'టయోటా ఇన్నోవా హైక్రాస్' కొనటానికి ఈ 5 రీజన్స్ చాలు.. మీరేమంటారు
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టయోటా ఇన్నోవా హైక్రాస్' అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇటీవలే ఈ MPV ధరలు కూడా వెల్లడయ్యాయి. అయితే ఈ MPV గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం.
1) వేరియంట్స్ మరియు ధరలు:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) మొత్తం ఐదు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి G, GX, VX, ZX మరియు ZX(O) వేరియంట్స్. ఇందులో బేస్ వేరియంట్ అయిన జి 7 సీటర్ ధర రూ. 18.30 లక్షలు కాగా, టాప్ వేరియంట్ అయిన హైబ్రిడ్ ZX(O) ధర రూ. 28.97 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

టయోటా కంపెనీ ఇప్పటికే ఈ లేటెస్ట్ MPV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. టయోటా కంపెనీ ఇన్నోవా క్రిష్టాతో పాటు హైక్రాస్ ని కూడా విక్రయిస్తుంది. నిజానికి హైక్రాస్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టా డీజిల్ వేరియంట్ ధర కంటే దాదాపు రూ. 2 లక్షలు ఎక్కువ.
2) డిజైన్:
టయోటా ఇన్నోవా హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ కలిగి దాని మధ్యలో బ్రాండ్ లోగో పొందుతుంది. ఇది క్రోమ్ తో ఫినిష్ అయి ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్ మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కూడా ఉన్నాయి.
3) ఇంటీరియర్ ఫీచర్స్:
ఇన్నోవా హైక్రాస్ యొక్క ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ థీమ్ పొందుతుంది. ఇందులో 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో ఇందులో ఉన్న సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది.
అంతే కాకుండా ఇందులో మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడంలో తప్పకుండా సహాయపడతాయి.
4) ఇంజిన్ & పర్ఫామెన్స్:
ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో పెట్రోల్ లేదా పెట్రోల్ హైబ్రిడ్ ఆప్సన్స్ ఉంటాయి. కానీ ఇది డీజిల్ ఇంజిన్ పొందే అవకాశం లేదు. కావున ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 172 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున తప్పకుండా ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇందులోని 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి మరియు 187 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 111 బిహెచ్‌పి మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే పవర్ అవుట్‌పుట్ 184 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది.ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
5) ADAS టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్స్:
ఆధునిక టయోటా ఇన్నోవా హైక్రాస్ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. కావున 'హైక్రాస్' లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








