ఇండోనేషియాలో అడుగుపెట్టిన 'టయోటా ఇన్నోవా జెనిక్స్' (Toyota Innova Zenix).. మరో మూడు రోజుల్లో భారత్‌లో

జపనీస్ కార్ తయారీ సంస్థ 'టయోటా' (Toyota) తన కొత్త 'ఇన్నోవా జెనిక్స్' (Innova Zenix) MPV ని ఇండోనేషియా మార్కెట్లో ముందు చెప్పినట్లుగానే అధికారికంగా ఆవిష్కరించింది.

భారతీయ మార్కెట్లో ఇది 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) పేరుతో ఆవిష్కరించబడుతుంది. ఈ కొత్త MPV గురించి ఇప్పటికే చాలా సమాచారం కంపెనీ వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఇండోనేషియాలో అడుగుపెట్టిన ఇన్నోవా జెనిక్స్ (Innova Zenix)

టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో ఈ లేటెస్ట్ MPV ని ఈ నెల 25 (2022 నవంబర్) న ఆవిష్కరించనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఈ కొత్త కారుకు టయోటా డీలర్లు అనధికార బుకింగ్స్ కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఇండోనేషియా మార్కెట్లో విడుదలైన 'ఇన్నోవా జెనిక్స్' మొత్తం డిజైన్‌లో ఎటువంటి పెద్ద మార్పులు లేకుండానే అడుగుపెట్టనుంది.

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'ఇన్నోవా హైక్రాస్' దాదాపు 'ఇన్నోవా జెనిక్స్' మాదిరిగానే ఉంటుంది. అయితే ఏమైనా చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకో మూడు రోజుల్లో తెలుస్తాయి. అయితే ఈ MPV ఇప్పటికే ఉన్న 'ఇన్నోవా క్రిస్టా' కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.

ఇండోనేషియాలో అడుగుపెట్టిన ఇన్నోవా జెనిక్స్ (Innova Zenix)

పరిమాణం పరంగా ఇన్నోవా హైక్రాస్ 4,755 మిమీ పొడవు, 1,850 మిమీ, ఎత్తు 1795 వెడల్పు మరియు 2850 మిమీ వీల్ బేస్ పొందుతుంది. కావున వాహన వినియోగదారులు మరింత మంచి కంఫర్ట్ అందిస్తుంది. ఇప్పటికే ఈ కొత్త MPV యొక్క డిజైన్ మరియు కొన్ని ఫీచర్స్ వెల్లడయ్యాయి. కావున ఇది చాలావరకు అప్డేటెడ్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది.

ఇన్నోవా హైక్రాస్ ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నిలువుగా ఉండే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్, ఏసీ వెంట్స్, వెనుక ఉండే ప్రయాణికుల కోసం డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు 360-డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.

ఇన్నోవా హైబ్రిడ్ టొయోటా యొక్క TNGA మోనోకోక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. కావున ఇందులో ఇన్నోవా హైబ్రిడ్ లో ఉండే అదే 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ ఉండే అవకాశం ఉండదు. అయితే ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు, ఈ వివరాలను కంపెనీ ఆవిష్కరణ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.

ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ప్రీ-కొలిజన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, డైనమిక్ రాడార్ బేస్డ్ క్రూయిస్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ హై బీమ్ వంటి ADAS ఫంక్షన్‌ల్స్ మొదలైనవి ఉంటాయి. అయితే ఈ MPV కోసం ఈ నెల 25 నుంచి అధికారిక బుకింగ్స్ ప్రారంభమవుతాయి. డెలివరీలు 2023 జనవరి నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 22, 2022, 13:00 [IST]
English summary
Toyota new innova zenix unveiled in indonesia details
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+