దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) ఇటీవల కాలంలో కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్కుని ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త వెహికల్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలు చేయదలచిన కస్టమర్లు ఈ లైఫ్ స్టైల్ ట్రక్కును రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యీ అవకాశం ఉంటుంది.

అయితే కంపెనీ ఈ కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) యొక్క TVC ని విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ మీ కోసం..

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

టయోటా హైలక్స్ (Toyota Hilux) యొక్క ఈ TVC వీడియోలో డ్రైవింగ్ మరియు దాని కెపాసిటీ వంటి వాటిని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది వాహన కొనుగోలుదారులను ఆకర్శించడంలో చాలావరకు సహాయపడుతుంది. ఈ వీడియో ఈ ఆర్టికల్ లో మీరు కూడా చూడవచ్చు.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

కొత్త టయోటా హైలక్స్ మొత్తం 5 కలర్ ఆప్సన్ లో తీసుకురానుంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్.

టయోటా హైలక్స్ ని కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఈ కొత్త వెహికల్ 5-సీటర్ వెహికల్ గా ఉండబోతోంది. ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. డీజిల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఈ వెహికల్ ధర మరియు డెలివరీ వంటి వాటికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కానీ కంపెనీ త్వరలో వీటికి సంబంధించిన సమాచారం వెల్లడిస్తుంది.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

టయోటా హైలక్స్ పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు రెండు వైపులా LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది, దీని కారణంగా ఇది రహదారిపై బలంగా కనిపిస్తుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను పొందుతుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైల్‌ని పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది మొత్తమ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, JBL సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో AC మరియు లెదర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతుంది.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అడిషినల్ ఎయిర్‌బ్యాగ్‌లు, LSD మరియు పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును కూడా పొందుతుంది. ఇది A-TRAC (యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్) ఫీచర్లతో వస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా 500 ఎన్ఎమ్ టార్క్‌ అందించే టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి వేరియబుల్ ఫ్లో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌తో పాటు 700 మి.మీ వాటర్ వేడింగ్ కెపాసిటీతో వస్తుంది.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

ఈ ట్రక్ ఇటీవల NCAP టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. కావున ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ వాహనదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ ఇవ్వబడుతుంది, దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించవచ్చు.

వినియోగదారులు దీని సర్వీస్ కోసం, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీకి చెందిన 342 సర్వీస్ అవుట్‌లెట్‌లను ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా కొత్త సెగ్మెంట్ అని, ఇది 4x4 అడ్వెంచర్‌ను ఆస్వాదించాలనుకునే కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా కంపెనీ దీనిని భారతదేశంలోని తన సొంత ప్లాంట్‌లో తయారు చేయబోతోంది, కావున ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి కానుంది.

దుమ్మురేపుతున్న Toyota Hilux TVC వీడియో

ఇది మొదట 1968 లో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు దాని 8 తరాలు తీసుకురాబడ్డాయి మరియు గత 50 సంవత్సరాలలో ఇది చాలా రెట్లు మెరుగుపరచబడింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని 180 దేశాలలో విక్రయించబడుతోంది మరియు ఇప్పటివరకు 20 మిలియన్ యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే ఈ కొత్త మోడల్ కి దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ ఉంటుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 22, 2022, 12:28 [IST]
English summary
Toyota hilux tvc video design features details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+