'మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి' కొనాలంటే తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఎట్టకేలకు ఆల్టో కె10 యొక్క CNG వేరియంట్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క 13 వ మోడల్ కావడం గమనార్హం.

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి ధర రూ. 5.95 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది ప్రస్తుతం VXi వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ధర దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ.

ఇవి చూడకుండా మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి కొనకండి

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 S-CNG దాని ఇతర మోడల్స్ మాదిరిగానే అదే 1.0 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఇది 65 హెచ్‌పి మరియు 89 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది, కాగా ఇది సిఎన్‌జి మోడ్ లో 57 హెచ్‌పి మరియు 82 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

రేంజ్ మరియు సిఎన్‌జి కెపాసిటీ:

మారుతి సుజుకి ఆల్టో కె10 S-CNG కేజీ సిఎన్‌జితో గరిష్టంగా 33.85 కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఆల్టో కె10 యొక్క CNG ట్యాంక్ కెపాసిటీ 55 కేజీలు. ఈ సిఎన్‌జి ట్యాంక్ వల్ల ఈ కారులో బూట్ స్పేస్ చాలావరకు తగ్గుతుంది. ఎందుకంటే ఈ స్పేస్ ని CNG ట్యాంక్ ఆక్రమిస్తుంది.

ఇవి చూడకుండా మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి కొనకండి

డిజైన్:

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి దాదాపు చూడటానికి దాని పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది CNG కారు అని గుర్తించడానికి కొన్ని అప్డేట్స్ ఇందులో చూడవచ్చు. కావున దీని వెనుక భాగంలో S-CNG బ్యాడ్జ్‌ చూడవచ్చు. ఇది కె10 సిఎన్‌జి అని స్పష్టంగా చెబుతుంది. లైటింగ్ సెటప్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

ఫీచర్స్:

ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త ఆల్టో కె10 CNG దాని మునుపటి పెట్రోల్ వెర్షన్ లోని అదే ఫీచర్స్ తో ముందుకు వెళుతుంది. కావున ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేసే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంతో పాటు, డిజిటల్ స్పీడోమీటర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇవి చూడకుండా మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి కొనకండి

సేఫ్టీ ఫీచర్స్:

ఇప్పుడు దాదాపు ఈ కారు కొనాలన్నా కొనుగోలుదారుడు తప్పకుంఫా అందులో పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా.. లేదా అని తప్పకుండా చూస్తాడు, కావున మారుతి ఆల్టో కె10 CNG డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సెంట్రల్ డోర్ లాకింగ్, రియర్ సీట్ బెల్ట్‌లు, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి యొక్క ఆల్టో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. అయితే ఇది ఇప్పుడు CNG వెర్షన్ లో విడుదలకావడం వల్ల మరింతమంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు, కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top five highlights about maruti suzuki alto k10 s cng details
Story first published: Sunday, November 20, 2022, 8:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X