ఈ సంవత్సరం (2022) ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 కార్ ఫీచర్స్, ఇవే
భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు 2022 వ సంవత్సరం (కరోనా మహమ్మారి తరువాత) చాలా కలిసి వచ్చింది. అనేక కొత్త మోడల్స్ అతి తక్కువ కాలంలోని భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసాయి. అయితే ఈ సంవత్సరం ట్రేండింగ్ లో ఉన్న టాప్-5 కార్ ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హెడ్-అప్ డిస్ప్లే:
ఈ ఆధునిక కాలంలో చాలా మంది వాహన కొనుగోలుదారులు ఇష్టపడే ఫీచర్స్ లో హెడ్-అప్ డిస్ప్లే అనేది ఒకటి. ఈ ఫీచర్ ఒకప్పుడు హై-ఎండ్ ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా ఈ సంవత్సరం విడుదలైన కొన్ని లేటెస్ట్ కార్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఈ సంవత్సరం (2022)ట్రేండింగ్ లో ఉన్న టాప్ 5 ఫీచర్స్ లో ఒకటిగా ఉంది.

నిజానికి కార్లలో ఉండే హెడ్-అప్ డిస్ప్లే ఫీచర్ డ్రైవర్ యొక్క దృష్టిని రోడ్డు మీద కేంద్రీకరించేటట్టు చేస్తుంది. ఎందుకంటే వాహనం యొక్క వేగం మరియు టైమ్, టెంపరేచర్ మొదలైనవన్నీ కూడా ఈ డిస్ప్లే లో కనిపిస్తాయి. కావున ఇలాంటి సమాచారం కోసం డ్రైవర్ ప్రత్యేకంగా డ్రైవర్ డిస్ప్లే లో చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సమాచారం మొత్తం హెడ్-అప్ డిస్ప్లే మీద కనిపిస్తుంది.
360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా:
ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్ కార్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా అనేది ఒక సేఫ్టీ ఫీచర్ కూడా. దీని సాయంతో కారు చుట్టుపక్కల పరిసరాలను గమనించవచ్చు. కావున కొత్త ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు, లేదా పార్కింగ్ చేసే సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కారులో ఉండటం వల్ల ఇతరుల సహాయం తీసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు.
వెంటిలేటెడ్ సీట్లు:
ఇక పోతే ఈ సంవత్సరం ట్రేండింగ్ లో ఉన్న టాప్ 5 ఫీచర్స్ లో వెంటిలేటెడ్ సీట్లు కూడా ఒకటి. ఈ వెంటిలేటెడ్ సీట్లు వల్ల వేసవి కాలంలో వేడి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెనుక భాగంలో వెంటిలేషన్ సృష్టించడం వల్ల ఎక్కువ సేపు సీట్లలో కూర్చుని ఉండవచ్చు. కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఈ ఫీచర్ వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
పనోరమిక్ సన్‌రూఫ్:
పనోరమిక్ సన్‌రూఫ్ అనేది గత కొన్ని రోజులుగా చాలా మంది వాహన కొనుగోలుదారుల యొక్క ఇష్టమైన ఫీచర్. ఈ ఫీచర్ వల్ల కారు యొక్క క్యాబిన్ లోకి ఎక్కువ గాలి మరియు వెలుతురు వస్తాయి. మారుతి సుజుకి కూడా ఇటీవల తన గ్రాండ్ విటారాలో కూడా అందించింది. దీన్ని బట్టి చూస్తే సాధారణ కార్లలో కూడా వినియోగదారులు ఈ పనోరమిక్ సన్‌రూఫ్ ఉండాలని ఆసితున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్:
వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన చాలా లేటెస్ట్ కార్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే కారులో ఉండే వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ సాధారణ ఛార్జర్స్ కంటే వేగవంతమైనవి కావు. అయినప్పటికీ వాహన వినియోగదారులు ఈ ఫీచర్ కోరుకుంటారు. అంతే కాకుండా కార్లలో వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా ఇప్పుడు దాదాపు చాలా కార్లలో అందుబాటులో ఉన్నాయి.
భారతీయ మార్కెట్లో అడుగుపెడుతున్న చాలా కార్లలో చాలా వరకు ఆధునిక ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చాలా మంది వాహన కొనుగోలుదారులు ఆధునిక ఫీచర్స్ కోరుకోవడమే. అయితే రానున్న రోజుల్లో మరిన్ని ఆధునిక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆసితున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరియు కొత్త కార్లు మరియు బైకులు గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








