టయోటా హైరైడర్ CNG విడుదలకు అంతా సిద్ధం.. ఇప్పటికే మొదలైన బుకింగ్స్ & ఇక లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'టయోటా' కంపెనీ యొక్క 'హైరైడర్' CNG వెర్షన్ లో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ వెర్సన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఈ నెలలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.

భారతీయ మార్కెట్లో CNG వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా మారుతి సుజుకి తమ వాహనాలను CNG వాహనాలుగా మారుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టయోటా కంపెనీ కూడా CNG వాహన విభాగాన్ని విస్తరాయించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. కావున టయోటా హైరైడర్ CNG రూపంలో ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీని కోసం రూ. 25,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.

హైరైడర్ CNG విడుదలకు అంతా సిద్ధం

త్వరలో విడుదలకానున్న ఈ హైరైడర్ CNG మిడ్ సైజ్ SUV విభాగంలో మొదటి CNG బేస్డ్ మోడల్ అవుతుంది. ఇది S మరియు G అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులోకి రానుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5లీ NA పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ మరియు CNG వెర్షన్‌తో కూడిన 1.5-లీటర్ పెట్రోల్‌తో సహా 3 పవర్‌ట్రెయిన్ ఆప్సన్లతో అందించబడే సెగ్మెంట్‌లోని మొదటి మోడల్ ఇదే అవుతుంది.

హైరిడర్ CNG వెర్షన్ లో 1.5 లీటర్ K15C, 4-సిలిండర్ ఇంజన్‌తో అందించబడే అవకాశం ఉంటుంది. ఇది 5,500rpm వద్ద 87bhp పవర్ మరియు 4,200rpm వద్ద 121.5Nm టార్క్‌ అందిస్తుంది. కాగా ఇది పెట్రోల్ మీద నడిచేటప్పుడు 6,000rpm వద్ద 99 bhp పవర్ మరియు 4,400rpm వద్ద 136Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

హైరిడర్ CNG వెర్షన్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది 26.10కిమీ/కేజీ అందిస్తుంది. మొత్తం మీద ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా ఉత్తమైన మైలేజ్ అందిస్తుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కావున ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. అంతే కాకుండా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ మరియు పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్స్ ఉంటాయి.

ఈ కొత్త CNG వెర్షన్ చూడటానికి పెట్రోల్ వెర్షన్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాగా మిగిలిన ఎక్స్టీరియర్ డిజైన్ దాదాపు పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి 'క్రిస్టల్ యాక్రిలిక్' గ్రిల్‌లో చక్కగా కలిసిపోతాయి. వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి.

ఇక చివరగా రానున్న హైరైడర్ CNG యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

CNG వాహనాలను ప్రస్తుతం డిమాండ్ భారీగా ఉంది. కావున ఇప్పుడు చాలా కంపెనీలు తమ అడుగులను ఈ వైపుగా సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే టయోటా గ్లాంజా కూడా CNG రూపంలో విడుదలైంది. ఇక త్వరలోనే హైరైడర్ CNG రానుంది. ఈ కొత్త CNG వెర్షన్ కి సంబంధించిన చాలా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంచిందించిన మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota hyryder cng launch this month bookings open details
Story first published: Monday, December 5, 2022, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X