2022 లో GNCAP క్రాష్ టెస్ట్‌లో ఉత్తమ స్కోరింగ్ పొందిన కార్లు

గత కొన్ని సంవత్సరాలుగా వాహన వినియోగదారులకు భద్రతా ఫీచర్స్ గురించి మంచి అవగాహన వచ్చింది. ఈ కారణంగానే అత్యధిక భద్రతా ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2022 లో GNCAP క్రాష్ టెస్ట్‌లో ఉత్తమ స్కోరింగ్ పొందిన 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా స్కార్పియో ఎన్:

దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా కంపెనీ యొక్క 'స్కార్పియో ఎన్' (Scorpio N) ఇటీవల నిర్వహించిన గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సేఫ్టీలో సురక్షితమైన వాహనంగా నిలిచింది. స్కార్పియో ఎన్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గాను 29.25 పాయింట్లు సాధించి మొత్తం మీద అడల్ట్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందగలిగింది.

2022 లో GNCAP క్రాష్ టెస్ట్‌లో ఉత్తమ స్కోరింగ్ పొందిన కార్లు

ఇక చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్ విషయానికి వస్తే, ఇందులో మహీంద్రా స్కార్పియో ఎన్ 49 పాయింట్లకు గానూ 28.93 పాయింట్లు సాధించింది. మొత్తమ్ మీద చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ సాధించింది. స్కార్పియో ఎన్ 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటుంది. ఇవి రెండు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి.

స్కోడా కుషాక్ & ఫోక్స్‌వ్యాగన్ టైగన్:

కుషాక్ మరియు టైగన్ రెండూ కూడా అప్‌డేట్ చేయబడిన టెస్టింగ్ ప్రోటోకాల్ కింద పరీక్షించబడిన మొదటి కార్లు. ఇందులో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గానూ 29.64 పాయింట్లు సాధించి 5 స్టార్ రేటింగ్ పొందగా, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో కూడా మంచి స్కోరింగ్ చేసింది. ఇందులో ఈ రెండు కార్లు 49 పాయింట్లకు గానూ 42 పాయింట్లు సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్:

గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో నిస్సాన్ మ్యాగ్నైట్ 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఇది అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 11.85 పాయింట్లు సాధించి 4 స్టార్ రేటింగ్ పొందింది. కాగా చైల్డ్ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 49 పాయింట్లకు గానూ 24.88 పాయింట్లు సాధించి 2 స్టార్ రేటింగ్ పొందింది. మొత్తం మీద నిస్సాన్ మాగ్నైట్ మార్కెట్లో అత్యంత సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లలో ఒకటిగా మారింది.

రెనాల్ట్ కైగర్:

దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో రెనాల్ట్ కంపెనీ యొక్క కైగర్ కూడా ఒకటి. రెనాల్ట్ కైగర్ గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 12.34 పాయింట్లు సాధించి 4 స్టార్ రేటింగ్ పొందింది. కాగా చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 21.05 పాయింట్లు సాధించి 2 స్టార్ రేటింగ్ పొందింది. మొత్తం మీదుగా రెనాల్ట్ కైగర్ సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ సాధించింది.

హోండా సిటీ 4 జెనరేషన్:

హోండా కంపెనీ యొక్క 4 వ తరం హోండా సిటీ కూడా గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 12.03 పాయింట్లు సాధించి 4 స్టార్ రేటింగ్ పొందింది. కాగా చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 38.27 పాయింట్లు సాధించి 4 స్టార్ రేటింగ్ పొందింది. కావున ఇది దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది.

నిజానికి ప్రస్తుతం భారతదేశంలో కార్లను కొనుగోలు చేసే చాలా మంది కస్టమర్లు డిజైన్, ఫీచర్స్ మరియు మైలేజ్ వంటి వాటితో పాటు అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున మార్కెట్లో ఇలాంటి కార్లకే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కావున కంపెనీలు కూడా తమ కార్లలో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తిమైన కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2022, 15:13 [IST]
English summary
Top five safest cars launched in india 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+