టొయోట కస్టమర్లకు అప్పుడే దీపావళి వచ్చేసింది.. హైరైడర్ డెలివరీలతో పండగ చేసుకోండి
టొయోట (Toyota) కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త హైబ్రిడ్ కారు హైరైడర్ (Hyryder) అతి తక్కువ కాలంలోనే మంచి బుకింగ్స్ పొందింది. అయితే కంపెనీ ఈ లేటెస్ట్ SUV యొక్క డెలివరీలను ఇప్పటికే అక్కడక్కడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు దీపావళికి ముందు మరో సారి డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ఇప్పుడు హైదరాబ్ నగరంలోని Harsha Toyota లో డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అదే సమయంలో హర్యానాలోని టయోటా డీలర్షిప్ మొదటి రోజే 32 యూనిట్ల హైరైడర్ SUV లను డెలివరీ చేసినట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే మొదటి బుక్ చేసుకున్న కస్టమర్లు దీపావళి లోపలే డెలివరీలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో టొయోట కంపెనీ విడుదల చేసిన కొత్త హైరైడర్ ధరలు రూ. 10.48 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా వచ్చాయి. ఈ లేటెస్ట్ హైబ్రిడ్ కారుని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన మొదటి మిడ్-సైజ్ కారు. ఇది 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 79 హెచ్‌పి పవర్ మరియు 141 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుంది.

అంతే కాకుండా ఇది హైరైడర్ మారుతి సుజుకి నుండి మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా పొందుతుంది. కావున ఇందులో 1.5-లీటర్ K15C ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

టొయోట హైరైడర్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. డోర్స్ మీద హైబ్రిడ్ బ్యాడ్జ్ వంటి వాటిని చూడవచ్చు. వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 4365 మిమీ పొడవు, 1795 మిమీ వెడల్పు, 1645 మిమీ ఎత్తు మరియు 2600 మిమీ వీల్ బేస్ కలిగి ఉంటుంది. దీని వల్ల క్యాబిన్ విశాలంగా ఉంటుంది, సుదూర ప్రయాణాలకు కూడా ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

కొత్త హైరైడర్ 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అంతే కాకుండా ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రిమోట్ ఇగ్నిషన్ ఆన్/ఆఫ్, రిమోట్ ఏసీ కంట్రోల్, డోర్ లాక్/అన్‌లాక్, స్టోలెన్ వెహికల్ ట్రాకర్ మరియు ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

హైరైడర్ SUV లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో కంపెనీ తన కొత్త హైరైడర్ విడుదల చేసినప్పటినుంచి కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో భాగంగానే ఇది ఇప్పటికి 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త కారు డెలివరీతో కస్టమర్లు దీపావళిని మరింత ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
Image Courtesy: Harsha Toyota Hyderabad


Click it and Unblock the Notifications








