మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న బాలెనో (Baleno) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ని టొయోటా (Toyota) రీబ్యాడ్జ్ చేసి గ్లాంజా (Glanza) పేరుతో విభిన్నమైన ఎక్స్టీరియర్‌తో విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. మారుతి ఇటీవలే తమ కొత్త 2022 బాలెనో కారును మార్కెట్లో విడుదల చేసింది మరియు ఇప్పుడు ఇందులో కొత్త సిఎన్‌జి వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా, టొయోటా కూడా మారుతి బాటలోనే ఇటీవలే తమ కొత్త 2022 గ్లాంజా ను విడుదల చేసింది.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

తాజా సమాచారం ప్రకారం, టొయోటా కూడా మారుతి సుజుకి మాదిరిగానే తమ గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో ఓ సిఎన్‌జి (CNG) వెర్షన్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, గ్లాంజా సిఎన్‌జి కన్నా ముందుగా బాలెనో సిఎన్‌జి విడుదలయ్యే అవకాశం ఉంది. మారుతి సుజుకి తమ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కార్లను ఎస్-సిఎన్‌జి (s-CNG) టెక్నాలజీతో విక్రయిస్తుండగా, టొయోటా తమ సిఎన్‌జి కార్లను ఇ-సిఎన్‌జి (e-CNG) పేరుతో విక్రయించనుంది.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

టొయోటా ఇప్పటికే తమ 2022 గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 6.39 లక్షల నుండి రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ల మధ్యలో ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త 2022 గ్లాంజా రూ.11,000 ల బుకింగ్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇది ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

పెట్రోల్ వెర్షన్ గ్లాంజాలో 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్, డ్యూయల్‌జెట్, మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడినన ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, సిఎన్‌జి వెర్షన్ లోని ఇదే ఇంజన్ దాదాపు 76 బిహెచ్‌పిల శక్తిని మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని ఆశించవచ్చు. కాకపోతే, ఈ సిఎన్‌జి వెర్షన్ గ్లాంజా కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లో మాత్రమే లభ్యం కానుంది.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

పెట్రోల్ వెర్షన్ గ్లాంజా లీటరుకు 22 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ సర్టిఫై చేయగా, కొత్తగా రాబోయే సిఎన్‌జి మోడల్ కేజీకు సుమారు 30 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుందని అంచనా. డిజైన్ పరంగా చూస్తే, కొత్త టొయోటా గ్లాంజా సిఎన్‌జి (Toyota Glanza CNG) మోడల్ బూట్‌లిడ్ మరియు ఫ్రంట్ ఫెండర్‌పై 'e-CNG' బ్యాడ్జ్‌లు మినహా, ఇటీవలే విడుదలైన కొత్త 2022 గ్లాంజా డిజైన్‌తో సమానంగా ఉంటుంది. కొత్త 2022 గ్లాంజా, మారుతి సుజుకి ఇటీవలే అప్‌డేట్ చేయబడిన 2022 బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ అని మనందరికీ తెలిసినదే.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

ఈ రెండు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల ఉత్పత్తి గుజరాత్‌లోని మారుతి సుజుకి తయారీ కేంద్రంలోనే జరుగుతుంది. కొత్తగా అప్‌డేట్ చేయబడిన 2022 మారుతి సుజుకి బాలెనో మాదిరిగానే అప్‌డేటెడ్ 2022 టొయోటా గ్లాంజా కూడా 4 ట్రిమ్ లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో E, S, G, V అనే నాలుగు ట్రిమ్‌లు ఉన్నాయి. ఈ నాలుగు ట్రిమ్‌లు కూడా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తాయి. అయితే, ఇందులో E ట్రిమ్ మినహా మిగిలిన S, G, V ట్రిమ్‌లు మూడు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

బాలెనో మరియు గ్లాంజా కార్లను రెండింటినీ పక్కపక్కనే ఉంచి చూస్తే, వాటి ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కానీ, వాటి ఇంటీరియర్లు మాత్రం ఇంచు మించు ఒకే స్టైల్ లో ఉంటాయి. కొత్త 2022 టొయోటా గ్లాంజా లోపలి వైపు, 2022 మారుతి సుజుకి బాలెనోకు సమానమైన సరికొత్త డ్యాష్‌బోర్డ్‌ లేఅవుట్ ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన సరికొత్త 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభిస్తుంది.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

ఇంకా ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, లెథర్ వ్రాప్డ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెంట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 45 కనెక్టెడ్ ఫీచర్లను కూడా లభిస్తాయి. కంపెనీ ఇందులో కొత్తగా "హే టొయోటా" (Hey Toyota) అనే వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది.

మారుతి బాటలోనే టొయోటా.. బాలెనో సిఎన్‌జి తర్వాత గ్లాంజా సిఎన్‌జి లాంచ్!

ఈ కారులో అందించే కనెక్టెడ్ ఫీచర్ల సాయంతో కారు లొకేషన్‌ను ట్రాక్ చేయడం, కారును రిమోట్‌గా లాక్ అన్‌లాక్ చేయడం, రిమోట్‌గా హాజర్డ్ లైట్లను ఆన్ చేయడం వంటి వాటితో పాటుగా వాహనానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా పొందవచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్‌పి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైనవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 19, 2022, 13:14 [IST]
English summary
Toyota glanza e cng launch expected soon engine mileage and features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+