'ఇన్నోవా హైక్రాస్' బుకింగ్స్ డేట్ వెల్లడించిన టయోట.. డెలివరీలు మాత్రం అప్పుడే

జపనీస్ కార్ల తయారీ సంస్థ 'టయోట' (Toyota) భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సంసిద్ధం చేస్తున్న కొత్త 'ఇన్నోవా హైక్రాస్' గురించి ఇప్పటికే చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది.

అయితే ఇప్పుడు కంపెనీ ఈ MPV యొక్క బుకింగ్ డేట్ గురించి వెల్లడించింది. టయోట ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ మరియు ఆవిష్కరణకు సంబంధించిన వివరాలతో పాటు, ఇతర మరిన్ని పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ డేట్ వెల్లడించిన టయోట

టయోట కంపెనీ తన సరికొత్త MPV 'ఇన్నోవా హైక్రాస్' ను ఈ నెల 25 న (2022 నవంబర్ 25) ఆవిష్కరించనుంది. అయితే అంతకంటే ముందు ఈ MPV ఇండోనేషియన్ మార్కెట్లో నవంబర్ 21 న ఆవిష్కరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కాగా ఇది 2023 ఆటో ఎక్స్‌పో లో విడుదల కానుంది.

కంపెనీ తన 'హైక్రాస్' కి సంబంధించిన చాలా టీజర్లకు విడుదల చేసింది. ఇందులో సైడ్ ప్రొఫైల్ లో పెద్ద వీల్ ఆర్చ్‌లు మరియు క్యారెక్టర్ లైన్స్ వంటివి మాత్రమే కాకుండా హైక్రాస్ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది. అయితే ఇటీవల విడుదలైన ఒక కొత్త టీజర్ ప్రకారం ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఉన్నట్లు స్పష్టమైంది. అంతే కాకుండా ఇందులో మాన్యువల్ ఐఆర్విఎమ్, సన్‌రూఫ్ ప్యానెల్ కి సమాంతరంగా రియర్ ఎసి వెంట్స్ మరియు రెండవ వరుస ప్రయాణీకుల కోసం స్క్రీన్ వంటివి అందుబాటులో ఉండనున్నాయి.

ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ డేట్ వెల్లడించిన టయోట

టయోటా ఇన్నోవా హైక్రాస్ లో రీడిజైన్ చేయబడ్డ మల్టీ లేయర్ డ్యాష్ బోర్డ్, పెద్ద ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వంటివి కూడా ఉంటాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హెక్సాగోనల్ గ్రిల్‌, ఎల్ షేప్ ఇన్సర్ట్‌తో విస్తృతంగా విస్తరించబడిన హెడ్‌లైట్, బానెట్‌పై క్రీజ్, బంపర్‌పై ఫాగ్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్, రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ బ్రేక్ లైట్‌తో సమాంతరంగా ఉండే టెయిల్ లైట్‌ వంటివి లభిస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అందుబాటులో ఉంటుంది, అంతే కాకుండా 360 డిగ్రీ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా పొందనుంది. మొత్తం మీద ఇన్నోవా హైక్రాస్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఆధునికంగా ఉంటుందని ఇప్పటికే వెల్లడైన టీజర్ల ద్వారా స్పష్టమైంది.

ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ డేట్ వెల్లడించిన టయోట

టయోట హైక్రాస్ యొక్క ఇంజిన్ కి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ ఇందులో హైరైడర్‌లో కనిపించే 1.5-లీటర్ హైబ్రిడ్ సిస్టమ్‌కు బదులుగా 2.0-లీటర్ వెర్షన్‌ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబందించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. అయితే ఇది తప్పకుండా మంచి పర్ఫామెన్స్ అందించే విధంగా రూపొందించబడుతుందని చెప్పవచ్చు.

కొత్త హైక్రాస్ MPV సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ADAS వంటి ఫీచర్స్ రానున్నట్లు సమాచారం. కావున ఇది రోడ్ సైడ్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్, లేన్ డిపార్చర్ అలర్ట్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి వాటిని కూడా పొందుతుంది. మొత్తం మీద ఇది ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని నిర్దారించవచ్చు.

కంపెనీ ఈ MPV ని ఈ నెల 25 న ఆవిష్కరించనున్నట్లు ముందు చెప్పుకున్నాము, అదే రోజు నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాగా ధరలు మరియు డెలివరీలు 2023 జనవరి నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ నెలలో బుక్ చేసుకునే కస్టమర్లు 2023 జనవరి నాటికి డెలివరీలను పొందుతారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2022, 10:10 [IST]
English summary
Toyota innova hycross teased ahead of reveal bookings details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+