ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

విజయ దశమి మరియు దీపావళి పండుగ సీజన్లలో వాహన తయారీ సంస్థలు చాలా వరకు తమ వాహనాల యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి ఆకర్షణీయమైన ఆఫర్స్ మరియు అద్భుతమైన డిస్కౌంట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే 'టొయోట' (Toyota) కంపెనీ మాత్రం ఈ సమయంలో తన వాహనాల ధరలను అమాంతం పెంచింది. ఇంతకీ కంపెనీ ఏ మోడల్ ధరలను పెంచింది, ఎంత వరకు పెంచింది అనే సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ తాజాగా అందించిన సమాచారం ప్రకారం, తన ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్యామ్రీ మరియు వెల్ఫైర్ వంటి వాటి ధరలను పెంచింది. కంపెనీ ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరలు పెరుగుదల చేయవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది.

ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

టొయోట ఇన్నోవా (Toyota Innova):

మార్కెట్లో టొయోట కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణపొందిన మోడల్ అయిన ఇన్నోవా ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 23,000 వరకు పెరిగాయి. ఇందులో కూడా అన్ని వేరియంట్ల ధరలు పెరగలేదు. ఇందులో కేవలం ఎంట్రీ లెవల్ GX MT 7 సీటర్ ఇన్నోవా పెట్రోల్ మోడల్ మరియు GX MT 8 సీటర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత వీటి ప్రస్తుత ధరలు రూ. 18.09 లక్షలు మరియు రూ. 18.14 లక్షల వరకు ఉన్నాయి.

ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

ఇక డీజిల్ వేయియంట్ ధరల విషయానికి వస్తే, ఇందులో బేస్ మోడల్ అయిన G MT 7 సీటర్ నుంచి టాప్ ఎండ్ మోడల్ అయిన ZX AT 7 సీటర్ ధరలు అన్నీ కూడా రూ. 23,000 పెరిగాయి. కావున పెరిగిన కొత్త ధరలు కింద పట్టికలో చూడవచ్చు.

Innova Petrol New Price Old Price Difference
GX(-) MT 7 SEATER ₹17,45,000 ₹17,45,000 0
GX(-) MT 8 SEATER ₹17,50,000 ₹17,50,000 0
GX MT 7 SEATER ₹18,09,000 ₹17,86,000 ₹23,000
GX MT 8 SEATER ₹18,14,000 ₹17,91,000 ₹23,000
GX AT 7 SEATER ₹19,02,000 ₹19,02,000 0
GX AT 8 SEATER ₹19,07,000 ₹19,07,000 0
VX MT 7 SEATER ₹20,95,000 ₹20,59,000 0
ZX AT 7 SEATER ₹23,83,000 ₹23,83,000 0
Innova Diesel New Price Old Price Difference
G MT 7 SEATER ₹19,13,000 ₹18,90,000 ₹23,000
G MT 8 SEATER ₹19,18,000 ₹18,95,000 ₹23,000
G PLUS MT 7 SEATER ₹20,05,000 ₹19,82,000 ₹23,000
G PLUS MT 8 SEATER ₹20,10,000 ₹19,87,000 ₹23,000
GX MT 7 SEATER ₹20,17,000 ₹19,94,000 ₹23,000
GX MT 8 SEATER ₹20,22,000 ₹19,99,000 ₹23,000
GX AT 7 SEATER ₹21,87,000 ₹21,64,000 ₹23,000
GX AT 8 SEATER ₹21,92,000 ₹21,69,000 ₹23,000
VX MT 7 SEATER ₹23,34,000 ₹23,11,000 ₹23,000
VX MT 8 SEATER ₹23,39,000 ₹23,16,000 ₹23,000
ZX MT 7 SEATER ₹24,98,000 ₹24,75,000 ₹23,000
ZX AT 7 SEATER ₹26,77,000 ₹26,54,000 ₹23,000
ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner):

ఇప్పుడు టయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే, ఇందులో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఎంట్రీ లెవల్ 4X2 పెట్రోల్ MT మరియు 4X2 పెట్రోల్ AT ధరలు రూ. 19,000 పెరుగుదలను పొందాయి. కావున వీటి ధరలు ఇప్పుడు రూ. 32.59 లక్షలు మరియు రూ. 34.18 లక్షలు.

ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

ఇక 2.8 లీటర్ డీజిలు ఇంజిన్ కలిగిన 4X2 డీజిల్ MT మరియు AT ధరలు రూ. 19,000 పెరిగాయి. అదే సమయంలో 2.8 లీ డీజిల్ ఇంజిన్ కలిగిన 4X4 MT మరియు AT ధరలు రూ. 39,000 పెరుగుదలను పొందాయి. అంతే కాకుండా 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ లెజెండర్ 4X2 AT, లెజెండర్ 4X4 AT మరియు జిఆర్ స్పోర్ట్స్ 4X4 AT ధరలు రూ. 77,000 పెరిగాయి. పెరిగిన కొత్త ధరల జాబితా కింది పట్టికలో గమనించవచ్చు.

Fortuner Petrol New Price Old Price Difference
4X2 MT ₹32,59,000 ₹32,40,000 ₹19,000
4X2 AT ₹34,18,000 ₹33,99,000 ₹19,000
Fortuner Diesel New Price Old Price Difference
4X2 MT ₹35,09,000 ₹34,90,000 ₹19,000
4X2 AT ₹37,37,000 ₹37,18,000 ₹19,000
4X4 MT ₹38,93,000 ₹38,54,000 ₹39,000
4X4 AT ₹41,22,000 ₹40,83,000 ₹39,000
Legender 4X2 AT ₹42,82,000 ₹42,05,000 ₹77,000
Legender 4X4 AT ₹46,54,000 ₹45,77,000 ₹77,000
GR Sport ₹50,34,000 ₹49,57,000 ₹77,000
ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

టొయోట క్యామ్రీ (Toyota Camry):

టొయోట కంపెనీ యొక్క క్యామ్రీ ధరలు కూడా ఈ పండుగల సమయంలో పెరిగాయి. ఇప్పుడు ఈ క్యామ్రీ హైబ్రిడ్ రూ. 90,000 వరకు పెరుగుదలను పొందింది. కావున ఇప్పుడు టొయోట క్యామ్రీ హైబ్రిడ్ ధరలు రూ. 45.25 లక్షలు. ఇది కొనుగులుదారులమీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

టొయోట వెల్ఫైర్ (Toyota Vellfire):

ఇక చివరగా మన జాబితాలో ఎక్కువ ధరలు పెరుగుదలను పొందిన మోడల్ 'టొయోట వెల్ఫైర్'. దీని ధర రూ. 92.60 లక్షలు. అయితే ఇప్పుడు దీని ధర ఇప్పుడు రూ. 1.85 లక్షలు పెరిగింది, కావున టొయోట వెల్ఫైర్ ధర ఇప్పుడు రూ. 94.45 లక్షలు. అంటే సుమారు ఒక కోటి రూపాయలన్నమాట.

ముందుంది ముసళ్ళ 'పండుగ'.. భారీగా పెరిగిన టొయోట ధరలు, ఇక కస్టమర్ల కర్తవ్యం ఏమిటో?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మనం మొదట్లో చెప్పినట్లుగా ప్రస్తుతం చాలా కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తోంది. అయితే టొయోట కంపెనీ అందుకు విరుద్ధంగా ధరలను పెంచింది. ధరల పెరుగుదల అనేది పండుగ సీజన్లో అమ్మకాలపైనే ఏమైనా ప్రభావం చూపుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 3, 2022, 14:25 [IST]
English summary
Toyota cars price hike up to 1 85 lakh full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+