కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) భారతీయ మార్కెట్లో తన కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్కును ఈ నెల 23 న (జనవరి 23) అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కొత్త ట్రక్కు లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ విభాగంలో ప్రవేశించనుంది. ఇప్పటికే కొన్ని టయోటా డీలర్‌షిప్‌లు ఈ పికప్ ట్రక్కు కోసం అనధికారిక బుకింగ్‌లను కూడా స్వీకరించడం ప్రారంభించాయి.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

టయోటా హైలక్స్ సెమీ-నాక్డ్ డౌన్ యూనిట్‌గా భారతీయ మార్కెట్ కి తీసుకురాబడుతుంది. కంపెనీ ఈ పికప్ ట్రక్‌ను భారతదేశంలో అసెంబుల్ చేయనుంది, కావున దీని ధర తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇది మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

కంపెనీ యొక్క ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించనున్నారు. టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

టయోటా హైలక్స్ మోడల్ టయోటా ఫార్చ్యూనర్‌లో ఉపయోగిస్తున్న అదే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే, ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ గరిష్టంగా 420 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

ఈ పవర్‌ఫుల్ ఫార్చ్యూనర్ ఇంజన్ హైలక్స్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులోని ఎంట్రీలెవల్ వేరియంట్లలో టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఉపయోగిస్తున్న 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. అలాగే, ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ 343 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టొయోటా హిలక్స్ రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో స్టాండర్డ్‌గా లభ్యం కావచ్చని సమాచారం. అయితే, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

టయోటా హైలక్స్‌ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. అంతే కాకుండా దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇది చూడటానికి చాలా దూకుడుగా కనిపిస్తుంది.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

ఈ కొత్త పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్‌ పొందుతుంది. కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవాలు ఏ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయో అదే ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హైలెక్స్ ట్రక్కు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

ఇటీవల కాలంలోనే ఈ కొత్త ట్రక్కు గుర్గావ్‌లో జరిగిన ఒక యాడ్ షూట్‌లో కనిపించింది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇంకా అధికారిక బుకింగ్‌ను స్వీకరించడం ప్రారంభించలేదు. కానీ ఈ కొత్త టయోటా హైలక్స్ కొనుగోలు చేయాలనుకునే వారు ఏదైనా టయోటా డీలర్‌షిప్‌ని సందర్శించి రూ. 2 లక్షలతో బుక్ చేసుకోవచ్చు.

కొత్త Hilux లాంచ్ డేట్ వెల్లడించిన Toyota: వివరాలు

టయోటా కంపెనీ యొక్క కొత్త హైలక్స్ ద్వారా కంపెనీ ఇప్పుడు కొత్త విభాగంలోకి ప్రవేశించబోతోంది. అయితే కంపెనీ ప్రవేశించనున్న ఈ కొత్త సెగ్మెంట్ భారతీయ మార్కెట్లో అంతగా ప్రాచుర్యం చెందలేదు. టయోటా హైలక్స్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఇసుజు డి-మ్యాక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota hilux india launch on 23rd january details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X