కొత్త సంవత్సరానికి ముందే మొదలైన ఆఫర్ల జాతర.. ఈ 5 కార్లు కొనాలనుకునేవారికి ఇదే మంచి తరుణం

ప్రస్తుతం 2022 చివరి నెలలో ఉన్నాము.. ఇక కొత్త సంవత్సరం రావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో ఎక్కువ మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు భారీ ఇయర్ ఎండ్ ఆఫర్లను అందిస్తున్నాయి.

2022 డిసెంబర్ నెలలో భారీ ఆఫర్స్ అందిస్తున్న కంపెనీలలో జీప్, స్కోడా, టాటా మోటార్స్ మరియు ఫోక్స్‌వ్యాగన్ వంటివి ఉన్నాయి. జీప్ కంపెనీ తన మెరిడియన్ మరియు కంపాస్ వంటి వాటి మీద, స్కోడా కంపెనీ కుషాక్ మీద, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కుషాక్ మీద, టాటా మోటార్స్ సఫారి మరియు హారియర్ మీద డిస్కౌంట్స్ అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఈ 5 కార్లు కొనాలనుకునేవారికి ఇదే మంచి తరుణం

జీప్ మెరిడియన్:

జీప్ కంపెనీ యొక్క మెరిడియన్ ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ నెలలో (2022 డిసెంబర్) రూ. 2.50 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ SUV ప్రారంభ ధరలు రూ. 29.90 లక్షల నుంచి ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ ఆఫర్ కారణంగా దీనిని రూ. 2.50 లక్షల తక్కువకే కొనుగోలు చేయవచ్చు. జీప్ మెరిడియన్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదల చేయబడింది.

జీప్ మెరిడియన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ మల్టీఎయిర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 - 2,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

జీప్ కంపాస్:

జీప్ మెరిడియన్ తో పాటు జీప్ కంపాస్ మీద కూడా కంపెనీ ఇప్పుడు రూ. 1.50 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇది 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ బిఎస్6 డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 161 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ మరియు 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.

స్కోడా కుషాక్:

స్కోడా కంపెనీ యొక్క కుషాక్ SUV దేశీయ మార్కెట్లో అద్భుతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే కంపెనీ ఈ SUV మీద రూ. 1.25 ఆఫర్స్ అందిస్తోంది. ఇది రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఇక 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది. ఈ SUV మంచి డిజైన్ మరియు పరికరాలను కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ SUV మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఆశించిన స్థాయిలోనే ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్:

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మీద కూడా 2022 ఇయర్ ఎండ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ SUV మీద రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ SUV కంపెనీ యొక్క MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ మరియు 1.5 లీటర్ TSI ఇంజిన్‌ ఆప్సన్స్ ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇక 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG తో జతచేయబడి ఉంటుంది.

టాటా సఫారి మరియు టాటా హారియర్:

దేశీయ వాహన తయారీ దిగ్గజం అయిన టాటా మోటార్స్ తన టాటా సఫారీ మరియు టాటా హరియర్ మీద రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. టాటా సఫారి మరియు టాటా హారియర్ రెండు SUV లు 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 19, 2022, 15:44 [IST]
English summary
Top five suvs highest year end offers details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+