ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

ఎట్టకేలకు కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్ ఏసియా మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఇదే సమయంలో కంపెనీ ఈ లైఫ్ స్టైల్ వెహికల్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ కొత్త లైఫ్ స్టైల్ వెహికల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త వెహికల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

టయోటా హైలక్స్ ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజన్ మరియు ఆధునిక ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ దీనిని భారతదేశంలో మాత్రమే తయారు చేయనుంది. ఇది గత 5 దశాబ్దాల నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించబడుతోంది, అయితే ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టింది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

టయోటా హైలక్స్ ని కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఈ కొత్త వెహికల్ 5-సీటర్ వెహికల్ గా ఉండబోతోంది. ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. డీజిల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఈ వెహికల్ ధర మరియు డెలివరీ వంటి వాటికీ సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబటులో లేదు. కానీ కంపెనీ త్వరలో వీటికి సంబంధించిన సమాచారం వెల్లడిస్తుంది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

కంపెనీ ఇప్పుడు ఈ వెహికల్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది కావున బుక్ చేసుకోవాలనుకునే వారు ఈ లైఫ్ స్టైల్ ట్రక్కును రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే జరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

కొత్త టయోటా హైలక్స్ మొత్తం 5 కలర్ ఆప్సన్ లో తీసుకురానుంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

టయోటా హైలక్స్ పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు రెండు వైపులా LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది, దీని కారణంగా ఇది రహదారిపై బలంగా కనిపిస్తుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను పొందుతుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైల్‌ని పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది మొత్తమ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, JBL సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో AC మరియు లెదర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతుంది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అడిషినల్ ఎయిర్‌బ్యాగ్‌లు, LSD మరియు పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును కూడా పొందుతుంది. ఇది A-TRAC (యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్) ఫీచర్లతో వస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా 500 ఎన్ఎమ్ టార్క్‌ అందించే టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి వేరియబుల్ ఫ్లో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌తో పాటు 700 మి.మీ వాటర్ వేడింగ్ కెపాసిటీతో వస్తుంది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

ఈ ట్రక్ ఇటీవల NCAP టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. కావున ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ వాహనదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ ఇవ్వబడుతుంది, దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించవచ్చు.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

వినియోగదారులు దీని సర్వీస్ కోసం, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీకి చెందిన 342 సర్వీస్ అవుట్‌లెట్‌లను ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా కొత్త సెగ్మెంట్ అని, ఇది 4x4 అడ్వెంచర్‌ను ఆస్వాదించాలనుకునే కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా కంపెనీ దీనిని భారతదేశంలోని తన సొంత ప్లాంట్‌లో తయారు చేయబోతోంది, కావున ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి కానుంది.

ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడిన Toyota Hilux: ఫీచర్స్ & బుకింగ్స్ ప్రైస్

ఇది మొదట 1968 లో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు దాని 8 తరాలు తీసుకురాబడ్డాయి మరియు గత 50 సంవత్సరాలలో ఇది చాలా రెట్లు మెరుగుపరచబడింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని 180 దేశాలలో విక్రయించబడుతోంది మరియు ఇప్పటివరకు 20 మిలియన్ యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే ఈ కొత్త మోడల్ కి దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ ఉంటుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 20, 2022, 12:18 [IST]
English summary
Toyota hilux booking start design features engine details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+