విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

టయోటా (Toyota) కంపెనీ యొక్క కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్కు ఈ నెల 23 న (జనవరి 23) అధికారికంగా విడుదలకానుంది. అయితే ఈ పికప్ ట్రక్కు విడుదలకు ముందే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున ఈ కొత్త లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కును కొనాలనుకునే వారు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ యొక్క డీలర్‌షిప్ ఆధారంగా బుకింగ్స్ ప్రైస్ అనేది రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల వరకు ఉంటుంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్కు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది. దీనిని కంపెనీ యొక్క ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించనున్నారు.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

టయోటా హైలక్స్ మోడల్ టయోటా ఫార్చ్యూనర్‌లో ఉపయోగిస్తున్న అదే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే, ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ గరిష్టంగా 420 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

ఈ పవర్‌ఫుల్ ఫార్చ్యూనర్ ఇంజన్ హైలక్స్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులోని ఎంట్రీలెవల్ వేరియంట్లలో టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఉపయోగిస్తున్న 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. అలాగే, ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ 343 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టొయోటా హిలక్స్ రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో స్టాండర్డ్‌గా లభ్యం కావచ్చని సమాచారం. అయితే, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

టయోటా హైలక్స్‌ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. అంతే కాకుండా దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇది చూడటానికి చాలా దూకుడుగా కనిపిస్తుంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

ఈ కొత్త పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్‌ పొందుతుంది. కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవాలు ఏ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయో అదే ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హైలెక్స్ ట్రక్కు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

విడుదలకు ముందే Toyota Hilux బుకింగ్స్ స్టార్ట్: లాంచ్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలోనే ఈ కొత్త ట్రక్కు గుర్గావ్‌లో జరిగిన ఒక యాడ్ షూట్‌లో కనిపించింది. టయోటా కంపెనీ యొక్క కొత్త హైలక్స్ ద్వారా కంపెనీ ఇప్పుడు కొత్త విభాగంలోకి ప్రవేశించబోతోంది. అయితే కంపెనీ ప్రవేశించనున్న ఈ కొత్త సెగ్మెంట్ భారతీయ మార్కెట్లో అంతగా ప్రాచుర్యం చెందలేదు. టయోటా హైలక్స్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఇసుజు డి-మ్యాక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త టయోటా హైలక్స్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు, కానీ ఇది దాదాపు రూ. 30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, January 8, 2022, 14:39 [IST]
English summary
Toyota india official bookings for hilux pickup details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+