భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

భారత కార్ మార్కెట్ ఎక్కువగా ఎస్‌యూవీ ఫ్యాన్ బేస్‌ని కలిగి ఉందని చెప్పవచ్చు. మన మార్కెట్లో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీలను ఆదరించే కస్టమర్లు ఎక్కువయ్యారు. దీంతో తయారీదారులు కూడా సరికొత్త ఎస్‌యూవీలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఎస్‌యూవీ టైప్ కార్లు చూడటానికి పెద్దగా ఉండటమే కాకుండా, కారు లోపల కూడా మంచి సౌకర్యాలను మరియు డ్రైవింగ్ కంఫర్ట్ ను అందిస్తాయి. అంతేకాదు, ఇవి రోడ్డుపై సురక్షితమైన వాహనాలుగా కూడా పరిగణించబడుతున్నాయి.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

ఇటీవలి కాలంలో, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఎస్‌యూవీలను అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో మరింత సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఒకప్పుడు ప్రీమియం లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన ADAS సేఫ్టీ ఫీచర్లు, ఇప్పుడు సాధారణ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొత్తగా విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలలో కూడా ఈ ఫీచర్లు లభిస్తున్నాయి.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా కార్ కంపెనీలు తమ వాహనాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నాయి. ఆయా విభాగాల్లో పెరిగిన పోటీని తట్టుకునేందుకు కంపెనీలు కూడా కొత్త ట్రెండ్ లను అలవాటు చేసుకుంటున్నాయి. మనదేశంలో ADAS సేఫ్టీ ఫీచర్ల ట్రెండ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇవి కార్లలో అత్యవసరమైన ఫీచర్లుగా పరిగణించబడుతున్నాయి. రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో కొన్ని కొత్త ఎస్‌యూవీలు విడుదల కాబోతున్నాయి. వీటిలో కొన్ని ADAS ఫీచర్లను కూడా కలిగి ఉండనున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

1. కొత్త ఎమ్‌జి హెక్టర్

బ్రిటీష్ కార్ బ్రాండ్ మోరిస్ గ్యారేజ్ (ఎమ్‌జి) మోటార్స్, తమ హెక్టర్ మోడల్ ద్వారా భారత మార్కెట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. హెక్టర్ ఎస్‌యూవీ ఈ బ్రాండ్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టడంలో ఎంతగానో సహకరించింది. ఎమ్‌జి హెక్టర్ లో కంపెనీ ఇప్పటి వరకూ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు ప్రవేశపెట్టింది. అయితే, ఈసారి కొత్తగా ప్రవేశపెట్టబోయే హెక్టర్ ఎస్‌యూవీలో అధునాతన ADAS ఫీచర్లను కూడా జోడించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి, భారతదేశానికి ADAS ఫీచర్లను పరిచయం చేసిన మొదటి కంపెనీ ఎమ్‌జి మోటార్స్.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

ఎమ్‌జి మోటార్స్ తొలుత విడుదల చేసిన గ్లోస్టర్ ఎస్‌యూవీలో లెవల్ 1 ADAS ఫీచర్లను అందించింది. ఆ తర్వాత ఇటీవల విడుదల చేసిన ఆస్టర్ ఎస్‌యూవీలో కూడా లెవల్ 2 ADAS ఫీచర్లను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే హెక్టర్ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ADAS ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ వెహికల్ కొలైజెన్ అలెర్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ మొదలైన ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

2. సరికొత్త హ్యుందాయ్ టూసాన్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టూసాన్ లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త తరం మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది. నాల్గవ తరానికి చెందిన ఈ కొత్త మోడల్ లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లను అందించనున్నారు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, డ్రైవర్ ట్రాకింగ్, వెనుక నుంచి వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరికలు వంటి అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

3. జీప్ మెరిడియన్

అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జీప్ బ్రాండ్ నుండి వస్తున్న లేటెస్ట్ ఎస్‌యూవీలలో జీప్ మెరిడియన్ కూడా ఒకటి. వాస్తవానికి, దీనిని పొడగించిన జీప్ కంపాస్ ఎస్‌యూవీగా చెప్పుకోవచ్చు. కంపెనీ ఎస్‌యూవీని మార్చి 29న విడుదల చేయనుంది. జీప్ మెరిడియన్‌లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు లేన్ కీప్ అసిస్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఎమ్‌జి గ్లోస్టర్ మరియు కొత్త స్కోడా ​​కొడియాక్ వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

4. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

కియా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో ఒకటైన సెల్టోస్ ఎస్‌యూవీలో కూడా కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సెల్టోస్‌ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో వెల్లడైన స్పై చిత్రాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కంపెనీ ఇప్పటికే దక్షిణ కొరియాలో పరీక్షిస్తోంది.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సెల్టోస్ స్పై చిత్రాలను గమనిస్తే, కంపెనీ దాని ముందు భాగంలో ADAS కోసం రాడార్ల వంటి టెక్నాలజీని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి, ఈ మోడల్ కూడా వెహికల్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. అయితే, కియా ఈ కొత్త సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ను కేవలం గ్లోబల్ మార్కెట్లకు మాత్రమే పరిమితం చేస్తుందా లేక భారత్ లో కూడా విడుదల చేస్తుందా అనేది చూడాలి.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

5. హ్యుందాయ్ క్రెటా / అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్

కియా సెల్టోస్ కి పోటీగా హ్యుందాయ్ విక్రయిస్తున్న క్రెటా ఎస్‌యూవీలో కూడా కంపెనీ కొత్త అప్‌డేటెడ్ మోడల్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి కంపెనీ కొత్త క్రెటాను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, క్రెటా ఆధారంగా హ్యుందాయ్ తయారు చేసిన 7-సీటర్ ఎస్‌యూవీ అల్కజార్ లో కూడా కంపెనీ లెవెల్-2 ఆటోమేటిక్ డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో విక్రయించబడుతోంది.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

6. టాటా సఫారి / హారియర్

టాటా మోటార్స్ గత కొన్ని నెలలుగా సఫారీ మరియు హారియర్ లలో కొత్త మోడళ్లను పరీక్షిస్తోంది. అప్‌డేట్ చేయబడిన ఈ రెండు మోడళ్లు కూడా చిన్నపాటి డిజైన్ మార్పులతో, కొత్త ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, సఫారీ మరియు హారియర్ కొత్త మోడళ్లలో పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా అందించే అవకాశం ఉంది. దీనితో పాటు, రెండు మోడళ్లలో ADAS ఫీచర్ కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.

భారతదేశంలో విడుదల కానున్న టాప్ 7 ఎస్‌యూవీలు ఏవో తెలుసా..?

7. సుజుకి-టొయోటా ఎస్‌యూవీ

మారుతి సుజుకి మరియు టొయోటా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, మారుతి కార్లను టొయోటా రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కూడా పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఓ ఎస్‌యూవీని తయారు చేయనున్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుందని సమాచారం. అయితే, ఇందులో ADAS ఫీచర్లు ఉంటాయో లేదో అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 22, 2022, 15:08 [IST]
English summary
Top seven upcoming suvs in india that might have adas features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+