సేఫ్టీ అంటేనే గుర్తొచ్చే పాపులర్ కార్లు - వివరాలు
గ్లోబల్ ఎన్‌సిఎపి ప్రకారం భారతీయ మార్కెట్లో అధిక భద్రతా ఫీచర్స్ కలిగిన అత్యంత సురక్షితమైన కార్లు ఈ ఆధునిక కాలంలో చాలా ఉన్నాయి. అయితే ఇందులో మనం అత్యంత సురక్షితమైన 7 SUV లను గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం.. రండి.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్:
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ SUV ఒకటి. ఇది అడల్స్ సేఫ్టీ టెస్ట్‌లో 34 పాయింట్లకు గానూ 29.65 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 42 సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని అధిక సేఫ్టీ కలిగిన కారుగా నిర్దారించబడింది. ఇందులో వాహన వినియోగదారుల భద్రతకు అవసరమయ్యే అన్ని సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

స్కోడా కుషాక్:
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో స్కోడా కుషాక్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకుని సేఫ్టీలో తిరుగులేని SUV గా నిలిచింది. అడల్స్ సేఫ్టీ టెస్ట్‌లో 34 పాయింట్లకు గానూ 29.64 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 42 సాధించింది. ఈ SUV లో ఆరు ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో N:
మహీంద్రా కంపెనీ యొక్క స్కార్పియో N ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించి, భద్రత పరంగా ఉత్తమ SUV గా నిరూపించుకుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గాను 29.25 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 28.93 పాయింట్లు సాధించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ మొదలైనవి ఉన్నాయి.
మహీంద్రా XUV700:
మహీంద్రా యొక్క XUV700 కూడా సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుని అత్యంత సురక్షితమైన SUV గా నిలిచింది. అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు 16.03 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ మరియు చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 41.66 పాయింట్లు సాధించి-4 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
మహీంద్రా XUV 300:
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కూడా అత్యంత సురక్షితమైన కారు. ఇది అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 16.42 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 37.44 పాయింట్లు సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఆరు ఎయిర్ బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఏబీఎస్ విత్ ఈబిడి, ఐసోఫిక్స్ ఎంకరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
టాటా నెక్సాన్:
టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇది అడల్స్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 16.06 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 25 పాయింట్లు సాధించింది. మొత్తం సేఫ్టీలో ఇది 5 స్టార్ రేటింగ్ పొందింది. నెక్సాన్ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 7.70 లక్షల నుంచి రూ. 14.18 లక్షల మధ్య ఉన్నాయి (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
మహీంద్రా థార్:
దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ కూడా అత్యంత సురక్షితమైన కారు. ఇది అడల్స్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 12.52 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 41.11 పాయింట్లు సాధించింది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఓవర్ స్పీడ్ వార్నింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.


Click it and Unblock the Notifications








