ఎట్టకేలకు 'ఇన్నోవా హైక్రాస్' ధరలు వెల్లడించిన టయోటా - పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో 'టయోటా' (Toyota) కంపెనీ ఇప్పటికే తన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ రోజు ఈ ఎంపివి ధరలను అధికారికంగా వెల్లడించింది. హైక్రాస్ ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టయోటా హైక్రాస్‌ మొత్తం ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి G, GX, VX, ZX మరియు ZX(O) వేరియంట్స్. ఈ MPV ప్రారంభ ధరలు రూ. 18.30 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ. 28.97 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరలు

టయోటా కంపెనీ ఇన్నోవా క్రిష్టాతో పాటు హైక్రాస్ ని కూడా విక్రయిస్తుంది. నిజానికి హైక్రాస్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టా డీజిల్ వేరియంట్ ధర కంటే దాదాపు రూ. 2 లక్షలు ఎక్కువ. అయితే ఈ కొత్త హైక్రాస్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున చూడటానికి ఈ ఇన్నోవా హైక్రాస్ చాలా కొత్తగా మరియు చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ కలిగి దాని మధ్యలో బ్రాండ్ లోగో పొందుతుంది. ఇది క్రోమ్ తో ఫినిష్ అయి ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్‌ మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కూడా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరలు

ఇంటీరిర్ డ్యూయెల్ టోన్ థీమ్ పొందుతుంది. కావున ఇది ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో ఇందులో ఉన్న సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది.

కొత్త ఇన్నోవా హైక్రాస్ మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ MPV ఎత్తు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ క్రిస్టా మాదిరిగానే ఉంటాయి కానీ వీల్‌బేస్ క్రిస్టా కంటే 100 మిమీ ఎక్కువ.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరలు

సీటింగ్ కాన్ఫిగరేషన్స్ విషయానికి వస్తే, ఇన్నోవా హైక్రాస్ 7 సీట్ మరియు 8 సీట్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీట్స్ వేరియంట్ మధ్య వరుస కోసం సెగ్మెంట్ ఫస్ట్ ఒట్టోమన్ ఫంక్షన్‌తో రెండు కెప్టెన్ సీట్స్ పొందుతుంది. అయితే 8 సీట్ వేరియంట్ రెండవ మరియు మూడవ వరుసలకు బెంచ్ సీట్లు పొందుతుంది. ఇందులో ప్రయాణికులందరికీ త్రి పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉంటాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో పెట్రోల్ లేదా పెట్రోల్ హైబ్రిడ్ ఆప్సన్స్ ఉంటాయి. కానీ ఇది డీజిల్ ఇంజిన్ పొందే అవకాశం లేదు. కావున ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 172 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున తప్పకుండా ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇందులోని 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్‌ 150 బిహెచ్‌పి మరియు 187 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 111 బిహెచ్‌పి మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే పవర్ అవుట్‌పుట్ 184 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది.ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంది. కావున డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 మరియు టాటా సఫారి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల మేము ఇన్నోవా హైక్రాస్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2022, 16:21 [IST]
English summary
Toyota announced all new innova hycross price details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+