గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

భారతదేశంలో కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మే 2022లో కార్ల విక్రయాలు భారీగా 185.71 శాతం వృద్ధిని సాధించాయి. అయితే, ఏప్రిల్ 2022 నెలతో పోల్చితే నెలవారీ అమ్మకాలు కేవలం 0.31 శాతం మాత్రమే పెరిగాయి. గత నెలలో కార్ల తయారీదారులు భారతదేశంలో మొత్తం 2,94,342 కార్లను విక్రయించారు. మరి మే 2022లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ బ్రాండ్‌లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

వార్షిక అమ్మకాల పరంగా, కార్ల తయారీదారులు మే 2021 నెలలో 1,91,320 యూనిట్ల వాహనాలను మాత్రమే విక్రయించారు. అయితే, గత నెలలో కార్ కంపెనీలు అత్యధికంగా 2,94,342 కార్లను విక్రయించి 185.71 శాతం వృద్ధిని సాధించడంతో భారతీయ కార్ మార్కెట్ వేగం పుంజుకుంది. మే 2021లో కార్ల తయారీదారులకు కోవిడ్ మహమ్మారి మరియు చిప్ కొరత వంటి పరిస్థితులు అమ్మకాలను ప్రభావితం చేశాయి. గత నెలలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ మినహా ప్రతి కార్ల తయారీ సంస్థ అమ్మకాల్లో పెరుగుదలను కనబరిచింది.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

1) మారుతి సుజుకి - 1,24,474 యూనిట్లు

మారుతి సుజుకి మే 2021 లో కేవలం 32,903 యూనిట్లను మాత్రమే విక్రయిస్తే, గడచిన నెలలో ఏకంగా 1,24,474 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 278.31 శాతం (91,571 యూనిట్లు ఎక్కువ) వృద్ది చెందాయి. ఆశ్చర్యకరంగా పెరిగిన అమ్మకాలు మారుతికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ కంపెనీ నెలవారీ అమ్మకాలు కూడా పెరిగాయి. ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ విక్రయించిన 1,21,995 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 2.03 శాతం (2,479 యూనిట్లు) పెరిగాయి.

Rank Brand May-22 May-21 Growth (%)
1 Maruti Suzuki 1,24,474 32,903 278.31
2 Tata 43,341 15,181 185.50
3 Hyundai 42,293 25,001 69.17
4 Mahindra 26,904 8,004 236.13
5 Kia 18,718 11,050 69.39
6 Toyota 10,216 707 1344.98
7 Honda 8,188 2,032 302.95
8 Renault 5,010 2,620 91.22
9 Skoda 4,604 716 543.02
10 MG Motor 4,008 1,016 294.49
11 Volkswagen 3,503 1,276 174.53
12 Nissan 2,131 1,235 72.55
13 Jeep 928 475 95.37
14 Citroen 24 40 -40.00
15 Ford 0 0 -100.00
గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

2) టాటా మోటార్స్ - 43,341 యూనిట్లు

టాటా మోటార్స్ మే 2022లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఈ జాబితాలో ఇప్పటి వరకూ ఉన్న హ్యుందాయ్ ను టాటా మోటార్స్ వెనక్కు నెట్టి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. మే 2021 టాటా మోటార్స్ కేవలం 15,181 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కాగా, మే 2022లో మొత్తం 43,341 వాహనాలను విక్రయించి, 185.50 శాతం (28,160 యూనిట్లు ఎక్కువ) వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ నెలవారీ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్ 2022 లో కంపెనీ విక్రియంచిన 41,587 యూనిట్లతో గత నెల అమ్మకాలు 4.22 శాతం (1,754 యూనిట్లు) పెరిగాయి.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

