భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

డీజిల్ కార్లకు ఆదరణ తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ మరియు సిఎన్‌జితో నడిచే కార్లకు డిమాండ్ జోరందుకుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి సెటప్ కలిగిన కార్లు పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కన్నా ఎక్కువ మైలేజీని అందిస్తాయి. అయితే, ఇవి సిఎన్‌జి కిట్ కారణంగా పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అదే సమయంలో, డీజిల్ కార్ల కన్నా తక్కువ ధరను కలిగి ఉంటాయి. ఒకవేళ, మీరు కూడా సిఎన్‌జి కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో నుండి హ్యుందాయ్ శాంత్రో వరకు అనేక సిఎన్‌జి మోడళ్లు ఉన్నాయి. మరి వీటిలో చౌకైన సిఎన్‌జి మోడల్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

1. మారుతి సుజుకి ఆల్టో సిఎన్‌జి (Alto CNG)

మారుతి సుజుకి ఆల్టో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి మరియు కంపెనీ ఇందులో సిఎన్‌జి వెర్షన్ ను కూడా విక్రయిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో సిఎన్‌జి యొక్క ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 4.76 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారులో 796 సిసి, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించారు. సిఎన్‌జి ఇంధనంతో ఈ ఇంజన్ 40 బిహెచ్‌పి శక్తిని మరియు 60 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది కేజీ సిఎన్‌జితో ఈ కారు 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

2. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి (S-Presso CNG)

మారుతి సుజుకి నుండి లభిస్తున్న మరొక పాపులర్ చిన్న కారు ఎస్-ప్రెస్సో (S-Presso), దీనిని ఆల్టో యొక్క టాల్-బాయ్ వెర్షన్ గా చెప్పవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి ధరలు ధర రూ. 5.11 లక్షల నుండి మొదలై రూ. 5.43 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. ఈ చిన్న కారులో 1.0-లీటర్ కె10బి పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 58 బిహెచ్‌పి శక్తిని మరియు 78 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సిజిఎన్‌తో 31.2 కిమీ మైలేజీని ఇస్తుంది.

భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

3. మారుతి సుజుకి ఈకో సిఎన్‌జి (Eeco CNG)

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఈకో లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్ ను విక్రయిస్తోంది. ప్రస్తుతం, దేశంలో లభిస్తున్న అత్యంత చవకైన సిఎన్‌జి యుటిలిటి వాహనం కూడా ఇదే. మార్కెట్లో మారుతి సుజుకి ఈకో ధర రూ. 5.68 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. మారుతి ఈకో సిఎన్‌జి వెర్షన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 62 బిహెచ్‌పి పవర్ మరియు 85 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరుకు 20.88 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి (WagonR CNG)

గత నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన నెంబర్ వన్ కారుగా నిలిచింది. ఎస్‌యూవీ లాంటి వైఖరి, మంచి యుటిలిటీ స్పేస్, హై రైడింగ్ పొజిషన్, మెరుగైన మైలేజ్ వంటి అనేక అంశాల కారణంగా ఇది గత రెండు దశాబ్దాలుగా మార్కెట్‌ను శాసిస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 58 బిహెచ్‌పి పవర్ ను మరియు 78 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కేజీకి 32.52 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మార్కెట్లో వ్యాగన్ఆర్ సిఎన్‌జి ధరలు రూ. 5.83 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

5. హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి (Santro CNG)

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న శాంత్రో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింన చిన్న ఫ్యామిలీ కారు. హ్యుందాయ్ శాంత్రో లో కంపెనీ రెండు సిఎన్‌జి వేరియంట్‌లను విక్రయిస్తోంది. ఇందులో Magna మరియు Sportz అనే వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో శాంత్రో సిఎన్‌జి ధరలు రూ. 6.09 లక్షల నుండి ప్రారంభమై రూ. 6.83 లక్షల వరకు ఉంటాయి. ఇది కేజీ సిఎన్‌జి పై గరిష్టంగా 30.48 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 సిఎన్‌జి కార్లు.. ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర..!

సిఎన్‌జి కార్ల కోసం చూస్తున్న వారికి పైన పేర్కొన్న మోడళ్లు మాత్రమే కాకుండా, టాటా టియాగో సిఎన్‌జి, టాటా టిగోర్ సిఎన్‌జి, హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి, మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి, మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మారుతి సుజుకి మరిన్ని సిఎన్‌జి కార్లను విడుదల చేయాలని చూస్తుండగా, కియా ఇండియా కూడా ఈ విభాగంలోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తోంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, July 8, 2022, 16:30 [IST]
English summary
Top five most affordable cng cars in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+