కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

జపనీస్ కార్ కంపెనీ టొయోటా (Toyota) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ (Fortuner) లో కంపెనీ మరో కొత్త వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ లైనప్ లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ గా కంపెనీ తమ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ (Toyota Fortuner GR-S) వేరియంట్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఫార్చ్యూనర్ యొక్క ఈ కొత్త వేరియంట్ ధర రూ. 48.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్ యొక్క 4WD వేరియంట్ కంటే దాదాపు రూ.3.8 లక్షలు ఎక్కువ.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ (Toyota Fortuner GR-S) వేరియంట్ ఇతర ఫార్చ్యూనర్ వేరియంట్‌ల కంటే ఎక్కువ మెకానికల్ మరియు కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌ లను కలిగి ఉంటుంది. టొయోటా ఫార్చ్యూనర్ యొక్క ఇతర వేరియంట్‌ ల మాదిరిగా కాకుండా, ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ కేవలం 4WD డ్రైవ్‌ట్రెయిన్‌ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, ఇది కేవలం రెండు ఎక్స్టీరియర్ కలర్లలో మాత్రమే లభిస్తుంది. వీటిలో యాటిట్యూడ్ బ్లాక్ మరియు వైట్ పెర్ల్ క్రిస్టల్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

డిజైన్ పరంగా చూస్తే, కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ లో ముందు వైపు మరింత అగ్రెసివ్ గా కనిపించే ఎయిర్ డ్యామ్ మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో కొత్తగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ ఫార్చ్యూనర్ వేరియంట్‌ల నుండి ఈ ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ ను వేరు చేయడానికి కంపెనీ దీని ముందు భాగంలో 'GR' బ్యాడ్జింగ్‌ను కూడా అందిస్తోంది. ఇక సైడ్స్ లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ కు బదులుగా డార్క్ షాడోతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌ ను ఉపయోగించింది.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ ఒక స్పోర్టీ వెర్షన్, కాగా ఈ స్పోర్టీ వేరియంట్ యొక్క స్పోర్టీనెస్ ను మరింత మెరుగు పరచేందుకు కంపెనీ ఇందులో 'GR' లోగోతో కూడిన రెడ్ బ్రేక్ కాలిపర్‌లను కూడా ఉపయోగించింది. అంతేకాకుండా, కొత్త టొయోటా ఫార్చ్యూనర్ GR-S వేరియంట్ వెనుక భాగంలో మరింత అగ్రెసివ్ గా కనిపించే స్టైలింగ్‌తో ఉండేలా, రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్‌ ఉంటుంది. అలాగే, ఈ వేరియంట్ లోని వెనుక టెయిల్ ల్యాంప్‌లు బాడీ-కలర్ ట్రిమ్‌తో బ్రిడ్జ్ చేయబడి కనిపిస్తాయి.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్ లో ఇంటీరియర్ లోపల చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ కొత్త వేరియంట్ స్పోర్టియర్ లుక్‌ను మరింత పెంచేందుకు ఇది స్టాండర్డ్ వేరియంట్ల కంటే మరిన్ని ఎక్కువ కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. వీటిలో ప్రీమియం బ్లాక్ లెథర్ సీట్లు, రెడ్ కలర్ స్టిచింగ్ తో కూడిన స్వెడ్ అప్‌హోలెస్ట్రీ, ఇంటీరియర్లపై 'GR' లోగోలు కనిపిస్తాయి. ఈ కాస్మెటిక్ మార్పులతో పాటు, సెంటర్ కన్సోల్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా విభిన్నమైన ట్రిమ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కొత్తగా విడుదల చేసిన జిఆర్-ఎస్ వేరియంట్ ఫార్చ్యూనర్‌లో కంపెనీ తమ ప్రస్తుత టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్‌లో అందిస్తున్న ఇతర ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇందులో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, JBL ఆడియో సిస్టమ్, గెశ్చర్ కంట్రోల్ ఎలక్ట్రికల్ టెయిల్‌గేట్, ట్రాక్షన్ కంట్రోల్ (TC), స్టెబిలిటీ కంట్రోల్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైన ఫీటర్లు మరెన్నో ఉన్నాయి.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

యాంత్రికంగా ఈ కొత్త వేరియంట్ లో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, ఇందులో ఉపయోగించిన 2.8 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌, టొయోటా ఫార్చ్యూనర్ యొక్క ఇతర వేరియంట్‌లతో సమానంగా ఉన్నప్పటికీ, ఇది ఇప్పుడు 3,000 - 3 ,400 rpm వద్ద 201 bhp ల గరిష్ట శక్తిని మరియు 1,600 - 2,800 rpm మధ్యలో 500 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేసేలా రీట్యూన్ చేశారు. టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ లోని ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో జత చేయబడి ఉంటుంది.

కొత్త ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన టొయోటా.. ధరెంతంటే..?

టొయోటా ఇన్నోవా (Toyota Innova) హైబ్రిడ్ వేరియంట్ వస్తోంది..!

ఇదిలా ఉంటే, టొయోటా తమ పాపులర్ ఎమ్‌పివి ఇన్నోవా (Innova) లో ఓ కొత్త హైబ్రిడ్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఇటీవలే భారతదేశంలో "ఇన్నోవా హైక్రాస్" (Innova Hycross) అనే కొత్త పేరు కోసం ట్రేడ్‌మార్క్ ను కూడా దాఖలు చేసింది. దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లను తయారు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. టొయోటా కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హోండా ఇప్పటికీ తమ సిటీ సెడాన్ హైబ్రిడ్ కారును మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
Toyota india launches new fortuner gr s variant price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X