3) హ్యుందాయ్ - 42,293 యూనిట్లు

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ 2021 మే నెలతో పోలిస్తే 69.17 శాతం (17,292 యూనిట్లు) ఎక్కువ వృద్ధిని నమోదు చేసినప్పటికీ, మే 2022 నెలలో అమ్మకాల పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా తన స్థానాన్ని కోల్పోయింది. భారతదేశంలో హ్యుందాయ్ యొక్క నెలవారీ అమ్మకాలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ విక్రయించిన మొత్తం 44,001 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 3.88 శాతం (1,708 యూనిట్లు) తగ్గాయి.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

4) మహీంద్రా - 26,904 యూనిట్లు

ముంబైకి చెందిన కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా మే 2022 మంచి అమ్మకాల పనితీరును కనబరించింది. గత నెలలో మహీంద్రా వార్షిక విక్రయాల మే 2021తో పోలిస్తే 236.13 శాతం (18,900 యూనిట్లు) పెరిగాయి. ఆ సమయంలో ఇది కేవలం 8,004 కార్లు మరియు ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించింది. ఈ బ్రాండ్ నెలవారీ అమ్మకాలు కూడా పెరిగాయి. మహీంద్రా ఏప్రిల్ 2022 నెలలో విక్రయించిన 22,526 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 19.44 శాతం (4,378 యూనిట్లు) పెరిగాయి.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

5) కియా ఇండియా - 18,718 యూనిట్లు

దక్షిణ కొరియాకి చెందిన కార్ల తయారీ సంస్థ కియా కూడా వృద్ధి బాటలోనే ఉంది. ఈ కంపెనీ గడచిన నెలలో 18,718 యూనిట్లను విక్రయించింది. కాగా, మే 2021 నెలలో ఇవి కేవలం 11,051 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 69.39 శాతం (7,668 యూనిట్లు) పెరిగాయి. అయితే, ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ విక్రయించిన 19,019 యూనిట్లతో పోలిస్తే, నెలవారీ అమ్మకాలు మాత్రం స్వల్పంగా 1.58 శాతం (301 యూనిట్లు) తగ్గాయి.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

ఇక ఈ జాబితాలోని ఇతర ఐదు కంపెనీలలో జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా గత నెలలో 10,216 యూనిట్లను విక్రయించింది. ఈ బ్రాండ్ మే 2021 నెలలో కేవలం 707 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీంతో ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 1,344.98 శాతం (9,509 యూనిట్లు) వృద్ధి చెందాయి. అయితే, నెలవారీ అమ్మకాలు 32.28 శాతం (4,869 యూనిట్లు) తగ్గాయి.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

ఈ జాబితాలో హోండా ఏడవ స్థానంలో ఉంది. మే 2022 నెలలో హోండా 8,188 యూనిట్లను విక్రయించి 302.95 శాతం (6,156 యూనిట్లు) వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కాగా, ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో మే 2022 నెలలో మొత్తం 5,010 యూనిట్లను విక్రయించి మే 2021తో పోలిస్తే 91.22 శాతం (2,390 యూనిట్లు) వార్షిక వృద్ధిని నమోదు చేసింది. చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా గత నెలలో 4,604 యూనిట్లను విక్రయించి 543.02 శాతం (3,888 యూనిట్లు) వార్షిక వృద్ధితో ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.

గత నెలలో టాప్ 10 బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే.. హ్యుందాయ్‌ని వెనక్కు నెట్టేసిన టాటా మోటార్స్!

ఇక టాప్ 10 జాబితాలో చివరిగా చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ కార్ల బ్రాండ్ ఎమ్‌జి మోటార్ నిలిచింది. గత నెలలో కంపెనీ మొత్తం 4,008 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన 1,016 యూనిట్లతో పోలిస్తే 294.49 శాతం (2,992 యూనిట్లు) వృద్ధి సాధించింది. ఎమ్‌జి మోటార్ నెలవారీ విక్రయాలు కూడా పెరిగాయి. గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ విక్రయించిన 2,008 యూనిట్లతో పోలిస్తే మే 2022 నెల విక్రయాలు 99.60 శాతం పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Saturday, June 4, 2022, 17:53 [IST]
English summary
Top ten best selling car brands in india in may 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+