ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇటీవలి కాలంలో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఎక్స్‌యూవీ700 (XUV700) మరియు స్కార్పియో-ఎన్ (Scorpio-N) రెండూ కూడా మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందాయి.

ఈ రెండింటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరసమైన ధర, సుధీర్ఘమైన ఫీచర్స్, విలాసవంతమైన ఇంటీరియర్స్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉన్నప్పటికీ ఈ మోడల్‌ను కొత్తగా వచ్చిన మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని ఎంచుకోవడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

1. లాడెర్ ఫ్రేమ్ ఛాస్సిస్

మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క మోడ్రన్ మోనోకోక్ ఛాసిస్‌కు బదులుగా మహీంద్రా స్కార్పియో-ఎన్ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్‌ పై ఆధారపడి తయారు చేయబడింది. కాబట్టి, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కంటే కొత్త స్కార్పియో-ఎన్ చాలా కఠినమైనదిగా ఉంటుంది మరియు అత్యుత్తమ ఆఫ్-రోడ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు ప్రయాణించే మార్గంలో మట్టి రోడ్లు మరియు బీట్ ట్రయల్స్‌ లాంటివి ఉన్నట్లయితే మీరు మహీంద్రా ఎక్స్‌యూవీ700 కంటే మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయం.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

2. లాకింగ్ డిఫరెన్షియల్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ ఆల్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌తో అందించినప్పటికీ, సరికొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో పోల్చితే, ఇది ఇంత సమర్థవంతంగా ఉండదు. ఎందుకంటే, కొత్త తరం స్కార్పియో-ఎన్ వెనుకవైపు మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను కలిగి ఉంటుంది మరియు ముందు భాగంలో బ్రేక్ లాక్ డిఫరెన్షియల్ ఉంటుంది. ఈ విభిన్నమైన డిఫరెన్షియల్ సిస్టమ్‌ కారణంగా కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆఫ్-రోడ్ ట్రాక్ లపై మహీంద్రా ఎక్స్‌యూవీ700 కంటే శక్తివంతమైనదిగా ఉంటుంది.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

3. మరింత ఎక్కువ శక్తి

మహీంద్రా స్కార్పియో-ఎన్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండూ కూడా ఒకే విధమైన ఇంజన్ ఆప్షన్లను ఉపయోగిస్తున్నప్పటికీ, స్కార్పియో-ఎన్ మాత్రం ఎక్స్‌యూవీ700 కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క పెట్రోల్ వేరియంట్ కంటే మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క పెట్రోల్ వేరియంట్ 3 బిహెచ్‌పి ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఇది స్కార్పియో-ఎన్ ను అత్యంత శక్తివంతమైన మహీంద్రా ఎస్‌యూవీగా మార్చుతుంది.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

4. పరిమాణం

ఒకవేళ మీకు పరిమాణం (ఎస్‌యూవీ సైజ్) మాత్రమే ముఖ్యమైనట్లయితే, మార్కెట్లో కొన్ని ఎస్‌యూవీలు మాత్రమే మహీంద్రా స్కార్పియో-ఎన్ కి గట్టి పోటీ ఇవ్వగలవు. మహీంద్రా స్కార్పియో-ఎన్ 4,662 మిమీ పొడవు, 1,917 మిమీ వెడల్పు మరియు 1,857 మిమీ ఎత్తును కలిగి ఉండి, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కంటే 27 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 102 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కొత్త స్కార్పియో-ఎన్ టొయోటా ఫార్చ్యూనర్ కంటే 62 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 22 మిమీ ఎక్కు పొడవును కలిగి ఉంటుంది.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

5. సైడ్ కి తెరచుకునే టైల్‌గేట్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక రకాల ఎస్‌యూవీలు పైకి తెరచుకునే వెనుక డోర్‌ (టాప్-హింగ్డ్ టెయిల్‌గేట్‌) ను కలిగి ఉంటున్నాయి. ఈ రకమైన టైల్‌గేట్‌లు హ్యాచ్‌బ్యాక్‌లపై ఎక్కువగా ఉంటాయి మరియు ఎస్‌యూవీలలో తక్కువగా ఉంటాయి. ఇరుకైన ప్రదేశాలలో వెనుక డోరుని తెరవడంలో సౌకర్యం కోసం ఎక్కువ మంది తయారీదారులు ఎస్‌యూవీలలో టాప్-హింగ్డ్ టెయిల్‌గేట్‌లను ఉపయోగిస్తుంటారు. అంటే, దీనర్థం సైడ్ కి తెరచుకునే సైడ్-హింగ్డ్ టెయిల్‌గేట్‌లు ఈ రోజుల్లో కనిపించడం చాలా అరుదైన దృశ్యం. కాబట్టి, ఈ ఓల్డ్ స్కూల్ మెమరీని అలానే కొనసాగించేందుకు మహీంద్రా తమ కొత్త స్కార్పియో-ఎన్ లో సైడ్-హింగ్డ్ టెయిల్‌గేట్‌ను అందిస్తోంది.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరియు కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండూ కూడా గొప్ప ఎస్‌యూవీలే మరియు వాటికవే విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అయితే, ఎక్స్‌యూవీ కోసం ఉన్న సుధీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్ ను మరియు పైన తెలిపిన కారణాలను పరిగణలోకి తీసుకుంటే, దాని కన్నా కొత్తగా వచ్చిన మహీంద్రా స్కార్పియో-ఎన్ చాలా రెట్లు బెస్ట్ అనిపిస్తుంది.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

కొత్త స్కార్పియో-ఎన్ విషయానికి వస్తే, దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ధరలు రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ.19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటాయి. అయితే, కొత్త స్కార్పియోని ముందుగా బుక్ చేసుకున్న మొదటి 25,000 కస్టమర్లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే ఐదు ట్రిమ్ లలో 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో 6-సీటర్ మరియు 7-సీటర్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

ఎక్స్‌యూవీ700 వద్దు, స్కార్పియో-ఎన్ ముద్దు.. ఈ 5 రీజన్స్ తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు!

ఈ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ ఇంటీరియర్స్, హై పొజిషన్డ్ సీట్స్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, యాంటీ-పించ్‌ డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ వన్ టచ్ పవర్ విండోస్, రియర్ ఏసి కంట్రోల్స్, ల్యాంప్ మరియు కూలింగ్ ఫీచర్ తో కూడిన గ్లోవ్ బాక్స్, సన్ గ్లాస్ హోల్డర్, మొబైల్ హోల్డర్‌తో కూడిన సీట్ మ్యాప్ పాకెట్, నావిగేషన్‌తో కూడిన 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సోనీ 3డి ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.

Article Published On: Saturday, July 9, 2022, 9:05 [IST]
English summary
Top five reasons why you should consider new mahindra scorpio n over xuv700
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+