర కూడా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్ల కంటే కాస్తంత ఎక్కువగా మరియు ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్ల కంటే తక్కువగా ఉంటాయి. హ్యుందాయ్ వెన్యూ, ఐ20 మరియు క్రెటా కార్లలో ఈ తరహా గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

3. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)

ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇది కూడా పైన చెప్పుకున్నట్లుగా ఆటోమేటిక్ మాదిరిగా కనిపించే ఓ మ్యాన్యువల్ గేర్‌బాక్స్. ఫుల్లీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్లకు చవకైన ప్రత్యామ్నాయ మార్గం. ఎడమ కాలుతో క్లచ్ తొక్కడానికి ఇబ్బంది పడే వారు, మ్యాన్యువల్ కార్లను ఇలాంటి ఏఎమ్‌టి కార్లను కొనుక్కోవచ్చు. ఇలాంటి కార్లలో గేర్ రాడ్ చూడటానికి అచ్చం మ్యాన్యువల్ కార్లలో ఉన్నట్లుగానే కనిపిస్తుంది. డ్రైవర్ కారు నడిపే వేగాన్ని బట్టి, క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా గేర్ ను మార్చుకుంటే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

ఈ టెక్నాలజీలో డ్రైవర్ గేరు మార్చినప్పుడల్లా క్లచ్‌ని ఎంగేజ్ చేయడాని కారులోని సెన్సార్‌లు మరియు యాక్యుయేటర్‌లు కలిసి పనిచేస్తాయి. ఇవి మెరుగైన మైలేజీని ఇస్తాయి కానీ ఫుల్లీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ల మాదిరిగా మృదువైన గేర్ షిఫ్ట్ లను మాత్రం అదించవు. మనదేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు ఈ గేర్‌బాక్స్ ఆప్షన్ ను అందిస్తున్నాయి.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

4. కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT)

కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ లు ఒకప్పుడు అత్యంత పాపులర్ అయిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లు. అయితే, ఇటీవలి కాలంలో వీటి ప్రాచుర్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. సివిటి గేర్‌బాక్స్‌ లు ఒక పుల్లీ మరియు బెల్ట్ ద్వారా నడపబడతాయి. ఈ రెండింటి కలయికతో కారు వేగం మరియు థ్రోటల్ ఇన్‌పుట్ ప్రకారం అవసరమైన గేర్లను దానంతట అదే ఆటోమేటిక్ గా మార్చుకుంటుంది. ఈ రకం గేర్‌బాక్స్ లు చాలా మృదువైన గేర్ షిఫ్టులను అందిస్తాయి. అయితే, బెల్ట్ ఆధారిత ట్రాన్సిమిషన్ కాబట్టి, ఎక్కువ థ్రోటల్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ కాస్తంత బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

భారతదేశంలో అమ్ముడయ్యే కార్లలో లభించే ఈ టాప్ 5 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల గురించి మీకు తెలుసా?

5. టార్క్ కన్వర్టర్

టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు, చాలా పురాతనమైనవి. ఈ టెక్నాలజీ నుండి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అయితే, కొన్ని లగ్జరీ కార్ల తయారీదారులు మాత్రం ఇప్పటికీ తమ కార్ మోడళ్లలో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. కారణం ఇవి చాలా మెరుగైన గేర్‌షిఫ్ట్‌ని అందిస్తాయి. మనదేశంలో మారుతి సుజుకి ఎక్కువగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇది ఇంపెల్లర్ మరియు టర్బైన్ ను ఉపయోగించి పనిచేస్తుంది. కాకపోతే, ఇలాంటి గేర్‌బాక్స్ లు మంచి మైలేజీని ఇవ్వలేవు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 23, 2022, 13:31 [IST]
English summary
Top five different types of automatic transmissions in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+