'2022 మారుతి ఈకో' లో తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు

ఎప్పటికప్పుడు తన వాహన విభాగంలోని కార్లను అప్డేట్ చేస్తున్న మారుతి సుజుకి ఇటీవల 'ఈకో' ను కూడా అప్డేట్ చేసింది. ఈ 2022 మారుతి ఈకో ఇప్పుడు మునుపటికంటే కూడా చాలా ఆధునికంగా ఉంది.

2022 మారుతి సుజుకి ఈకో మల్టిఫుల్ వేరియంట్స్ లో అందుబాటులో ఉండటమే కాకుండా, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది. అయితే ఈ కొత్త మోడల్ లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. వాటిని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 మారుతి ఈకో టాప్ హైలెట్స్

వేరియంట్స్ మరియు ధరలు:

'2022 మారుతి ఈకో' 5-సీటర్ స్టాండర్డ్, 5-సీటర్ AC, 7-సీటర్ స్టాండర్డ్, 7-సీటర్ AC, అంబులెన్స్ మరియు అంబులెన్స్ షెల్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా కమర్షియల్ విభాగంలో మారుతి సుజుకి ఈకో టూర్ మరియు కార్గో వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే, 5-సీటర్ స్టాండర్డ్ వేరియంట్ రూ. 5.13 లక్షలు కాగా, ఈకో CNG వెర్షన్ రూ. 6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

కలర్ ఆప్సన్స్:

కొత్త 2022 మారుతి సుజుకి ఈకో ఇప్పుడు మొత్తం 5 కలర్స్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి సాలిడ్ వైట్, పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే మరియు మెటాలిక్ బ్రిస్క్ బ్లూ కలర్. మెటాలిక్ బ్రిస్క్ బ్లూ కలర్ అనేది పూర్తిగా కొత్త కలర్ ఆప్సన్స్. 2022 ఈకో 5 కలర్స్ లభిస్తుంది కావున కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్సన్స్ ఎంచుకోవచ్చు.

ఇంజిన్:

2022 మారుతి సుజుకి ఈకో ఇప్పుడు మరింత శక్తివంతమైన 1.2-లీటర్, K12C, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కొత్త ఇంజన్ 80 బిహెచ్‌పి మరియు 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక మారుతి ఈకో CNG 71 బిహెచ్‌పి మరియు 95 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

ఇంజిన్ పర్ఫామెన్స్:

మారుతి సుజుకి యొక్క ఈకో ఒకప్పటి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. దీనికి ప్రధాన కారణం ఇది అందించే ఉత్తమమైన మైలేజ్. అయితే 2022 మారుతి ఈకో పెట్రోల్ మోడల్ ఒక లీటరుకు 19.71 కిమీ మైలేజ్ అందిస్తుంది. కాగా, మారుతి ఈకో CNG ఒక కేజీ CNG తో 26.78 కిమీ మైలేజ్ అందిస్తుంది. మొత్తం మీద ఇంజిన్ పర్ఫామెన్స్ ఇప్పుడు మరింత అద్భుతంగా ఉందని తెలుస్తుంది.

ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్:

2022 మారుతి ఈకో (2022 Maruti Eeco) ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. కావున ఇప్పుడు మారుతి ఈకో లో సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, కొత్త రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈకో వాహన వినియోగదారులకు తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించే అవకాశం ఉంటుంది.

2022 ఈకో భద్రత పరంగా కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది. కావున ఇందులో ఇప్పుడు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ స్లైడింగ్ డోర్లు, విండోస్ కి చైల్డ్ లాక్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ మరియు ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది మునుపటికంటే ఆధునికంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

Most Read Articles

English summary
Top five highlights about 2022 maruti suzuki eeco details
Story first published: Friday, November 25, 2022, 8:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X