2022 జూన్ సేల్స్: టాప్ 10 లో ఉన్న బెస్ట్ కార్ కంపెనీలు ఇవే
2022 జూన్ నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలన్నీ కూడా తమ అమ్మకాల నివేదికలను అధికారికంగా విడుదల చేశాయి. ఇందులో 2022 జూన్ నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన కంపెనీ ఏది, మరియు అతి తక్కువ అమ్మకాలను పొందిన కంపెనీ ఏది అనే మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి టాప్ 10 కంపెనీల అమ్మకాలను తప్పకుండా తెలుసుకోవాలి.
కావున ఈ కథనంలో మనం అమ్మకాల్లో టాప్ 10 స్థానాల్లో నిలిచిన కంపెనీలు ఏవి? ఎన్ని యూనిట్ల వాహనాలను అమ్మగలిగాయి, అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. రండి.

విడుదలైన గణాంకాల ప్రకారం, భారతదేశంలో కార్ల అమ్మకాలు గత సంవత్సరం కంటే జూన్ 2022 లో 25.49 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే నెలవారీ అమ్మకాల పరంగా 2021 కంటే 2022 లో 9 శాతం అమ్మకాలు పెరిగాయి. కంపెనీ యొక్క అమ్మకాలు 2022 జూన్ నెలలో 3,20,846 యూనిట్లు కాగా.. 2021 జూన్ నెలలో అమ్మకాలు 2,55,673 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే 2021 కంటే 2022 యొక్క అమ్మకాలు 65,173 యూనిట్లు పెరిగాయి.

వెల్లడైన అమ్మకాల గణాంకాల ప్రకారం టాప్ 10 లో మొదటి మొదటి స్థానంలో ఉన్న కంపెనీ మారుతి సుజుకి, కాగా చివరి స్థానంలో ఉన్న బ్రాండ్ ఎంజి మోటార్ అని తెలుస్తోంది.
మారుతి సుజుకి (Maruti Suzuki):
భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ మారుతి సుజుకి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ యొక్క అమ్మకాలు 2022 జూన్ నెలలో 1,22,685 యూనిట్లు. ఇదే నెల గత ఏడాది కంపెనీ యొక్క అమ్మకాలు 1,24,280 యూనిట్లు. అంటే వార్షిక ఫలితాల ప్రకారం కంపెనీ -1.28 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

హ్యుందాయ్ ఇండియా (Hyundai):
అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ ఇండియా 2022 జూన్ నెలలో 49,001 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో చేరింది. అయితే 2021 జూన్ నెలలో కంపెనీ 40,496 యూనిట్లను విక్రయించగలిగింది. వార్షిక అమ్మకాలను పరిశీలిస్తే, కంపెనీ 2021 కంటే 2022 అనే నెలలో 21% పెరుగుదలను నమోదు చేసిందని స్పష్టంగా తెలుస్తోంది.

టాటా మోటార్స్ (Tata Motors):
దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) విక్రయాల పరంగా టాప్ 10 జాబితాలో 3 వ స్థానంలో నిలిచింది. అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ 2022 జూన్ లో 45,197 యూనిట్లను విక్రయించి, మునుపటి ఏడాదికంటే 87.46 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2021 జూన్ నెల అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 24,110 యూనిట్లు అని తెలుస్తోంది.

| Rank | Brand | Jun-22 | Jun-21 | Growth (%) |
| 1 | Maruti | 1,22,685 | 1,24,280 | -1.28 |
| 2 | Hyundai | 49,001 | 40,496 | 21.00 |
| 3 | Tata | 45,197 | 24,110 | 87.46 |
| 4 | Mahindra | 26,880 | 16,913 | 58.93 |
| 5 | Kia | 24,024 | 15,015 | 60.00 |
| 6 | Toyota | 16,512 | 8,798 | 87.68 |
| 7 | Renault | 9,317 | 6,100 | 52.74 |
| 8 | Honda | 7,834 | 4,767 | 64.34 |
| 9 | Skoda | 6,023 | 734 | 720.57 |
| 10 | MG (Retail) | 4,503 | 3,558 | 26.56 |

