అదనపు ఫీచర్లతో కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్.. పండుగ సీజన్‌లో విడుదల..
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎమ్‌పివి ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) లో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ను వెల్లడి చేసింది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే ఇది అదనపు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది.
Recommended Video
రానున్న పండుగ సీజన్ లో లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టా కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

డీలర్‌షిప్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 17.45 లక్షలు మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 19.02 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. టొయోటా ఇటీవల తమ డీజిల్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్ లను నిలిపివేసిన నేపథ్యంలో, ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభ్యం కానుంది.

సాధారణంగా, టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta)లో పెట్రోల్ మోడల్ కంపెనీ డీజిల్ మోడళ్లే ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. అలాంటిది, కంపెనీ ఇప్పుడు డీజిల్ వేరియంట్ల కోసం బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. విడిభాగాల సరఫరాలో అంతరాయం, డీజిల్ వేరియంట్లకు వస్తున్న అధిక డిమాండ్ మరియు డీజిల్ వేరియంట్ల కోసం పెరుగుతున్న అధిక వెయిటింగ్ పీరియడ్ వంటి కారణాల దృష్ట్యా కంపెనీ ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా డీజిల్ వేరియంట్ల బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇక కొత్తగా రాబోయే టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ ఇన్నోవా క్రిస్టా యొక్క జిఎక్స్ వేరియంట్ ఆధారంగా చేసుకొని రూపొందించబడింది. పెట్రోల్ వెర్షన్ బుకింగ్‌లను మెరుగుపరచడానికి కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ ను అనేక అదనపు యాక్ససరీలతో ముస్తాబు చేసింది. ఇది గతంలో డీలర్ స్థాయిలో అదనపు ధర వద్ద అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు GX వేరియంట్ ధర వద్దే ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఉచితంగా అదనపు యాక్ససరీలతో అందుబాటులోకి వచ్చింది.

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లో లభించే అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటివి లభిస్తాయి. డీలర్ల ప్రకారం, ఈ అదనపు ఫీచర్లను కస్టమర్లు విడిగా కొనుగోలు చేయాలంటే, సుమారు రూ. 55,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా, కంపెనీ ఇప్పుడు వీటిని అక్టోబర్ వరకు లేదా స్టాక్ ఖాలీ అయిపోయే వరకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. టొయోటా దీని ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

టొయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ కోసం బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేయబడిన నేపథ్యంలో, ఇప్పటికే ఈ కారుని బుక్ చేసుకొని, డెలివరీ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు చాలా మందే ఉన్నట్లు సమాచారం. అలాంటి వారి కోసం, డెలివరీ టైమ్‌లైన్ గురించి కస్టమర్లకు నేరుగా తెలియజేస్తామని కంపెనీ పేర్కొంది. అయితే, శీఘ్ర డెలివరీ కోసం చూస్తున్న కస్టమర్లు ఇప్పుడు పెట్రోల్ మోడల్‌లను కొనుగోలు చేస్తున్నట్లు కొందరు డీలర్లు చెబుతున్నారు.

ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ల కోసం కూడా దాదాపు ఒక నెల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. టొయోటా ఇటీవల విడుదల చేసిన హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ మాదిరిగానే, ఇన్నోవా క్రిస్టాలో డీజిల్ వెర్షన్ ను పూర్తిగా నిలిపివేసి, అందులో ఓ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ ను తీసుకురావచ్చనే వాదన వినిపిస్తోంది. అందుకే, ప్రస్తుతం టొయోటా డీజిల్ కార్ల బుకింగ్ లను నిలిపివేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కొత్త హైబ్రిడ్ ఇన్నోవాను టొయోటా ఇన్నోవా హైక్రాస్ పేరుతో నవంబర్ 2022 నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

టొయోటా ఇన్నోవా హైక్రాస్ భారతదేశంతో సహా పలు గ్లోబల్ మార్కెట్‌లలో కూడా అమ్ముడుకానుంది. టొయోటా ప్రస్తుతం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను ప్రమోట్ చేస్తోంది. టొయోటా హైరైడర్ లో పెద్ద 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ కేవలం పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 91.1 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 79.1 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఇ-సివిటి గేర్‌బాక్స్ తో తజతచేయబడి ఉంటుంది. బహుశా కొత్త ఇన్నోవా హై-క్రాస్ లో కూడా ఇలాంటి ఇంజన్‌నే ఉపయోగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








