Just In
- 9 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 13 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 15 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 18 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరో టీజర్‌తో ముందుకొచ్చిన Toyota Hilux: పూర్తి వివరాలు
టయోటా (Toyota) కంపెనీ ఈ కొత్త సంవత్సరంలో కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్కుని ఈ నెల 20 న అధికారికంగా విడుదల చేయనుంది. హైలక్స్ దేశీయ మార్కెట్లో విడుదలవ్వకముందే ఒక కొత్త టీజర్ విడుదలయ్యింది. ఈ టీజర్ వీడియోలో ఎక్స్టీరియర్ డిజైన్ చూడవచ్చు. అంతే కాకూండా ఈ వీడియోలో 'ఏ రిచర్ లైఫ్' చూపిస్తూ విడుదల తేదీ కూడా చూపబడుతుంది.
దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త టయోటా హైలక్స్ సింగిల్ క్యాబ్, ఎక్స్ట్రా క్యాబ్ మరియు డబుల్ క్యాబ్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇది హెక్సాగోనల్ గ్రిల్ మరియు రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లను కలిగి ఉంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ట్రక్కును చాలా ఆకర్షణీయంగా చేస్తాయి.
టయోటా హైలక్స్ ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంచబడిన అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ ఇవ్వబడింది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైల్‌ని పొందుతుంది. ఇది కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది, ఇది పూర్తిగా భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతుంది.
టయోటా హైలక్స్ 5-సీటర్ వెహికల్ గా ఉంటుంది. ఈ హైలక్స్ సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ కొత్త హైలక్స్ యొక్క బుకింగ్స్ కూడా జనవరి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి నుంచి ప్రారంభమవుతాయి.
టయోటా హైలక్స్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్. కంపెనీ ఈ కొత్త మోడల్ కొనుగోలుపైన అద్భుతమైన వారంటీ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ ఇస్తుంది. అయితే ఈ వారంటీని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించే అవకాశం కూడా అందుబటులో ఉంటుంది. ఈ కొత్త ట్రక్కుకి సర్వీస్ చేసుకోవడం కూడా చాలా సులభం. ఎందుకంటే కంపెనీ దేశవ్యాప్తంగా మొత్తం 342 సర్వీస్ అవుట్లెట్లను కలిగి ఉంది.
త్వరలో విడుదల కానున్న ఈ ట్రక్కు పూర్తిగా కొత్త సెగ్మెంట్ అని, ఇది 4x4 అడ్వెంచర్‌ను ఆస్వాదించాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటుందని కంపెనీ తెలిపింది. కొత్త టయోటా హైలక్స్ IMV పై నిర్మించబడింది. ఇప్పటికే కంపెనీ టయోటా ఇన్నోవా మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటిని నిర్మించింది. ఇది మొదట 1968 లో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు దాని 8 తరాలు తీసుకురాబడ్డాయి మరియు గత 50 సంవత్సరాలలో ఇది చాలా రెట్లు మెరుగుపరచబడింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని 180 దేశాలలో విక్రయించబడుతోంది మరియు ఇప్పటివరకు 20 మిలియన్ యూనిట్లు విక్రయించబడ్డాయి.
టయోటా హైలక్స్ మోడల్ టయోటా ఫార్చ్యూనర్‌లో ఉపయోగిస్తున్న అదే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ ఇప్పటికే ఫార్చ్యూనర్ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది.
టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.
ఈ కొత్త పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్ పొందుతుంది. కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవాలు ఏ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయో అదే ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హైలెక్స్ ట్రక్కు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది.
ఇందులోని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.