మహీంద్రా (Mahindra):
భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా యొక్క అమ్మకాలు 2021 జూన్ లో 16,193 యూనిట్లు. కాగా 2022 జూన్ నెలలో ఈ సంఖ్య ఏకంగా 26,880 కి చేరింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటి ఏడాదికంటే కూడా మంచి వృద్దని నమోదు చేయగలిగింది. కావున 2021 కంటే 2022 లో టాటా మోటార్స్ 58.93 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

కియా మోటార్స్ (Kia Motars):
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే మంచి ప్రజాదరణ పొందుతూ.. కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తూ శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ కంపెనీ అమ్మకాల పరంగా టాప్ 10 జాబితాలో 5 వ స్థానం పొందింది.
కియా మోటార్స్ 2021 జూన్ అమ్మకాలు 15,015 యూనిట్లు కాగా, 2022 జూన్ నెల అమ్మకాలు 24,024 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు మునుపటి ఏడాదికంటే కూడా 60 శాతం పెరుగుదలను పొందింది

టొయోట (Toyota):
టొయోట కంపెనీ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, 2022 జూన్ నెలలో 16,512 యూనిట్లను విక్రయించగా, 2021 జూన్ నెలలో కంపెనీ 8,798 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 87.69 శాతానికి చేరింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన విజయం అనే చెప్పాలి.

రెనాల్ట్ ఇండియా (Renault):
విడుదలై టాప్ 10 కంపెనీల కంపెనీల అమ్మకాల జాబితాలో రెనాల్ట్ స్థానం 7. రెనాల్ట్ కంపెనీ 2022 జూన్ నెలలో 9,317 యూనిట్లను వికృయించగా, 2021 జూన్ నెలలో 6,100 యూనిట్లకు విక్రయిచింది. దీని ప్రకారం కంపెనీ యొక్క వార్షిక పెరుగుదల 52.74 శాతానికి చేరింది.

హోండా (Honda):
హోండా కంపెనీ అమ్మకాల పరంగా కొంత ఆశాజనకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎదుకంటే కంపెనీ 2021 జూన్ నెలలో 4,767 యూనిట్ల వాహనాలను విక్రయించగా, 2022 జూన్ నెలలో 7,834 యూనిట్లను విక్రయించి, వార్షిక వృద్ధిలో కంపెనీ 64.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ కారణంగా కంపెనీ టాప్ 10 జాబితాలో 8 వ స్థానంలో నిలిచింది.

స్కోడా (Skoda):
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ 'స్కోడా' దేశీయ మార్కెట్లో స్లావియా మరియు కుషాక్ వంటి వాటిని విడుదల చేయడంతో భారతీయ విఫణిలో మంచి అమ్మకాలను పొందగలిగింది. ఈ కారణంగానే కంపెనీ యొక్క అమ్మకాలు 2021 జూన్ నెలలో 734 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే 2022 జూన్ నెలలో 6,023 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, వార్షిక వృద్ధిలో 720.57 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

ఎంజి మోటార్స్ (MG Motors):
ఎంజి మోటార్స్ కంపెనీ మన జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. కంపెనీ యొక్క అమ్మకాలు 2021 కంటే 2022 లో 26.56 శాతం వృద్దిని నమోదు చేసింది. అంటే కంపెనీ యొక్క 2021 జూన్ నెల అమ్మకాలు 3558 యూనిట్లు కాగా, 2022 జూన్ నెల అమ్మకాలు 4,503 యూనిట్లుగా ఉంది. మొత్తం మీద కంపెనీ వార్షిక అమ్మకాలలో కొంత వృద్ధిని నమోదు చేయగలిగింది.


Click it and Unblock the Notifications








