రేపు భారత్‌లో అడుగుపెట్టనున్న 'టయోటా ఇన్నోవా హైక్రాస్' - వివరాలు

ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో ఆవిష్కరించబడిన టయోటా కంపెనీ యొక్క లేటెస్ట్ ఎమ్‌పివి 'ఇన్నోవా జెనిక్స్' రేపు 'టయోటా ఇన్నోవా హైక్రాస్' రూపంలో భారతీయ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించబడుతుంది.

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టక ముందే కంపెనీ ఈ కొత్త MPV గురించి చాలా సమాచారం వెల్లడించింది. కాగా ఇప్పుడు ఈ 'ఇన్నోవా హైక్రాస్' యొక్క మరిన్ని కొత్త వివరాలను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

రేపు భారత్‌లో అడుగుపెట్టనున్న టయోటా ఇన్నోవా హైక్రాస్

కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇది దాని ఇన్నోవా క్రిష్టా మాదిరిగా కాకుండా.. కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. కావున ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికొస్తే, కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ MUV పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన నిలువుగా ఉండే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కనెక్టెడ్ కార్ టెక్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లతో పాటు రెండవ వరుసలో కెప్టెన్ సీట్ వంటివి ఉంటాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారుతో కూడిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సిస్టమ్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 184.8 బిహెచ్‌పి పవర్ మరియు 187 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. అయితే ఈ కొత్త 'ఇన్నోవా హైక్రాస్' డీజిల్ ఇంజిన్ ఆప్సన్ పొందే అవకాశం లేదు.

కొత్త ఇన్నోవా హైక్రాస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ప్రీ-కొలిజన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, డైనమిక్ రాడార్ బేస్డ్ క్రూయిస్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ హై బీమ్ వంటి ADAS ఫంక్షన్‌ల్స్ మొదలైనవి ఉంటాయి. అయితే ఈ MPV కోసం ఈ నెల 25 నుంచి అధికారిక బుకింగ్స్ ప్రారంభమవుతాయి. డెలివరీలు 2023 జనవరి నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధునిక ఫీచర్స్ మరియు అద్భుతమైన పర్ఫామెన్స్ అందించేలా రూపొందించబడింది, కావున ధరలు ఇన్నోవా క్రిష్టా కంటే ఎక్కువగానే ఉంటాయి. కావున దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే ఆవకాశం ఉంటుందని భావిస్తున్నాము. డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా పరిమాణం పరంగా కూడా ఇది ఇన్నోవా కృష్టా కంటే పెద్దదిగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్నకొత్త 'ఇన్నోవా హైక్రాస్' తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త MPV దాని విభాగంలో కియా కంపెనీ యొక్క కారెన్స్, మహీంద్రా మొరాజో మరియు కియా కార్నివాల్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కొత్త 'టయోటా ఇన్నోవా హైక్రాస్' గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota innova hycross unveil tomorrow details
Story first published: Thursday, November 24, 2022, 13:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X