టయోటా గ్లాంజా CNG కొనాలంటే కోనేయండి.. అయితే ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి

రోజురోజుకి CNG కార్ల వినియోగం ఎక్కువవుతున్న సమయంలో చాలా కంపెనీకి CNG వాహన విభాగాన్ని విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే టొయోట కొత్త గ్లాంజా CNG ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త టొయోట గ్లాంజా CNG వెర్షన్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. అంతే కాకూండా.. ఈ వెర్షన్ కొనాలనుకునే కస్టమర్లు తప్పకుండా 5 విషయాలను తెలుసుకోవాలి.

టయోటా గ్లాంజా CNG కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

వేరియంట్స్ మరియు ధరలు:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త టొయోట గ్లాంజా CNG వెర్షన్ G మరియు S అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. వీటి ధర లు వరుసగా రూ. 8.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా), రూ. 9.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అంటే ఈ ధరలు దాని స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్స్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ. టొయోట గ్లాంజా CNG వెర్షన్ కొనాలనుకునేవారు ఇప్పుడు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

కొత్త టొయోట గ్లాంజా CNG వెర్షన్ మారుతి సుజుకి బాలెనో S-CNG మోడల్‌కు శక్తినిచ్చే అదే 1.2-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో గ్లాంజా 90 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 77 హెచ్‌పి మరియు 98.5 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా CNG మోడల్స్ మాదిరిగానే ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అయితే CNG వెర్షన్ దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

టయోటా గ్లాంజా CNG

గరిష్ట పరిధి (మైలేజ్):

టొయోట యొక్క కొత్త గ్లాంజా CNG ఇప్పుడు ఒక కేజీ CNG తో గరిష్టంగా 30.61 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కాగా స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు 22.35 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. దీన్ని బట్టి చూస్తే CNG వెర్షన్ పెట్రోల్ వెర్షన్ కంటే కూడా 8 కిలోమీటర్లు ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

డిజైన్ మరియు ఫీచర్స్:

కొత్త గ్లాంజా CNG వెర్షన్ దాని పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉన్నాయి. అయితే టెయిల్‌గేట్‌పై CNG బ్యాడ్జింగ్‌ కనిపిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో స్టార్ట్/స్టాప్ బటన్, పవర్ విండోస్, వాయిస్ అసిస్టెన్స్, కనెక్టెడ్ కార్ టెక్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్:

ప్రస్తుతం కారు కొనే ఏ వినియోగదారుడైన అందులో నిర్దిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా.. లేదా అని చూస్తారు. కావున టొయోట గ్లాంజా CNG లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ సీట్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా మరియు రియర్ వ్యూ సెన్సార్ వంటివి ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే టొయోట యొక్క గ్లాంజా మంచి ఆదరణ పొందిన కారు. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో మరింత గొప్ప మైలేజ్ అందించే విధంగా CNG వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. కావున ఇది తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. ఈ గ్లాంజా CNG వెర్షన్ దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన మారుతి బాలెనో సిఎన్‌జికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Top five things about the new toyota glanza e cng details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X