బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

భారతదేశంలో రోజు రోజుకి అనేక కొత్త కొత్త వాహనాలు అడుగుపెడుతున్నాయి. ఈ కొత్త వాహనాలలో ఎక్కువ ధర కలిగిన వాహనాలు మరియు తక్కువ ధర కలిగిన వాహనాలు ఉన్నాయి. అయితే చాలా మంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలు.

ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను కొనుగోలు చేయాలని చూసే వారి కోసం మేము ఈ కథనంలో మంచి మైలేజ్ అందించే వాహనాలను గురించి వివరించడం జరిగింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0-లీటర్ టిఎస్ఐ (Volkswagen Taigun 1.0L TSI):

మనం చెప్పుకుంటున్న అత్యధిక మైలేజ్ అందించే వాహనాల జాబితాలో మొదటిది ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) యొక్క టైగన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మోడల్. ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

ఇక ఈ ఎస్‌యువి యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు 18.23 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అంతే కాకుండా ఇది ఐడెల్ స్టార్ట్ మరియు స్టార్ట్ టెక్నాలజీ కలిగి ఉంది కావున మంచి మైలేజ్ అందిస్తుంది. ఇది మంచి మైలేజ్ మాత్రమే కాకుండా ఆధునిక డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5-లీటర్ టిఎస్ఐ (Volkswagen Taigun 1.5L TSI):

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ యూనిట్ కూడా మంచి మైలేజ్ అందిస్తుంది. ఇది ఒక లీటరుకి 18.18 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులోని ఇంజిన్ అదే 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇందులో కూడా ఐడెల్ స్టార్ట్ మరియు స్టార్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద టైగన్ ఎస్‌యువిలు మంచి మైలేజ్ అందిస్తాయని నిర్దారించబడ్డాయి.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

స్కోడా కుషాక్ 1.5-లీటర్ ట్ఎస్ఐ (Skoda Kushaq 1.5L TSI):

అతి తక్కువ కాలంలోనే అత్యధిక అమ్మకాలను పొందిన స్కోడా కంపెనీ యొక్క పాపులర్ ఎస్‌యూవీ ఈ కుషాక్. మన జాబితాలో మూడవ స్థానంలో ఉన్న కారు ఈ కుషాక్ యొక్క 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌. ఈ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ తో లభిస్తుంది. ఈ మోడల్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే.. ఇది ఒక లీటరుకి 17.83 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ (Hyundai Creta 1.5L Petrol):

హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా దాని విభాగంలో అత్యధిక అమ్మకాలను పొందుతున్న మోడల్. దీనికి ప్రధాన కారణం ఇది మంచి మైలేజ్ అందించడమే కాకుండా ఆధునిక ఫీచర్స్ కూడా కలిగి ఉండటం. ఈ హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఒక లీటరుకి 16.85 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఈ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ తో లభిస్తుంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

స్కోడా కుషాక్ 1.0-లీటర్ టిఎస్ఐ (Skoda Kushaq 1.0L TSI):

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక లీటరుకు గరిష్టంగా 16.83 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

స్కోడా కంపెనీ తన కుషాక్‌ ఎస్‌యూవీని ఇండియా 2.0 ప్లాన్‌ కిందకు తీసుకువచ్చింది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా కంపెనీ యొక్క పాపులర్ మోడల్ గా ప్రసిద్ధి చెందింది. అమ్మకాల పరంగా కూడా ఇది ఉత్తమ అమ్మకాలను పొందుతోంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

హ్యుందాయ్ క్రెటా 1.4-లీటర్ టర్బో పెట్రోల్ (Hyundai Creta 1.4L Turbo Petrol):

ఇప్పటికే మన జాబితాలో హ్యుందాయ్ క్రెటా యొక్క 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ గురించి చెప్పుకున్నాం. అంతే కాకూండా క్రెటా యొక్క 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉత్తమ మైలేజ్ అందిస్తుంది. ఇది ఒక లీటరుకు 16.80 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. క్రెటా 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మోడల్ కేవలం 7-స్పీడ్ డిసిటి ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

కియా సెల్టోస్ 1.5-లీటర్ (Kia Seltos 1.5L):

భారతీయ మార్కెట్లో పాపులర్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ యొక్క కియా సెల్టోస్ కూడా మంచి మైలేజ్ అందించే కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది ఒక లీటరుకు 16.65 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కియా సెల్టోస్ 1.5-లీటర్ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఎముకలతో అందుబాటులో ఉంటుంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

కియా మోటార్స్ యొక్క కియా సెల్టోస్ అమ్మకాల పరంగా శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న మోడల్. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. అదే విధంగా కంపెనీ యొక్క సొనెట్ ఎస్‌యూవీ విడుదలైనప్పటి నుంచి ఇప్పటికి ఏకంగా 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. అయితే మన జాబితాలో చివరి మోడల్ కియా సెల్టోస్. అమ్మకాల పరంగా ముందు ఉన్నప్పటికీ మైలేజ్ విషయంలో మాత్రం కొంత వెనుకబడి ఉంది.

బెస్ట్ మైలేజ్ అందించే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలు కొనుగోలుచేయాలని ఎదురు చూసే వారికి పైన ఉన్న మోడల్ ఉత్తమమైన ఎంపిక. కావున మీకు చ్చిన మోడల్ ఇందులో ఎంచుకోవచ్చు. దీనిపైన మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అంతే కాకూండా ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Top mileage mid size suv 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X