మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలు అతికొద్ది కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా మారాయి. ఒకప్పుడు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కొన్ని పరిమితమైన మోడళ్లు మాత్రమే ఉండే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం అనేక కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి, ఇంకా కొన్ని కార్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ విభాగంలో వివిధ కార్ కంపెనీల నుండి అందుబాటులో ఉండే మోడళ్లు ప్రత్యేకమైన ఫీచర్లను మరియు డిజైన్ ను కలిగి ఉన్నాయి. గత నెలలో అత్యధిక డిమాండ్ కలిగిన టాప్ 3 కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

1. టాటా నెక్సాన్ (Tata Nexon)

ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ కార్లలో టాటా నెక్సాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. టాటా నెక్సాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ రూపంలో కూడా లభిస్తోంది. కాబట్టి, ఇందులో కస్టమర్లకు పలు రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ టాటా నెక్సాన్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

గత నెలలో టాటా నెక్సాన్ అమ్మకాలను గమనిస్తే, టాటా మోటార్స్ జనవరి 2022లో మొత్తం 13,816 యూనిట్ల టాటా నెక్సాన్ కార్లను విక్రయించింది. ఈ విక్రయాల సంఖ్య జనవరి 2021 కంటే చాలా ఎక్కువ. గతేడాది ఇదే సమయంలో టాటా మోటార్స్ కేవలం 8,225 నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో నెక్సాన్ అమ్మకాలు ఏకంగా 68 శాతం వృద్ధిని సాధించాయి. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ తన నెక్సాన్ ఎస్‌యూవీలో ఓ CNG మోడల్ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

టాటా నెక్సాన్ సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే, ఈ చిన్న కారు అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు గాను 16.06 పాయింట్లను స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 25 పాయింట్లను స్కోర్ చేసింది. కంపెనీ ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్ మరియు ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ బ్రాండ్ గా అవతరించింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి టక్సన్, క్రెటా మరియు వెన్యూ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన వెన్యూ, కంపెనీకి అమ్మకాల పరంగా అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా వెన్యూ ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉంది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

జనవరి 2022లో హ్యుందాయ్ మొత్తం 11,377 యూనిట్ల వెన్యూ కార్లను విక్రయించింది. కాగా, జనవరి 2021లో కూడా కంపెనీ గరిష్టంగా 11,779 యూనిట్ల వెన్యూ కార్లను విక్రయించింది. ఈ సమయంలో వెన్యూ అమ్మకాలు స్వల్పంగా 3 శాతం తగ్గాయి. అయినప్పటికీ, వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల విభాగంలో అమ్మకాల పరంగా రెండవ స్థానంలో ఉంది. మొత్తంగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాను గమనిస్తే, ఈ మోడల్ 8వ స్థానంలో నిలిచింది. సమాచారం ప్రకారం, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మరియు టాటా పంచ్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. మార్కెట్లో వెన్యూ ధరలు రూ. 6.50 లక్షల నుండి రూ. 11.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కంపెనీ ఈ చిన్న కారును భారత మార్కెట్లో విడుదల చేసిన కేవలం 31 నెలల్లోనే 2.50 లక్షల యూనిట్లకు పైగా విక్రయించినట్లు వెల్లడించింది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

టాటా పంచ్ (Tata Punch)

భారతదేశంలో టాటా మోటార్స్ అందించే సురక్షితమైన కార్ మోడల్‌లలో టాటా పంచ్ కూడా ఒకటి. మైక్రో ఎస్‌యూవీగా, సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చిన ఈ చిన్న ఎస్‌యూవీ మార్కెట్లో ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ చిన్న కారుకి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ క్రాష్ టెస్టులో ఇది పెద్దల సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.45 పాయింట్లు మరియు పిల్లల రక్షణలో 49 పాయింట్లకు గానూ 40.89 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

కంపెనీ ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు స్టాండర్డ్‌గా అందిస్తోంది. గత జనవరి 2022 లో టాటా మోటార్స్ మొత్తం 10,027 పంచ్ మైక్రో ఎస్‌యూవీలను విక్రయించింది. టాటా మోటార్స్ గడచిన అక్టోబర్‌ 2021 నెలలో ఈ కారును మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఇటీవలే ఈ కారు ధరలను కూడా పెంచింది. ధరల పెంపు అనంతరం టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.64 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)కు చేరుకుంది. ఇందులో ఏఎమ్‌టి వేరియంట్ ధర రూ. 8.98 లక్షలుగా ఉంది.

మార్కెట్లో ఈ మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భలే గిరాకీ.. అవేంటో తెలుసా..?

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ మరియు క్రియేటివ్‌. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, టాటా పంచ్ ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.2 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 7, 2022, 18:13 [IST]
English summary
Top three best selling compact suv s in india in january 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+