అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ కార్ తయారీ సంస్థ 'టయోటా' (Toyota) 2022 నవంబర్ నెలలో భారతీయ విఫణిలో ఒక కొత్త MPV విడుదల చేయనుంది. టయోటా విడుదల చేయనున్న 'హైక్రాస్' (Hycross) MPV గురించి ఇప్పటికే చాలా సమాచారం వెల్లడయింది. కాగా ఇప్పుడు ఇందులో 'పనోరమిక్ సన్‌రూఫ్' ఫీచర్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

టయోటా హైక్రాస్ MPV భారతీయ మార్కెట్లో 2022 నవంబర్ 25 న అధికారికంగా ఆవిష్కరించబనుంది. అంత కంటే ముందు కంపెనీ దీనిని 'జెనిక్స్' అనే పేరుతో 2022 నవంబర్ 21 న ఇండోనేషియాలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అయితే 2023 నాటికి భారతీయ మార్కెట్లో విక్రయించబడనుంది. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన టీజర్లలో సైడ్ ప్రొఫైల్ లో పెద్ద వీల్ ఆర్చ్‌లు మరియు క్యారెక్టర్ లైన్స్ వంటివి మాత్రమే కాకుండా హైక్రాస్ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఉంటుంది.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ మాన్యువల్ ఐఆర్విఎమ్, సన్‌రూఫ్ ప్యానెల్ కి సమాంతరంగా రియర్ ఎసి వెంట్స్ మరియు రెండవ వరుస ప్రయాణీకుల కోసం స్క్రీన్ వంటివి అందుబాటులో ఉండనున్నాయి. అంతే కాకుండా ఇందులో రీడిజైన్ చేయబడ్డ మల్టీ లేయర్ డ్యాష్ బోర్డ్, పెద్ద ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వంటివి ఉంటాయి.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

టయోటా హైక్రాస్ హెక్సాగోనల్ గ్రిల్‌ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ షేప్ ఇన్సర్ట్‌తో విస్తృతంగా విస్తరించబడిన హెడ్‌లైట్ ఉంటుంది. బానెట్‌పై క్రీజ్, బంపర్‌పై ఫాగ్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. కాగా రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ బ్రేక్ లైట్‌తో సమాంతరంగా ఉండే టెయిల్ లైట్‌ కూడా లభిస్తాయి.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

ఇంటీరియర్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ పొందుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

నిజానికి టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. అయితే కొత్త టయోటా హైక్రాస్ ఈ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 2.0 లీటర్ లేదా 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందే అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ ఇంజన్ కారణంగా ఇది ఖచ్చితంగా మంచి మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న దీని ఇంజిన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

టయోటా హైక్రాస్ యొక్క ఇంజిన్ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కాగా దీనికి సంబంధించిన వివరాలు నవంబర్ 25 న వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే టయోటా హైక్రాస్ లో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ అందుబాటులో ఉండే అవకాశం లేదు.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

సేఫ్టీ విషయానికి వస్తే, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా చాలా అప్డేట్స్ పొందుతుంది, కాబట్టి ఇందులో ADAS వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కావున ఇది రోడ్ సైడ్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్, లేన్ డిపార్చర్ అలర్ట్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి వాటిని కూడా పొందుతుంది.

అందరికీ నచ్చిన ఫీచర్ ఇప్పుడు 'టయోటా హైక్రాస్' లో కూడా: అదేమిటంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో మంచి ఉత్పత్తులను ప్రవేశపెడుతూ, మంచి అమ్మకాలు పొందుతున్న టయోటా (Toyota) కంపెనీ త్వరలో 'హైక్రాస్' (Hycross) అనే కొత్త MPV విడుదల చేయనుంది. ఈ MPV కూడా తప్పకుండా గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. టయోటా హైక్రాస్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు & కొత్త బైకుల గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota innova hycross panoramic sunroof teased ahead of global launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X