Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన వాహన తయారీ సంస్థ అయిన టయోటా (Toyota) యొక్క కొత్త 'హైలక్స్ పికప్ ట్రక్కు' యొక్క బుకింగ్స్ 2022 జనవరి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కంపెనీ ఈ కొత్త మోడల్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే దీని గురించి మరింత సమాచారం అందించడమే కాకుండా యాక్ససరీలను కూడా వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త టయోటా హైలెక్స్ కేవలం ఒక ఇంజన్ ఎంపికతో మాత్రమే అందుబాటులోకి రానుంది. అయితే కంపెనీ ఈ మోడల్ యొక్క డెలివరీలను 2022 మార్చి నెలలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. కావున ఫిబ్రవరి సమయంలో ఈ ట్రక్కును కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

ఈ కొత్త టయోటా హైలెక్స్ లైఫ్ స్టైల్ ట్రక్కును కొనుగోలు చేయాలనుకునేవారు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్‌లు జనవరిలోనే ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. కొత్త టయోటా హైలక్స్ 5-సీటర్ వెహికల్ గా దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. కావున ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

టయోటా కంపెనీ ఈ కొత్త ట్రక్కుని కేవలం డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

కంపెనీ ఈ కొత్త మోడల్ కొనుగోలుపైన అద్భుతమైన వారంటీ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ ఇస్తుంది. అయితే ఈ వారంటీని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించే అవకాశం కూడా అందుబటులో ఉంటుంది. ఈ కొత్త ట్రక్కుకి సర్వీస్ చేసుకోవడం కూడా చాలా సులభం. ఎందుకంటే కంపెనీ దేశవ్యాప్తంగా మొత్తం 342 సర్వీస్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

త్వరలో విడుదల కానున్న ఈ ట్రక్కు పూర్తిగా కొత్త సెగ్మెంట్ అని, ఇది 4x4 అడ్వెంచర్‌ను ఆస్వాదించాలనుకునే కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ దీనిని భారతదేశంలోని తన సొంత ప్లాంట్‌లో తయారు చేయబోతోంది, ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి కానుంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

కొత్త టయోటా హైలక్స్ IMV పై నిర్మించబడింది. ఇప్పటికే కంపెనీ టయోటా ఇన్నోవా మరియు టయోటా ఫార్చ్యూనర్‌ వంటి వాటిని నిర్మించింది. ఇది మొదట 1968 లో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు దాని 8 తరాలు తీసుకురాబడ్డాయి మరియు గత 50 సంవత్సరాలలో ఇది చాలా రెట్లు మెరుగుపరచబడింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని 180 దేశాలలో విక్రయించబడుతోంది మరియు ఇప్పటివరకు 20 మిలియన్ యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

టయోటా హైలక్స్ మోడల్ టయోటా ఫార్చ్యూనర్‌లో ఉపయోగిస్తున్న అదే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ ఇప్పటికే ఫార్చ్యూనర్ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

టయోటా హైలక్స్‌ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. అంతే కాకుండా దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇది చూడటానికి చాలా దూకుడుగా కనిపిస్తుంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

ఈ కొత్త పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్‌ పొందుతుంది. కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవాలు ఏ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయో అదే ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హైలెక్స్ ట్రక్కు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

Toyota Hilux బుకింగ్స్ జనవరి 20 నుంచి: మరి డెలివరీలు ఎప్పుడంటే?

ఇటీవల కాలంలోనే ఈ కొత్త ట్రక్కు గుర్గావ్‌లో జరిగిన ఒక యాడ్ షూట్‌లో కనిపించింది. టయోటా కంపెనీ యొక్క కొత్త హైలక్స్ ద్వారా కంపెనీ ఇప్పుడు కొత్త విభాగంలోకి ప్రవేశించబోతోంది. అంతే కాకుండా ఇప్పటికే కొన్ని టయోటా డీలర్‌షిప్‌లు ఈ పికప్ ట్రక్కు కోసం అనధికారిక బుకింగ్‌లను కూడా తీసుకుంటున్నాయి. మొత్తానికి ఈ కొత్త దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Tuesday, January 11, 2022, 16:35 [IST]
English summary
Toyota hilux booking amount delivery date details revealed
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+