'ఇన్నోవా హైక్రాస్' గురించి మరో కొత్త విషయం వెల్లడించిన టయోటా: అదేమిటో మీరే చూసెయ్యండి
టయోటా కంపెనీ తన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' MPV ని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించడానికి మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
కంపెనీ ఈ MPV ని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముందే చాలా సమాచారం వెల్లడించింది, ఇప్పటికే ఎక్స్టీరియర్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని గురించి వెల్లడించింది, కాగా ఇప్పుడు హెడ్లైట్ గురించి సమాచారం అందించింది.

కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఒక టీజర్ లో పెద్ద ఫ్రంట్ గ్రిల్ చూడవచ్చు, ఇది ఇది ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు కూడా రీ డిజైన్ చేయబడ్డాయని తెలుస్తోంది. మొత్తమ్ మీద ఇది మంచి డిజైన్ పొందుతుందని స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక ఇందులోని ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ చాలా వరకు రీడిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో నిలువుగా ఉండే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్, ఏసీ వెంట్స్, వెనుక ఉండే ప్రయాణికుల కోసం డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, హిట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెదర్ అపోల్స్ట్రే మరియు 360-డిగ్రీల కెమెరా వంటివి కూడా ఉన్నాయి.

టయోట కంపెనీ తన 'ఇన్నోవా హైక్రాస్' MPV ని ఈ నెల 25 న (2022 నవంబర్ 25) ఆవిష్కరించనుంది. అయితే ఇది 2023 ఆటో ఎక్స్‌పో లో విడుదల కానుంది. అయితే అంతకంటే ముందు ఈ MPV ఇండోనేషియన్ మార్కెట్లో నవంబర్ 21 న ఆవిష్కరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
టయోట హైక్రాస్ యొక్క ఇంజిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ హైరైడర్‌లో కనిపించే 1.5-లీటర్ హైబ్రిడ్ సిస్టమ్‌కు బదులుగా 2.0-లీటర్ వెర్షన్ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబందించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. అయితే ఇది తప్పకుండా మంచి పర్ఫామెన్స్ అందించే విధంగా రూపొందించబడుతుంది.

కొత్త హైక్రాస్ MPV లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ADAS వంటి ఫీచర్స్ కూడా రానున్నట్లు సమాచారం. కావున ఇది రోడ్ సైడ్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్, లేన్ డిపార్చర్ అలర్ట్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి వాటిని కూడా పొందుతుంది. మొత్తం మీద ఇది ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని నిర్దారించవచ్చు.
టయోటా కంపెనీ ఆవిష్కరించనున్న ఈ కొత్త MPV కోసం బుకింగ్స్ కూడా ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ధరలు మరియు డెలివరీలు 2023 జనవరి నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఈ MPV ని బుక్ చేసుకున్న తరువాత 2023 జనవరి నాటికి డెలివరీలను పొందే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








