విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

భారతీయ మార్కెట్లో 'టొయోట' (Toyota) కంపెనీ కొత్త 'హైక్రాస్' (Hycross) ఎమ్‌పివిని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఈ MPV యొక్క ఆవిష్కరణ తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ MPV యొక్క సైడ్ ప్రొఫైల్ కి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

కంపెనీ ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం, 2022 నవంబర్ 25 న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. కాగా ఈ ఇన్నోవా హైక్రాస్ 2023 లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఎమ్‌పివి భారతీయ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముందే ఇండోనేషియాలో నవంబర్ 21 న ఆవిష్కరించబడుతుంది. దీన్ని బట్టి చూస్తే టొయోట కొత్త హైక్రాస్ ఎమ్‌పివిని దేశీయ మార్కెట్లో మాత్రమే కాకూండా విదేశీ మార్కెట్లో విక్రయించడానికి తయారవుతోందని అర్థమవుతోంది.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

కంపెనీ విడుదల చేసిన కొత్త టీజర్ ప్రకారం, టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క సైడ్ ప్రొఫైల్ లో పెద్ద వీల్ ఆర్చ్‌లు మరియు క్యారెక్టర్ లైన్స్ వంటివి చూడవచ్చు. అదే సమయంలో హైక్రాస్ బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. మొత్తమ్ మీద ఇది ఇన్నోవా క్రిష్టా కంటే కూడా చాలా వరకు భిన్నంగా ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

ఇప్పటికే విడుదలైన కొన్ని టీజర్ల ప్రకారం, ఈ MPV అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుందని తెలుస్తుంది. ఇందులో హెక్సాగోనల్ గ్రిల్‌ అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ఎల్ షేప్ ఇన్సర్ట్‌తో విస్తృతంగా విస్తరించబడిన హెడ్‌లైట్ ఉంటుంది. అదే సమయంలో దీని బానెట్‌పై క్రీజ్, బంపర్‌పై ఫాగ్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. కాగా రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ బ్రేక్ లైట్‌తో సమాంతరంగా ఉండే టెయిల్ లైట్‌ కూడా లభిస్తాయి.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

టొయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క ఇంటీరియర్స్ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుందని మొదట్లోనే తెలిసిపోయింది. అంతే కాకుండా ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్సన్ వంటి వాటితో పాటు రెండవ వరుస కెప్టెన్ సీట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 2.0 లీటర్ లేదా 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులోని హైబ్రిడ్ ఇంజన్ కారణంగా ఇది ఖచ్చితంగా మంచి మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న దీని ఇంజిన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా త్వరలోనే వెల్లడవుతుంది.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

సేఫ్టీ విషయానికి వస్తే, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా చాలా అప్డేట్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో ADAS వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కావున ఇది రోడ్ సైన్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్, లేన్ డిపార్చర్ అలర్ట్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి వాటిని కూడా పొందుతుంది.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం MPV కానుంది. అయితే ఇది 2022 జనవరి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది కావున, డెలివరీలు కూడా త్వరలనే ప్రారభమయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఇది దేశీయ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'టయోటా హైక్రాస్' ఇలాగే ఉంటుంది: టీజర్ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టొయోట కంపెనీ ఎప్పటికప్పుడు తన ఫోర్డ్ ఫోలియోను విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ కొత్త MPV హైక్రాస్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే కొత్త హైక్రాస్ యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ మరియు ధరలు వంటివి ఇంకా తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది. కొత్త 'టొయోట హైక్రాస్' (Toyota Hycross) గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు & బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2022, 17:34 [IST]
English summary
Toyota innova hycross new teaser side profile design details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+