Toyota Hilux బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే, తప్పక చూడాల్సిందే..!!

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'టయోటా హైలక్స్' (Toyota Hilux) ఇప్పటికే దేశీయ అధికారికంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. కంపెనీ ఈ పికప్ ట్రక్కుని మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే కస్టమర్ల నుంచి విపరీతమైన స్పందన రావడంలో కంపెనీ బుకింగ్స్ కొంతకాలంగా నిలిపివేసింది.

అయితే టయోటా కంపెనీ ఈ Toyota Hilux విడుదల సమయంలో డెలివరీలను గురించి స్పష్టమైన సమాచారం అందించలేదు. అయితే ఇప్పుడు వెలువడిన సమాచారం ప్రకారం Toyota Hilux డెలివరీలు ప్రారంభమైనట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

టొయోట కంపెనీ యొక్క హైలక్స్ పికప్ ట్రక్కుకి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే కంపెనీ మంచి బుకింగ్స్ స్వీకరించగలిగింది. ఇటీవల టయోటా హైలక్స్ పికప్ ట్రక్ డెలివరీకి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. దీన్ని బట్టి చూస్తే డెలివరీలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. బహుశా ఇదే భారతదేశంలో మొట్టమొదటి టయోటా హిలక్స్ అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

డెలివరీలు ప్రారంభించబడ్డాయి, కానీ ఇక్కడ కంపెనీ ఏ వేరియంట్ డెలివరీ చేసింది అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే కంపెనీ టయోటా హైలక్స్ ని 'మ్యాన్యువల్ స్టాండర్డ్, మ్యాన్యువల్ హై మరియు ఆటోమేటిక్ హై అనే మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త టయోటా హైలక్స్ పికప్ ట్రక్కు ప్రారంభ ధర రూ. 33.99 లక్షలు. కాగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 36.80 లక్షలు.

టయోటా హైలక్స్ ని కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఈ కొత్త వెహికల్ 5-సీటర్ వెహికల్. ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. కంపెనీ ఈ పికప్ ట్రక్కుని డీజిల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

కొత్త టయోటా హైలక్స్ మొత్తం 5 కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

టయోటా హైలక్స్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను పొందుతుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైల్‌ని పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది మొత్తమ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, JBL సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో AC మరియు లెదర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతుంది.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అడిషినల్ ఎయిర్‌బ్యాగ్‌లు, LSD మరియు పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును కూడా పొందుతుంది. ఇది A-TRAC (యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్) ఫీచర్లతో వస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా 500 ఎన్ఎమ్ టార్క్‌ అందించే టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి వేరియబుల్ ఫ్లో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌తో పాటు 700 మి.మీ వాటర్ వేడింగ్ కెపాసిటీతో వస్తుంది.

టొయోట హైలక్స్ బుక్ చేశారా.. అయితే ఇది మీ కోసమే..!!

టయోటా హైలక్స్ లోని 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది వాహన ప్రియులు ఈ పికప్ ట్రక్కుని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

Image Courtesy: Manav Maini/4x4 INDIA

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2022, 8:30 [IST]
English summary
Toyota hilux pick up truck delivery starts price engine details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+